Others

సర్వం దైవస్వరూపమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భ గవంతుడు గుణాతీతుడు.నిర్గుణుడు. గుణాల చేత ప్రేరింపబడేవాడు మానవుడు. మానవుడు సత్వగుణం వృద్ధిపొందితే సత్యప్రకాశుడు అవుతాడు. నిస్వార్థంతో నలుగురి కల్యాణం కోసం శ్రమించే తత్వంగుణ సంపన్నుడుగా కీర్తించబడుతాడు. పరమాత్మస్వరూపునిగా సంభావించబడుతాడు. రజోగుణం వృద్ధి చెందించుకున్నవారు కోరికలతో సతమతవౌతారు. కర్మలనాశ్రయిస్తారు. కోరికలను తీర్చుకోవడానికి కాలాన్ని వెచ్చించి భగవంతునికి దూరవౌతుంటాడు. తమోగుణుడు ఇతరులను హింసించి అయినా తనకు కావాల్సిన దాన్ని పొందాలనే తత్త్వాన్ని పెంచుకుని ఉంటాడు. మోహాన్ని పెంచుకుని ఆపదల పాలు అవుతుంటాడు. సత్యధర్మాలకు దూరమై పతనం వైపు అడుగులువేస్తుంటాడు. సత్వగుణంతో జ్ఞానవృద్ధి జరుగుతుంది. రజోగుణం వల్ల మనసు లోభపూరితం అవుతుంది. తమోగుణంచేత భ్రమలకు లోను అవుతాడు. ఈ త్రిగుణాలకు అతీతంగా ఉన్నవాడు సమదృష్టి కలవాడు అవుతాడు. బంగారమైనా మట్టైనా ఒక్కటిగానే చూస్తాడు. సర్వజనుల్లో జనార్దనుని చూసే భాగ్యానికి నోచుకుంటాడు. పరుల్లో పరమాత్మను, నరుల్లో నారాయణుని చూచి అహం బ్రహ్మస్మి అన్న తత్వ్తానికి మారుపేరుగా నిలుస్తాడు.

- వందిత