Others

అఖండ జ్యోతిస్వరూపమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిరణ్యకశ్యపుడు మహాతపస్వియై ప్రపంచం అంతటిలోనూ ఎదురులేని మహాశక్తివంతుడు అయినాడు. తనను ఎదిరించగల వ్యక్తి ఎవడైనా ఈ భూమి మీద ఉంటే వచ్చి తనను గెలవ వలసిందిగా సవాలు విసిరాడు.
హిరణ్యకశ్యపుణ్ణి ఎదిరించగల ధీరుడు ఎవ్వడూ ముందుకు రాలేదు. దానితో అతడు అహంభావంతో విర్రవీగి- ఈ త్రిలోకాలకూ అధిపతి తానే అనీ, ఈ సర్వసృష్టికీ కర్త తానేననీ ప్రకటించుకొనసాగాడు.
అతని భార్య లీలావతి తన భర్త చేస్తున్న ఆ ప్రకటనను ఆమోదించలేక పోయింది. భర్తను వ్యతిరేకించడం భార్యకు ధర్మంకాదు కాబట్టి వౌనంగా ఉండిపోయింది.
‘ఈ త్రిలోకాలకూ అధిపతిని నేనే.. నన్ను ఎదిరించగలవాడు ఎక్కడా లేనే లేడు. అటువంటప్పుడు ఈ సృష్టికి అంతటికీ కర్తను నేనే కాదా?’- అని ప్రశ్నించాడు హిరణ్యకశ్యపుడు భార్య లీలావతిని చూస్తూ లీలావతి వౌనం వహించింది.
‘ నీ భావాన్ని మాటలలో చెప్పాలి. ఈ సృష్టికి అంతటికీ కర్తను నేను అవునా? కాదా!- ’అన్నాడు హిరణ్యకశ్యపుడు లీలావతిని చూస్తూ.
‘త్రిలోకాధిపతి మీరే.. కాని సృష్టికర్త మీరు కాదు’ అంది లీలావతి ప్రశాంతంగా, నిర్భరంగా.
‘అయితే నాకు సరైన సమాధానం కావాలి’ అన్నాడు హిరణ్యకశ్యపుడు.
సృష్టికర్త నేను కాకుంటే ఇంకెవరో చెప్పాలిగదా! అన్నాడు. హిరణ్యకశ్యపుడు లీలావతి వైపు చూచి గద్దిస్తూ.
నిండు గర్భివతియైన లీలావతి ఆమె గర్భంలోనుండి విన వచ్చింది- ‘ఈ సృష్టికి అంతటికీ కర్త సర్వవ్యాప్తియైన మహావిష్ణువు’అని- కొద్దిరోజులలో ఆమె గర్భంనుండి బయటికి రానున్న ప్రహ్లాదుని నోటినుండి- గర్భస్థ శిశువులందరికీ మూడవ నెల నుండే అన్ని విషయాలూ తెలుస్తాయి కాబట్టి.
‘సర్వవ్యాపియైన మహావిష్ణువా? అతణ్ణి చూడాలి నేను’ అన్నాడు హిరణ్యకశ్యపుడు.
‘అతణ్ణి చూడడానికి ఈ కళ్లు పనికిరావు’అని మళ్లీ లీలావతి గర్భంనుండి
వినిపించింది.‘మరి ఎలాగ?’అని ప్రశ్నించాడు హిరణ్యకశ్యపుడు.
‘మూడవ నేత్రంతో.’ ‘మూడవ నేత్రంతోనా? భూమధ్య దృష్టి కేంద్రీకరణం ద్వారానా?’
‘మూడవ నేత్రం అంటే ‘్భమి, ఆకాశాల పరస్పర అనువర్తనను కళ్లకు కట్టినట్లు చూపించగల ‘ఖగోళ విజ్ఞానం’అనగా ‘జ్యోతిశాస్త్రం’ ‘ఈ రహస్యం చాలామంది మహావిజ్ఞ్ఞానవంతులకు సైతం తెలియదు.
‘జ్యోతిశ్శాస్త్రం సర్వవ్యాప్తియైన మహావిష్ణువును చూపిస్తుందా?’ ‘అవును. ఆ మహావిష్ణువు- వేరే ఎవ్వరోకాడు. నిరుపమాన జ్యోతిర్మూర్తి అయిన ‘సూర్యుడు’. భూమిమీద ఉన్న సర్వజీవులకూ ప్రతిరోజూ పనె్నండు గంటలసేపు ఎదురుగా నిలబడి కానవస్తుంటే ‘సూర్యుడే!’ ‘్భమి మీద సర్వజీవులకూ సృష్టికర్త ఈ సూర్యుడే కావచ్చు. మిగతా సృష్టికి అంతటికీ ఈ సూర్యుడే సృష్టికర్త ఎలా అవుతాడు? ‘బ్రహ్మా సూర్యసమంజ్యోతిః’- సర్వవిశ్వసృష్టికీ మూలకారకుడై, బ్రహ్మ విష్ణుమహేశ్వర రూపుడై ఉన్నది ‘బృహత్ సూర్యమండల’రూపంలో ఉంటే బృహత్ జ్యోతిస్సే- అని వేదాలే స్పష్టంచేశాయి. ‘అసౌ’ఆదిత్యాబ్రహ్మా’- ‘ఈ సూర్యుడే మన సృష్టికర్త’అని నిర్ద్వంద్వంగా ప్రకటించాయి. అలా జరిగింది వారిద్దరిమధ్య సంభాషణ. ఆకాశంలో ఒక చిన్న అగ్నిగోళంగా కానవస్తూ రోజుకు ఒకసారి తూర్పునుండి పడమరకు భూమిచుట్టూ ప్రదక్షిణం చేస్తుండే ఈ ‘సూర్యుడు’ ఈ అనంతమైన భూమికీ, దానిపైన జీవిస్తున్న కోటానుకోట్ల జీవులందరికీ ‘సృష్టికర్త’అంటే నమ్మడం ఎలా? అనేదే మనందరికీ ఎదురయ్యే సమస్య.
ఈ చిక్కుముడి విడిపోవాలంటే- మనం చేయాల్సినది- అగస్త్యమహర్షి- రామ, రావణ యుద్ధ ప్రారంభ సమయంలో- రామునికి చెప్పిన ఆదిత్య హృదయం’ పునశ్చరణ చేసుకొనడం మాత్రమే.
ఈ సూర్యుడే సర్వదేవతా స్వరూపుడు. ఇతడే తన కిరణాలతో అన్ని లోకాలనూ రక్షిస్తున్నాడు. ఇతడే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపుడు. భూమిపైన గల సర్వజీవుల సృష్టి, స్థితి, లయములకు కారకుడు ఇతడు. ‘దేవుడు’అంటే ‘ప్రకాశ స్వరూపుడు’అని మాత్రమే.

సన్నిధానం యజ్ఞనారాయణ మూర్తి