Others

ప్రియాంకా.. మజాకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా తారల క్రేజ్ అందరికీ తెలిసిందే. కెరీర్ సరైన గాడిలో పడిందంటే డబ్బుకు కొదవుండదు. డిమాండ్ చేసినంతా చెల్లించి కాల్షీట్లు తీసుకుంటారు. బాలీవుడ్ హాట్ భామ ప్రియాంక చోప్రా ఇప్పుడలాంటి క్రేజ్‌నే ఎంజాయ్ చేస్తోంది. హాలీవుడ్‌కు వెళ్లొచ్చిన తరువాత -బాలీవుడ్ హీరోల రేంజ్‌ని మించిపోయి పాపులార్టీ వచ్చేసిందామెకు. లేటెస్ట్‌గా షారుఖ్ సినిమా కోసం ప్రియాంక చోప్రా 20 కోట్లు డిమాండ్ చేసిందన్న వార్త మర్చిపోకముందే, ప్రియాంకకు నిమిషానికి 33 లక్షలు ఇవ్వడానికీ సిద్ధపడ్డారట. నిమిషానికి 33 లక్షలా? అని నోరెళ్లబెట్టినోళ్లకి -అవుననే సమాధానమే వస్తోంది బాలీవుడ్ నుంచి. వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్‌లో ఓ అవార్డుల వేడుకలలో ప్రియాంకతో ఓ కార్యక్రమాన్ని చేయాలని అనుకున్నారట. అడిగిన వెంటనే నో అనకుండా ఓకే కూడా చెప్పేసిందట. అందుకోసం కోటి 30 లక్షలు డిమాండ్ చేసిందని వినికిడి. అంటే ఒక పాటకోసం నాలుగు నిమిషాలు నటిస్తే, ఇంత పెద్దమొత్తం తీసుకుంటానంది. అంటే నిమిషానికి 33 లక్షలు వసూలు చేస్తున్నట్టే లెక్క. ఈ వేడుక స్పెయిన్‌లో త్వరలో జరగనుంది. ఎంతైనా ప్రియాంక కాస్ట్లీ గురూ!