Others

ధర్మానికి మార్గం.. ‘నీతి సుధావాహిని’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీతిసుధావాహిని
రచయిత: వెల్దండ పూరి బాలస్వామిగుప్త
మూల్యం: రూ.60/-లు
ప్రతులు దొరుకుచోటు
సంస్థాపకులు:
హనుమాన్
జ్ఞానయజ్ఞ సమితి,
మండల పరిషత్
కార్యాలయం ముందు,
వివేకానంద నగర్ , కల్వకుర్తి
మహబూబ్‌నగర్ జిల్లా, తెలంగాణ
సెల్ నెం: 9052430492

**
శ్రీ రాముణ్ణి దైవముగా తలుచువారు, శ్రీరాముణ్ణి తమ నాయకుడని భావించువారందరూ కూడా తాము ధర్మమార్గములో నడుచుట ఒక్కటే చాలదు అనుకుంటారు. తమతోటి వారందరూ కూడా ధర్మమార్గముననే నడవాలని తలుస్తారు. అటువంటి రామభక్తుల కోవలోకి చేరే వెల్దండ పూరి బాలస్వామి గుప్తగారు ‘‘నీతి సుధావాహిని’’ అనే చిరుపొత్తాన్ని రూపొందించారు. శ్రీరామ భక్తులకు ఆంజనేయస్వామి కూడా చిరపరిచితుడే కాదు వారి ఇష్టదైవంగా మారుతిని నమ్ముతారు. ఆంజనేయుని వలె తాము కూడా రామకింకరులుగా ఉండాలని భావిస్తారు. అందుకే ఈ బాలస్వామి గుప్తగారు కూడా శ్రీ హనుమాన్ చాలీసా యజ్ఞమును ఆచరిస్తూనే కొన్ని నీతి సుధాసూక్తులను పుస్తకరూపంలో తీసుకొచ్చారు. సర్వాంతర్యామియైన సర్వేశ్వరుడి గురించి చెప్తూ భగవంతుడికి గొప్ప నైవేద్యాలు కాని, ఆర్భాటమైన పూజలు కాని అక్కర్లేదు. భక్తియుతమైన మనస్సు చాలు అని చెప్పే జ్ఞానాన్ని వివిధ ఉదాహరణలతో ఉదహరించారు. పూర్వజన్మ సుకృతంగా వచ్చిన ఈ మానవజన్మను మానసికశక్తిని పెంచుకుంటూ మహత్తరంగా జీవించాలని పశుత్వాన్ని వీడి దివ్యత్వాన్ని పొందాలని ప్రతి అక్షరంలోను అంతర్లీనంగా చెప్తున్నారు. భక్తులు, షోడషోపచార పూజ, తులసి, పారాయణవీణ అనే ఆసక్తికరమైన శీర్షికలతో వివిధ విషయాలను స్పృశించారు. మానవత్వాన్ని పరిమళింపచేసేవారే మనిషి అని పోతపోసిన ధర్మమే రాముడని ఆ రామునికి వారసులుగా మనం మిగలాలనే బోధతో ఈ పుస్తకాన్ని రచించడం చదువరులకు ఆసక్తిని ఆనందాన్ని మిగులుస్తుంది. ద్రవ్యం మీద మమకారాన్ని వీడి దివ్యత్వం వైపు మళ్లండి అని చెప్పే వీరు మనిషి పెరగడం కాదు ఎదగాలి అంటారు. ఎదిగితే వికాసం చెందుతారు ఆ వికాసమే జీవన ధర్మమెరిగి చరించేలాగు చేస్తుంది అంటారు. రచయిత దేనికైనా మితం కావాలని అంటూ ఇక్కడ మితం అంటే మనోనిర్మలత సమత్వమే అంటూ ‘అతి సర్వత్రా వర్జయేత్’ అని భగవాన్ బుద్ధుడు తన అనుభవపూర్వకంగా తెలుసుకొన్నాడు. కనుక మనమూ ఇలాంటి దివ్యచరితుల జీవిత విశేషాలను తెలుసుకొంటూ ధర్మాన్ని ఆచరిద్దాం. మనుషులుగా మసలుదాం అంటారు. వీరి పుస్తకాన్ని చదివి మరింత జ్ఞానసముపార్జన చేసి ధర్మానికి మారురూపులుగా మారుదాం అనే భావన మొలకెత్తేట్లుగా చేసే పుస్తకమే ఈ ‘‘నీతి సుధావాహిని’’.

- చరణ శ్రీ