Others

సర్వ దేవతాస్వరూపం .. గోమాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం భృగు వంశములో జన్మించిన చ్యవన మహర్షి గొప్ప నియమంతో గర్వం, క్రోధం, హర్షం, శోకం పరిత్యజించి పనె్నండేళ్ళపాటు నీటిలో ఉండిపోయాడు. కర్రలాగ, నీటిపై తేలి ఉండే అతనివద్దకు తెలియక వచ్చిన బెస్తవారు విసిరిన పెద్ద వలలో చ్యవన మహర్షి చిక్కుకొన్నాడు. మహర్షిని గమనించిన ఆ మత్స్యకారులు భయపడుతూ తమ అపరాధాన్ని మన్నించమని అడిగారు. చ్యవనుడు ‘ఈ చేపలు నా సహజీవనమయ్యాయి. వాటితోడిదే నా లోకము, అవి మరణిస్తే నా మరణంతో సరిసమానము’ అన్నాడు. మృతులైన చేపలతో చ్యవనుడు ఉండిపోయాడు.
అంత బెస్తవారు భయపడి జరిగిన వృత్తాంతాన్ని మహరాజైన నహుషునికి విన్నవించారు. నహుషుడు తన మంత్రులతోనూ పురోహితులతోను అక్కడికి చేరి మహర్షిని పూజించి ‘నేను మీకేమి ఉపకారం చేయగలను సెలవివ్వండి’ అనగా దానికి చ్యవనుడు ఈ బెస్తవారు శ్రమపడ్డారు. నా యొక్క చేపలయొక్క విలువ వీరికి చెల్లించండి అన్నాడు. దానికి ప్రతిగా పురోహితునితో వీరికి వెయ్యి బంగారు నాణాలు ఇవ్వండి అన్నాడు రాజు. అప్పుడు చ్యవనుడు ఆ వెయ్యి బంగారు నాణాలు నాకు తగిన వెలకాదు. తగిన ధర చెల్లించండి అన్నాడు. అప్పుడు నహుషుడు ‘మీరు నిషాదులకు లక్ష సువర్ణ నాణాలు ఇవ్వండి అని చెప్పి చ్యవనునితో మహర్షీ మీకిది తగినదేనా మీరింకేమైనా కోరుకుంటున్నారా’ అని అడిగాడు.
దానికి చ్యవనుడు ‘నాకు లక్షముద్రల వెలకట్టకండి మీ మంత్రులతో ఆలోచించి నాకు తగిన వెల ఇప్పించండి అన్నాడు. అప్పుడు నహుషుడు ఈ మత్స్యకారులకు కోటి సువర్ణముద్రలివ్వండి. ఇదికాకపోతే ఇంకా ఎక్కువ ఇవ్వాలి అని పురోహితునితో అన్నాడు.
అప్పుడు చ్యవనుడు ‘నాకిది యోగ్యంకాదు. మీరు మీ బ్రాహ్మణులతో ఆలోచించి తగిన మూల్యం ఇవ్వండి’ అన్నాడు.
అప్పుడు నహుషుడు నా అర్థరాజ్యం లేదా మొత్తం రాజ్యం ఈ నిషాదులకు ఇచ్చేస్తాను. మీ ఆలోచన ఏమిటి’ అన్నాడు.
దానికి చ్యవన మహర్షి ‘మీరు, మీ మంత్రులు, ఋషులతో సంప్రదించండి. మీరు చెప్పిందేమీ నాకు సమ్మతం కాదు’ అన్నాడు.
అప్పుడు చింతాక్రాంతుడైన నహుషుడు తన మంత్రులు సహచరులతో సంప్రదించసాగాడు. కేవలం కందమూలాలు స్వీకరించే ముని ఒకరు నహుషునితో రాజా నేను గోగర్భం జనితుడిని. ఈ ఋషి సంతృప్తిచెందే విధానం నాకు తెలుసును’అన్నాడు. అప్పుడు నహుషుడు ‘ఓ ముని వర్యా చ్యవన మహర్షి మూల్యాన్ని చెప్పి మా రాజ్యాన్ని, వంశాన్ని ఉద్ధరించండి. మేము దుఃఖంలో మునిగియున్నాం. కడతేర్చండి’ అన్నాడు. అప్పుడా మునివర్యుడు ‘బ్రాహ్మణుడు అన్ని వర్ణాల్లోకి ఉత్తముడు. వారికి, గోవులకు వెలకట్టలేము. కాబట్టి చ్యవనునికి ప్రతిగా ఒక గోవును వెలగా ఇవ్వండి’అన్నాడు.
అప్పుడు నహుషుడానందించి చ్యవనుడి చెంతకేగి ‘బ్రహ్మర్షీ నేను మిమ్మల్ని ఒక గోవునిచ్చి కొంటున్నాను. దయచేసి అంగీకరించండి’ అన్నాడు. సంతృప్తుడైన చ్యవనుడు ‘మీ వెలకు నేను అంగీకరిస్తున్నాను. ఈ లోకంలో గోవులకు మించిన విలువలేదు. గోవులు సంపదలకు మూలం. దేవతలకు ఉత్తమమైన నెయ్యిని ప్రసాదిస్తున్నవీ గోవులు. పితికితే అమృతానే్న ప్రసాదిస్తాయి. గోసముదాయం ఎక్కడ ఊపిరి తీసుకొంటుందో అక్కడ పాపం నశిస్తుంది. గోవులు సమస్త దేవతారూపాలు.’ అన్నాడు.
చ్యవనుడు ‘మత్స్యకారులారా మీరు ఇచ్చే ఈ గోవును స్వీకరిస్తున్నాను. మీ గోదాన మహిమవలన మీరు, ఈ మరణించిన చేపలు స్వర్గానికి అర్హులు’ అన్నాడు.

- పట్టిసపు శేషగిరిరావు