Others

ఆశ్రీతులకు, ఆఫన్నులకు అభయప్రదాత మారుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీసీతారాముల అనన్యభక్తుడైన హనుమంతుడు అఖండ బ్రహ్మచర్య వ్రతపాలకుడు. అత్యంత శక్తి సంపన్నుడు. వీరత్వ, శూరత్వ, బుద్ధిమత్వ, దక్షత్వాది సద్గుణాలకు అవనిధి. పరమనీతిజ్ఞుడు, పరాక్రమధీశాలి. శాస్త్ర పారంగత విద్వాంసుడు. సరళ స్వరూపుడు. జీవిత సర్వస్వాన్నీ రామాంకితమొనర్చినవాడు. ఆయన రోమ రోమం రామమయం. ధర్మమే ప్రాణస్వరూపంగా గల మన పుణ్యభూమిలో గ్రామ గ్రామన చిన్నదో పెద్దదో హనుమంతుని ఆలయంగాని, మందిరం లేదా విగ్రహం గాని ఉండి తీరుతుంది. చివరకు వ్యాయామ కళాశాలలో కూడా హనుమ పటమో, మట్టితో చేసిన బొమ్మో పెట్టుకొని ఆయనకు పూజచేశాకే తమ సాధన ప్రారంభిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే హనుమంతుని ప్రభావం లేని ప్రదేశం ఈ భారతావనిలో లేదని చెప్పవచ్చు.
మనకు శక్తినీ, భక్తినీ, సమర్పణనూ, నిష్కపట సేవనూ, త్యాగ బలిదాన భావాలను హనుమ సదా ప్రసాదిస్తూనే వుంటాడు. పరమ ఆదర్శమూర్తియైన పవన తనయుని గాథ జ్యోతిర్మయ స్తంభ సదృశంగా మనకు కల్యాణ మార్గాన్ని, నిశ్చితమైన దిశను నిర్దేశిస్తూ ఉంటుంది. హనుమంతుడు ప్రసన్నుడవటానికి అంతగా సమయం పట్టదని, ‘‘ఓం శ్రీరామ జయరామ జయజయ రామ’ అంటూ నిష్కల్మష భక్తితో జపిస్తే చాలు ఆ రామభక్తుడు కరుణిస్తాడని, హనుమంతుని ఆరాధనవలన శీఘ్రంగా ఆధ్యాత్మిక ఫలాలు పొందవచ్చని చెబుతారు.
మనిషి తాను భగవదోన్ముఖుడు కావాలనీ, జన్మ - జరా- మరణాదులనుండి ముక్తి పొందాలనీ అనుకుంటే హనుమంతుడు ధ్యానిస్తే చాలు. భక్తులను ప్రాణాధికంగా ప్రేమిస్తూంటాడు. అమంగళాలను అంతం చేసి సన్మంగళాలను చేకూర్చే దివ్య శక్తిపరుడు హనుమ. శ్రీరామభక్తి, సద్గుణాల కారణంగానే హనుమంతుని స్మరణ అద్భుత ఫలితాన్నిస్తుంది. లౌకిక సమస్యలు ఎదురైనప్పుడు కార్యసాధనకై భక్తులు శ్రీరామ సమేతుడైన హనుమంతుని పూజించాలి. భక్తజనవ శంకరుడైన హనుమంతుడు తనను పూజించే వారి అభీష్టాలను నెరవేర్చేందుకు సదా సంసిద్ధుడై ఉంటాడు. హనుమంతుడు రామనామానే్న పరతత్త్వంగా స్వీకరించాడు. అదే తన జీవన సర్వస్వంగా భావించాడు. ఇతరమైన సాధనాలు హనుమ దృష్టిలో అత్యల్పాలు. శ్రీరామనామ మంత్రోచ్ఛారణ చేత అనంతకోటి ఫలాలు కలుగుతాయన్నది హనుమంతుని ప్రగాఢ విశ్వాసం. హనుమ వంటి పరాక్రశాలి, నిష్కామ సేవ లేకుంటే రామ రావణ యుద్ధంలో శ్రీరాముణ్ణి విజయలక్ష్మి వరించి ఉండేది కాదంటారు. యుద్ధకాండలో ‘హనుమంతుడు ఉంటే చాలు మనందరం లేకపోయినా శ్రీరామునికి నిశ్చయంగా విజయం లభించేది’ అంటాడు జాంబవంతుడు.
సేవకుడికి నిష్కామ భావమే కాకుండా సత్యం, బ్రహ్మచర్యం అవశ్యకమై ఉన్నా.... ఈ రెండింటినీ సాధించినవాడు హనుమంతుడు. ఆయన బల పరాక్రమాలకు హద్దు లేవు. కనుకనే హనుమ వజ్రాంగుడని కూడా పిలువబడ్డాడు. వానరుడైన హనుమ దాస్యభక్తి ప్రభావంతో రామదాసుడయ్యాడు. ఇట్టి స్థితిని ఏ వానరుడూ పొందలేకయాడు. హనుమంతుని ఆజన్మ బ్రహ్మచర్య పాలనా ధర్మం అపూర్వమైనది. ఇంతటి శ్రేష్ఠమైన వ్యక్తిత్వం మరెవరిలోనూ కనిపించదు. సర్వస్వ సాధనా సంపన్నుడు, రుద్రమూర్తి, అపరిమిత శక్తిశాలి అయిన హనుమవల్లనే శ్రీరామగాధ అమరమైందని అంటారు. నేటి విషమ స్థితిలో మానవమాత్రులకు - విశేషించి బాలురకు, యువకులకు హనుమదుపాసన అత్యంత ఆవశ్యకమై వుంది. బుద్ధి, వీర్యబలాదులను ప్రసాదించి హనుమంతుడు తన భక్తులను సంరక్షిస్తూ వుంటాడు. భూత ప్రేత పిశాచాదులు ఆ మహావీరుని నామోచ్ఛారణ మాత్రం చేతనే పారిపోతాయి. మానసిక దౌల్భల్య సంఘర్షణలో ఆ స్వామి సహకారం నిశ్చయంగా లభిస్తుంది.
భగవతత్త్వ విజ్ఞానానికి, భక్తికి, మహోత్తమ భావాలతో భగవదనురక్తి సేవలకు, వ్యక్తిత్వ పూర్ణ వికాసాలకు హనుమంతుని మించిన వారు లేరు. ఆయన ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుడి వద్ద విద్యభన్యసించాడు. ఆ మహనీయుని ధ్యాన, బ్రహ్మచర్యానుష్ఠానం వలన నిర్మలాంతఃకరణంలో సమగ్రమైన భక్తి కలుగుతుంది. హనుమంతుని యందు శక్తిసంచయ సదుపయోగాలు, భగవద్భక్తి నిరాకారం మొదలైనవి సంపూర్ణంగా ఉండడం చేత ఆ సద్గుణాలన్నీ ఆయనను ఆరాధించేవారికి అలవడతాయి. రామ రహహ్యోపనిత్తులో హనుమంతుడు మహాతత్త్వవేత్త అన్న విషయం వివరించబడింది. సనక, సనందన, సనత్కుమార, సనాతన సోదరులు నలుగురూ హనుమంతుని ద్వారా శ్రీరామ మంత్ర రహస్యాలను తెలుసుకునేవారట. ఆయన దగ్గరే అనేక ఋషివర్యులూ, మునిసత్తములూ, ప్రహ్లాదుడూ శిష్యరికం చేశారని పురాణ వచనం. హనుమంతునకు స్వయంగా శ్రీరాముడే ఉపనిషత్ తత్త్వాన్ని బోధించినట్లు ముక్తి... షత్తులో చెప్పబడింది. పరాశుర సంహిత, సుదర్శన సంహిత, హనుమద్గాహ్వరం గల ప్రామాణిక గ్రంథ రత్నాలలో హనుమల్లీలూ, మహిమలూ, అనుష్ఠాన విధానాలు చక్కగా వర్ణించబడ్డాయని పెద్దలు చెబుతారు. మన మధ్యనే తేజరిల్లుతున్న హనుమంతుని శ్రద్ధ్భాక్తులతో, విశేషాశక్తి.... ద్వారా రాఘవేంద్ర స్వామి, తులసీదాసాదులు ఈ యుగంలోనే ప్రత్యక్షం చేసుకుని ఇంకా ఎందరో భక్తులు ఆ అద్భుత శక్తిశాలిని సందర్శించడం జరిగింది.

-చోడిశెట్టి శ్రీనివాసరావు