Others

సద్బుద్ధి.. సమృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ’’ అని సంబోధించి ‘‘్భక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ’’ కాశీ క్షేత్ర నివాసినీ, కమలలోచన విశాలినీ, విశే్వశ మనోల్లాసినీ అని అన్నపూర్ణాదేవిని ఉపాసించినా మోక్షాన్ని ఇవ్వ మని, జ్ఞాన విజ్ఞాలను ప్రసాదించమని వేడు కునే తల్లి గాయత్రీగా చెప్తారు. సంధ్యాదేవతగా ఆరాధించబడే ఈ తల్లి వల్లే లోకాలన్నీ రక్షించ బడుతున్నాయ. గాయత్రీని ఉపాసించినవారికి అపజయం ఉండదు. సర్వులు వశీభూతులే అవు తారు. ఓం కారానికి అధిదేవత. వేదవేద్యగా కీర్తించబడే గాయత్రి సర్వదేవతామయ. సర్వ దేవతల స్వరూపమే గాయత్రీగా ఉపాసించ బడుతుంది.
సద్బుద్ధిని, దీర్ఘాయుష్షుని సత్సాంతానాన్ని, గోసంపదను, కీర్తిప్రతిష్ఠలను, బ్రహ్మవర్చస్సును ప్రసాదించి, అంత్యమున మోక్షమును అనుగ్రహించే కరుణామయి- గాయత్రిమాత అని, అధర్వణ వేదం చెప్తుంది. ఋక్కులలో గాయత్రీ మంత్రమును నేనని భగవానుడు చెప్పి ఉన్నాడు.
చండమార్తాండ మండల మధ్యలో, సూర్యునికి అధిష్ఠాత్రి అయి, చిన్మయ చైతన్యరూపిణిగా దర్శనమిచ్చే దేవతనే- గాయత్రి. సకల జగత్తును నియతగా నడిపేది- ధర్మం. ధర్మదేవత- గాయత్రి. ‘సవిత’ అంటే మానవబుద్ధి. బుద్ధిలో ప్రతిఫలించే జ్ఞాన తేజః కిరణాలే- భర్గస్సు. ‘సవిత’ అంటే పరబ్రహ్మ స్వరూపం. చైతన్యవంతమయిన నామరూపాది రుూ విశ్వమే- భర్గస్సు. అదే శక్తి స్వరూపం. ఆ శక్తే- గాయత్రీమాత. గాయత్రి హిరణ్యగర్భుడైన సూర్యుని శక్తియే. కనుక, సూర్యశక్తిని, గాయత్రీ మంత్రం ద్వారా ఆరాధిస్తే- ఆరోగ్యప్రదం, మోక్షప్రదం. సూర్యునిలో ఉండే ప్రాణశక్తి - గాయత్రిమాత. గాయత్రీమాతను ఆరాధించిన వారికి అపజయం ఉండదు కనుకనే అగస్త్యమహర్షి రామరావణ యుద్ధంలో రాముని ఆదిత్య హృదయం బోధించి రావణుని విజ యానికి దారి చూపాడు. రోజులో మూడుసార్లు త్రిసంధ్యావేళల్లో ప్రాణాయామం చేస్తే, బుద్ధి వికసిస్తుంది. పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. రోజూ సంధ్యను ఉపాసించేవారికి ఈ తల్లి దివ్యశక్తి అనుభవైక వేద్యమే. ఈ తల్ల్లిని మనసా వాచా కర్మణా పూజించిన వారికి ఇహలోకంలో లేనివి పరలోకంలో దక్కనివి అంటూ ఏమీ ఉండవని పురాణాలు చెప్తున్నాయ. కులమతవిచక్షణ లేకుండా గాయత్రిని థ్యానించిన వారికి సకల సంపదలు వృద్ధి అవుతాయ.

- హనుమాయమ్మ