Others

ఆకాంక్షలు తీర్చే అనాదినాథుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆపదమొక్కులవాడు, అనాథ రక్షకుడు, అలిమేలు మంగపతి ఎక్కడ ఎవరు పిలిచినా ఓ అని పిలిచే ఇలువేల్పుగా అందరికీ పరిచితుడే. ఆ నారాయణుడే ద్వాపరయుగంలో మనిషి మనిషి పక్కననిలబడి ఎదలోను నేనే, ఎదరా నేనే అని చెప్తూనే ద్వాపరాంతంలో చర్మచక్షువులకు కనిపించకుండా దూరం అయినాడు. అట్లా దూరం అయినా ఎదలోని దేవుణ్ణి ఎక్కడెక్కడ కనబడుతాడా అని వేయి కనులతో వెతకానారంభించారు కృష్ణ్భక్తులు వారే కాదు వకుళామాత కూడా శ్రీనివాసుని కోసం ఎదురుచూసింది. తన చేతులతో కల్యాణతిలకం దిద్దాలని కోరింది. ఇక ఆళ్వారులు, భక్తులు అందరూ ఆ నారాయణుడి కలియుగావతారం కోసం ఎదురుచూస్తుండగా అఖిల లోకాలు ఆశ్చర్యపోయేట్టుగా వేదనలు దూరంచేస్తూ వేంకటేశ్వరునిగా ఆవిర్భవించాడు శ్రీమన్నారాయణమూర్తి. లోకాలన్నింటిని తన కనుచివర్లనుంచే చల్లగా కాపాడే తల్లి పద్మావతియై ఏతెంచింది.
వారిద్దరికీ వైభోగంగా వకుళామాత, బ్రహ్మాదిదేవతలూ కల్యాణం జరిపించారు. ఆనందనిలయాన్ని తమ వాసంగా చేసుకొన్నాడా పన్నగశయనుడు. ఇక ఎందరో భక్తులు వచ్చి తనకు సేవచేసుకొనే వెసలు కల్పించాడు. ఆ భక్తులతో పాచికలాడే సరదాను తీర్చాడు. సంతోషతరంగాలలో తేలియాడుతుండే భగవంతుడు అర్చావతారుడుగా నిలిచాడు. నిజభక్తులతో మాట్లాడే పద్ధతిమార్చాడు. చిరునవ్వులు చిందిస్తూ వౌనాన్ని స్వీకరించినట్టుగా నిలువెత్తు విగ్రహమూర్తిగా కొలువుతీరాడు.
కాని ఆర్తిగా పిలిచే భక్తులను ఆర్ద్రతతో ఆదరిస్తాడన్న ఖ్యాతినార్జించాడు. అందుకే ఖండాతరాలనుంచి కూడా భక్తులు నేటికీ వస్తునే ఉన్నారు. కలియుగంలోని కలి మహిమలను తట్టుకోలేని వారు
‘‘స్వామి మమ్ము కరుణించవా! మమ్ము పాలింప నడిచిరావా.. ’’ అంటూ వేదనాభరితులయ్యారు. నిన్ను చూడక మేముండలేము అంటూ వేగిర పడసాగారు. నడవలేక ఆయాసంతెచ్చుకున్నారు. అంతే కరుణాంతరంగుడు భక్తపరాధీనుడు అయిన స్వామి ఎవరికెక్కడా కోరుకుంటే అక్కడే దర్శనం ఇవ్వసాగాడు.. తన్మయులైన తనివితీరా ఆ కోనేటిరాయుణ్ణి తమ తమ నెలవుల్లోనే కొలువుండమని మనసారా కోరుకున్నారు. అట్లా ఊరూరా వేంకటేశ్వరుడు కొలువైయ్యాడు. నేడు వాడవాడలా గోవిందుడు తనకు తానై వచ్చినా తమనెలవుల్లో నిలిచిన నిత్యకల్యాణవసంతరాయుణ్ణి కనులారా వీక్షించాలని బయలుదేరుతునే ఉన్నారు భక్తులు. ఎక్కడ స్వామి ఆవిర్భవించినా, ఎక్కడ స్వామి పాదం మోపినా అక్కడకంతా వెళ్లే జనులు ఎక్కడా చూచినా కనిపిస్తారు. స్వామిని మెప్పించిన అగ్రగణ్యుడనే చెప్పుకోవాలి ఈ హిందూరావు.
హిందూపురానికి ధర్మాచరణలో మిక్కిలి ఆసక్తి వున్న హిందూరావు సామంతరాజుగా ఉండేవాడు. అతని తల్లిదండ్రులు ఎల్లవేళలా వేంకటేశ్వరుని తలుస్తుండేవారు. ప్రతిఏటా తన తల్లిదండ్రులను కలియుగావతారుడైన వేంకటేశ్వరుని దర్శనానికి తిరుపతికి పంపించేవాడుహిందూరావు. అంతేకాక తన పాలనలోన ఉన్న జనులందరూ కూడా ఆ ఆపన్నహస్తుని దర్శించుకుంటే సకల బాధలు నివారణ అవుతాయని చెప్పేవాడు. వారు ఆ బాలాజీని దర్శించటానికి తాను సాయం అందించేవాడు. ఇట్లాకొంతకాలం గడిచిన తరువాత హిందూరావు తల్లిదండ్రులు ముసలివారయ్యారు. వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లడానికి అసక్తులయ్యారు. కాని ప్రతినిముషమూ శ్రీవారిని దర్శించుకోలేదని చింతించేవారు.
వారి కోరికను మన్నించమని హిందూరావు ఆ వెంకన్ననే వేడుకునేవాడు. భక్తపరాధీనుడైన ఆ వేంకటేశ్వరుడు ఒకరోజు హిందూరావు కలలో కనిపించి నీ కోరిక తీర్చడానికి నేనే హిందూ పురం వస్తాను. నాకోసం ఓ కోవెలను కట్టమని కలలో ఆదేశించాడట. అపరిమితానందంతో హిందూరావు అప్పటికప్పుడు తన మంత్రిపురోహితులను ఆగమ శాస్త్ర పండితులను పిలిపించాడు. వారందరి సాయంతో దేవాలయనిర్మాణానికి పూనుకొన్నాడు.
అందరి ఆకాంక్ష తీరేట్లుగా దేవాలయ నిర్మాణం జరిగింది. అందులో వేంకటేశ్వరుడు వేంకటరమణుడుగా కొలువైయ్యాడు. ఇది జరిగి సుమారుగా 643సంవత్సరాలు జరిగినా నేటికీ స్వామిని దర్శించడానికి లక్షలాదిగా భక్తులు నిత్యం వస్తూనే ఉంటారు. 2004లో శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు స్వామిని దర్శించి శ్రీ చక్రాన్ని స్థాపించారిక్కడ.
కోరి కొలువైన ఆ వేంకటేశ్వరుడే కాలక్రమంలో పేట వేంకటరమణుడుగా ఖ్యాతి నార్జించాడు. స్వామికి నిత్యోత్సవాలు, కల్యాణాలు ఎల్లవేళలా జరుగుతుంటాయిక్కడ. అంతేకాక మాఘశుద్ధ పున్నమినాడు స్వామివారికి బ్రహ్మోత్సవాలు కనులపండుగగా జరుపుతారు. ఈ స్వామిని దర్శించుకున్నవారికి అనారోగ్య బాధలు దూరమవుతాయని ప్రసిద్ధి. గ్రహపీడలతో బాధలుపడేవారు ఈ స్వామికి మొక్కుకుని దర్శించుకుంటే గ్రహపీడలు కూడా వదులు తాయని ఇక్కడిస్థానికులు చెబుతారు.
హిందూపురంలోని శ్రీపేట వేంకటరమణుని దర్శనం సర్వపుణ్యప్రదమని స్థలపురాణాలు వక్కాణిస్తున్నాయి.

- జి. కల్యాణి