అమృత వర్షిణి
టెర్రకోట.. జ్ఞాపకాల తోట
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చైనాలో మేం చేసిన పర్యటన జ్ఞాపకాలు ఇంకా మదిలో మెదలుతూనే ఉన్నాయి. మా ప్రయాణం జరిగి అప్పుడే ఏడాది కావస్తున్నా నిన్న మొన్నటి పర్యటనగా ఉంది. అందుకే ఆనాటి విశేషాలు మరోసారి గుర్తు చేస్తున్నా...
గత సెప్టెంబర్న మా చైనా యాత్రలో భాగంగా 30వ తేదీన షాంఘై పట్టణం నుండి దేశీయ విమానయానం డొమెసిటక్ ఎయిర్వేస్లో ప్రయాణించి షియాంగ్ పట్టణాన్ని చేరుకున్నాం. షాంఘై నుండి షియాంగ్కి 2 గం. 20 ని.ల ప్రయాణం మాత్రమే. రాత్రి చేరేసరికి 8.20 కావడంవల్ల ఎయిర్‌పోర్టులో మాకై ఎదురుచూస్తూ ప్లకార్డ్ పట్టుకున్న గైడ్ మిస్ పియోనిని కలుసుకుని సరాసరి వెళ్లి ఇండియన్ రెస్టారెంట్లో డిన్నర్ పూర్తి చేశాం. తరువాత హోటల్ బెస్ట్ వెస్టర్న్‌లో మా బస చేరేసరికి రాత్రి 10.30 గం. అయింది.
మరుసటి రోజు ఉదయం త్వరగా తయారై అల్పాహారం ముగించుకొని కోచ్‌లో ‘టెర్రాకోట’ వర్క్‌షాప్‌నకు బయల్దేరాం. ప్రఖ్యాతి గాంచిన టెర్రాకోట సైన్యం, గుర్రాలు మట్టితో ఎలా తయారుచేస్తారో ప్రత్యక్షంగా చూసి చాలా ఉద్వేగానికి లోనయ్యాం. ఆ తరువాత అక్కడి నించి బయలుదేరి దగ్గరలోనే ఉన్న టెర్రాకోట మ్యూజియంకి చేరుకున్నాం.
మొదటగా లిషాన్ గార్డెన్ నుంచి షటిల్ బస్ సర్వీసులు యాత్రీకులను టెర్రాకోట మ్యూజియంకి తీసుకొని వెళతాయి. తిరిగి తీసుకొని వస్తాయి. అలా మేం షటిల్ బస్‌లో ప్రయాణించి మ్యూజియం ఆఫ్ క్విన్ టెర్రాకోట వారియర్స్ అండ్ హార్సెస్‌గా ప్రఖ్యాతి గాంచిన ప్రదేశం చేరేసరికి 10 ని. పట్టింది. లోపలికి ప్రవేశించగానే బారులు తీరిన సైనికులు వేల సంఖ్యలో గుర్రాలు, యుద్ధ రథాలు ప్రపంచంలోని యాత్రీకులందరినీ రా రమ్మంటూ ఆహ్వానించాయి. మట్టితో చేయబడ్డ సహజ పరిమాణం ప్రతిమలు ఇవన్నీ. టెర్రాకోట అనే విచిత్రమైన ఆర్ట్‌తో చేయబడి సహజ వర్ణాలను కలిగి ఉన్నాయి.
ఈ మ్యూజియంను ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వింతలలో 8వ వింతగా చేర్చతగిన ప్రాముఖ్యత కలిగినది. ఈ మసోలియం (సమాధులు) 20వ శతాబ్దపు పురావస్తు తవ్వకాలలో బయటపడ్డ అతి గొప్పదిగా భావించబడేది అయినది. షియాంగ్ పట్టణంలోని ‘షాన్హి’ ప్రావిన్స్‌లో వున్న చక్రవర్తి కిన్ షి హంగ్ యొక్క సమాధిని అతని మరణానికి చాలా పూర్వమే చాలా సంపద, కళాత్మకతతో, అనేక అద్భుత విశేషాలతో తానే నిర్మించుకున్నాడు. ఈ సమాధులు లేదా మసోలియం ఆఫ్ టెర్రాకోట వారియర్స్ అండ్ హార్సెస్‌గా ప్రఖ్యాతి పొందిన దాన్ని చూడటానికి చైనా సందర్శించే ప్రతి టూరిస్ట్ తప్పనిసరిగా చూసి ఆనందించాల్సిన గొప్ప విశేషం అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఏటా మిలియన్ల సంఖ్యలో ప్రపంచం నలుమూలల నుండి టూరిస్టులను ఆకర్షించేదిగా ఈ ప్రదేశం ఉన్నదంటే అది ఎంత అద్భుతమైనదో మనకి అర్థమవుతుంది.
షియాంగ్ పట్టణంలో ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుకుంటున్న సమయంలో రకరకాల విశేషాలు, టెర్రకోట గుర్రాలు, సైనికులు, ఉపకరణాలు బయలుపడటం, ఈ విషయం పురావస్తు శాఖ వారికి సమాచారం అందడంతో వారు ఇక్కడ తవ్వకాలు జరిపి ఇవి ‘కిన్’ రాజవంశీకుల (క్రీ.పూ.211-206) ఉపకరణాలుగా ‘క్విన్ షి హంగ్’ సమాధిగా నిర్ధారించడం జరిగింది. ఇది ప్రపంచ ప్రఖ్యాతి పొందడంతో అప్పటి నుండి షియాంగ్ పట్టణం టెర్రాకోట సైనికులు, గుర్రాలు, రథాలు, సంపదకి అడ్రస్‌గా మారి పోయింది. చైనా ప్రభుత్వం ఈ ప్రదేశంలో మ్యూజియంను నిర్మించి వాటిని యథారూపంలో పదిలపరచింది.
కిన్ షి హంగ్ చక్రవర్తి 13 సంవత్సరాల వయసుకే (క్రీ.పూ.246) సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడు చైనాలోని అనేక ప్రావిన్స్‌లను జయించి తన ఏలుబడిలోకి తీసుకున్నాక తాను మరణించాక తనను సమాధి చేయబోయే సమాధి (మసోలియం)ని 11 సం.ల పాటు నిర్మించుకున్నాడు. 56.25 స్క్వేర్ కి.మీ. ఈ సమాధిలో గొప్ప సంపద - సైనికులు, గుర్రాలు, యుద్ధ రథాలు, ఆయుధాలు, అనేక విలువైన జేడ్స్ వంటి జాతి రత్నాలు గొప్ప చైనీస్ ఆర్ట్ కలిగిన పోర్స్లిన్ ఉపకరణాలు మొ. వాటిని వాటి సహజ పరిమాణాలలో 7 లక్షల మంది పనివారు, నిపుణుల సహాయంతో నిర్మించుకున్నాడు. పురాతన కాలంలో చైనీయులు ఎంతటి అభివృద్ధి పథంలో ఉన్నారో తెలిపే మరో విశేషం అప్పుడు ప్రతి పౌరుడు కలిగి వున్న వెదురు బోర్డుతో చేయబడిన వారి ఐడెంటిటీ కార్డు వంటి దాన్ని చూసి నిజంగా ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురైనాము. షాన్షి ప్రావిన్స్ ప్రాంతంలోని 3 కాలువల నుండి తవ్వి తీసిన ‘రాగి’ని కరిగించి కౌఫిన్ (శవపేటిక) యొక్క వెలుపలి భాగంలో నింపారు. రాజసౌధాలు, రాజమార్గాలు, కుడ్యాలు, గేట్లు, విశాలమైన ప్రాంగణాలు, ఆఫీసులు నిర్మించారు. అనేక రకాల ‘కంచు’తో చేయబడ్డ గొప్ప నగిషీలు, పనితనం కలిగిన ఆయుధాలు, రాతి ఆయుధాలు, విలువైన జేడ్ వంటి జాతి రత్నాలు, సంపద అనేకం సమాధి గుంతలలో నింపారు.
కంచుతో చేయబడ్డ యుద్ధ రథాలు (్ఛరియట్స్) వున్న పిట్, రాతి ఆయుధాలున్న గుంత, కవచాలు, శిరస్త్రాణాల గుంత, అరుదైన పక్షుల గుంత, వన్య మృగాల గుంత, సైనికులు, గుర్రాలు వున్న గుంతలు, పశువుల కొట్టాలున్న గుంతలు, విలువైన జాతి రత్నాలు, ధనసంపద కలిగిన గుంతలు మొత్తం కలిసి 149 గుంతలు, 196 సమాధి ప్రదేశాలు కనుగొన్నారు. వీటిని పిట్-1, పిట్-2, పిట్-3గా పిలుస్తారు.
తరువాత మేము మా గైడ్ వెంట రాగా పగోడాను దర్శించడానికి వెళ్లాం.
బిగ్ వైల్డ్ గూస్ పగోడా
దీనినే చైనీయులు ‘దయాన్ తా’ అని కూడా పిలుస్తారు. ఇది షియాంగ్ పట్టణానికి దక్షిణ సబర్బన్ ప్రాంతంలో ఉంది. ఇది డా సి ఇన్ అనగా ద టెంపుల్ ఆఫ్ థాంక్స్ గివింగ్లో భాగంగా ఉంది. ‘తంగ్’ రాజ వంశీకుల కాలంలో మాస్టర్ జయుమాన్ జంగ్ ను ఆలయం అధిపతిగా నియమించారు. అతడు క్రీ.శ.652లో ఈ టెంపుల్లో ఒక పగోడాను నిర్మించి దానిలో మన భారతదేశం నుండి తెచ్చిన పవిత్రమైన బౌద్ధ ప్రవచనాలను భద్రపరిచాడు. అతడు 12 సంవత్సరాలపాటు ఇదే టెంపుల్లో వుండి బౌద్ధ ప్రవచనాలను 1335 సంపుటాలుగా అనువదించాడు. ‘పిల్గ్రిమ్స్ ఆఫ్ ది వెస్ట్’ నవల చైనాలో అతిగా చదివేదిగా ప్రసిద్ధి పొందింది. దానిలో మాస్టర్ జుయుమాన్ జంగ్ మరియు అతని ముగ్గురు శిష్యుల గురించి విశేషంగా తెలుస్తుంది. ఈ పగోడా 64 మీటర్ల ఎత్తుతో ఇటుకలు, కలపతో నిర్మించబడింది. ఇక్కడే చరిత్రకారుడైన ‘హ్యూయన్ త్సాంగ్’ అతి పెద్ద ప్రతిమ ఉంది. పగోడాను చూసి మేం సిటీవాల్ సందర్శనకు బయల్దేరాం.
షియాంగ్ సిటీ వాల్
‘మింగ్’ రాజవంశీకుల కాలంలో (1368-1644) మొదటి చక్రవర్తి అయిన జు యు మాన్ జంగ్ ఒక ఋషి సలహాపై ‘తంగ్’ రాజుల కాలంలో అప్పటికే కట్టబడిన ‘సిటీ వాల్’ను పెద్దదిగా, సురక్షితంగా ఆధునీకరింపజేశాడు. ఇది ప్రపంచం మొత్తంలో చెక్కుచెదరక ఉన్న పురాతనమైన అతి పెద్ద మిలిటరీ రక్షక వ్యవస్థగా ఉంది.
ఈ సిటీ వాల్ ఎత్తు 40 అడుగులు. దీని పై భాగం 40-46 అడుగుల వెడల్పుతో, గోడ అడుగుభాగం 50-60 అడుగుల వెడల్పుతో ఉంది. ఇది షియాంగ్ సిటీ చుట్టూ 13.7 కి.మీ. పొడవునా ఉంది. దీని పక్కనే లోతైన కందకం కూడా ఉంది. దీనికి ప్రతీ 120 మీటర్ల వద్ద బాల్కనీలు, దాని వద్ద సైనికులు కాపలా ఉండే బురుజులు ఏర్పాటు చేశారు. అక్కడ నుండి సైనికులు నిరంతరం శత్రువులు కోట గోడ పైకి రాకుండా కాపలా కాసేవారు.
పురాతన కాలంలో గోడను పడగొట్టే సాధనాలేవీ లేకపోవడం వల్ల శత్రువులు సిటీ వాల్ గేట్ల నుంచి మాత్రమే లోపలికి ప్రవేశించేవారు. షియాంగ్ సిటీ వాల్లో నాలుగు అతి పెద్ద గేట్లను నిర్మించారు. చాంగిల్ గేటు (అనగా సంతోషం) తూర్పున, ఆన్డింగ్ (శాంతి) పడమట, యాంగ్నింగ్ (ఎటర్నల్ పీస్) దక్షిణాన, ఆన్యువాన్ (్ఫర్ ఎవర్ హార్మనీ) ఉత్తరం వైపున ఉన్నాయి. అన్ని గేట్లలోకి దక్షిణాన వున్న యాంగ్నింగ్ను చాలా అందంగా అలంకరించారు. ఈ గేటు సిటీ మధ్య వున్న బెల్టవర్కు అతి దగ్గరగా ఉన్నందువల్ల ప్రభుత్వపరంగా జరిపే ముఖ్యమైన ఉత్సవాలు దక్షిణపు గేటు వద్ద వున్న కూడలి వద్ద జరుపుతారు. ప్రతి గేటుపై ‘జన్ంగ్లో’ ‘జియన్లో’ ‘జాలో’ అనే టవర్స్‌ను నిర్మించారు. గేటు వెలుపలి టవర్ గేటు సస్పెన్షన్ బ్రిడ్జి గేటును కిందకి, మీదకి చేయగలదు. ‘జన్ంగ్లో’ లోపలి గేటు సిటీ లోనికి ప్రవేశ ద్వారంలా ఉపయోగపడుతుంది. ఈ సిటీ వాల్‌ను అనేక మట్టి పొరలు, లైమ్సున్నం, బియ్యం నుంచి తీసిన జిగట వంటి వాటితో తయారుచేశారు. 1983లో షాంగ్జి ప్రొవిన్షియల్ ప్రభుత్వం తిరిగి ఈ సిటీ వాల్‌ను పునర్నిర్మించింది.