Others

నారాయణుని రూపమే కృష్ణపరమాత్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గర్గ మహర్షికి స్వయంగా శివుడే గురువు. గర్గుడికి అన్ని విద్యలు శివుడే నేర్పించాడు. గర్గుడు బ్రహ్మ మానస పుత్రుడు. అనేకమంది రాజులు గర్గుడిని కుల గురువుగా పెట్టుకున్నారు. ఒకసారి గర్గుడు శిష్యుల్ని తీసుకుని దేవకీ వసుదేవుల కోరిక ప్రకారం రేపల్లె వచ్చాడు. శిష్యులతో వచ్చిన గర్గ మహర్షిని చూసి యశోద సత్కారంచేసి కూర్చోమని చెప్పి.. ‘మహర్షీ మీరెవరో గొప్ప తేజస్సుతో విష్ణుమూర్తిలా ఉన్నారు. మీ పేరు చెప్పగలరా అని అడిగి, స్వామీ మా కృష్ణుడిని దీవించండి అంది యశోద. తల్లీ నేను గర్గ మహర్షిని. మీకిద్దరికీ నేను వచ్చిన పని చెప్తాను అని అన్నాడు. గర్గుడికి సాష్టాంగ నమస్కారం చేసి రహస్య మందిరానికి తీసుకెళ్లారు యశోదానందనులు. గర్గమహర్షి వాళ్లతో కృష్ణుడి గురించి ఇలా చెప్పాడు. మీ ఇంట్లోఉన్న ఈ చిన్నవాడు దేవకీ వసుదేవుల పుత్రుడు. రోహిణికి పుట్టినవాడు ఇతడికి అన్న అవుతాడు. కంసుడు చంపేస్తాడనే భయంతో మీకు పుట్టిన కూతుర్ని తీసుకుని ఈ పిల్లవాడిని ఇక్కడ ఉంచారు. ఈ పిల్లవాడు సాక్షాత్తూ నారాయణుడే. దుష్టుల్ని శిక్షించడానికి, శిష్టుల్ని రక్షించడానికి మనిషిరూపంలో పుట్టాడు. ఇతడు పుట్టగానే నిజస్వరూపం దేవకీ వసుదేవులకు చూపాడు. ఇతడు ప్రతియుగంలోనూ పేరు రంగు మార్పులతో పుడతాడు. కృతయుగంలో తెల్లగాను, త్రేతాయుగంలో ఎర్రగాను, ద్వాపరయుగంలో పీత వర్ణంతోను, ఇప్పుడు కృష్ణవర్ణంతో కృష్ణుడు అని పిలవబడతాడు అని చెప్పాడు గర్గ మహర్షి.
గర్గ మహర్షి.. ఇలా చెప్పసాగాడు కకారం బ్రహ్మవాచకం. ఋకారం అనంతవాచకం, షకారం శంకర వాచకం, ణకారం ధర్మవాచకం, అకారం విష్ణువాచకం, విసర్గం నరనారాయణ వాచకం. కృష్ణనామం స్వరశక్తిమయం. ఈ పేరు పలకడంవల్ల మోక్షం కలుగుతుంది అని చెప్పాడు. ఈ పిల్లవాడి అన్నపేరు బలరాముడు. రాధాకృష్ణులు గోలోకంలో ఉన్న శ్రీరామ రాధకలే అని కృష్ణుడు చేయబోయే అన్ని పనుల గురించి విపులంగా చెప్పి జాతకర్మ, నామకర్మ, అన్నప్రాశన అన్నీ చేయించాడు మహర్షి.
గర్గమహర్షి చిన్ని కృష్ణుడిని ఏకాంతంగా తీసుకెళ్లి ప్రదక్షిణ నమస్కారం చేస్తుంటే.. మహర్షి శరీరం పులకించిపోయింది. ఎదురుగా ఉన్న చిన్న పిల్లాడే అయినా విష్ణుమూర్తే కదా.. తన మనసెప్పుడూ విష్ణుమూర్తి పాదపద్మాలపై లగ్నం అయ్యేటట్టు చూడమని కోరమన్నాడు మహర్షి. కొంతకాలం తర్వాత కృష్ణుడు చేతిలో కంసుడు మరణించాక దేవకీ వసుదేవుల దగ్గరకు శిష్య సమేతంగా వచ్చాడు గర్గమహర్షి. రామకృష్ణులకు ఉపనయనంచేసే వయస్సు వచ్చిందని, మంచి ముహూర్తం చూసుకుని కావలసిన సామగ్రిని సిద్ధంచేసుకుని తనకు కబురు పంపితే ఉపనయనం చేస్తానని చెప్పాడు. కృష్ణుడు తలచుకోగానే బంధుమిత్రులు, మహర్షులు, సర్వదేవతలూ వచ్చారు. గర్గమహర్షి బలరామకృష్ణులకు ఉపనయనం చేశారు. హైహయవంశం వాడయిన కార్తవీర్యార్జునుడికి గొప్ప వైరాగ్యం వచ్చి రాజ్యంవదిలేసి తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోతానన్నాడు. అతడి కుల గురువు గర్గుడు ఎంత చెప్పినా వినలేదు. అయితే నువ్వు దత్తాత్రేయుడి గురించి తపస్సు చెయ్యి అన్నాడు. కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడి గురించి తపస్సుచేసి వరం పొంది ఆ గర్వంతో జమదగ్ని మహర్షి హోమదేనువుగా తెచ్చుకున్నాడు . తర్వాత పరుశురాముడి చేతిలో మరణించాడు.
ఒకసారి గర్గ మహర్షిని యాదవులు అవమానించారు. దీంతో గర్గుడికి కోపం వచ్చి ‘నా వల్ల పుట్టిన కాలయవనుడు మిమ్మల్ని నానా బాధలు పెడ్తాడని శపించాడు’. యాదవులు తమ తప్పు తెలుసుకుని బాధపడి బతిమాలుకున్నారు.
శ్రీకృష్ణుడు మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పాడు గర్గ మహర్షి. యవనరాజు దగ్గర ఉన్న గర్గ మహర్షి తనకు సేవలు చేస్తున్న అప్సరసలకి కాలయవనుడనే పుత్రుడిని ప్రసాదించాడు. తర్వాత గర్గుడు తపస్సు చేసుకునేందుకు, అప్సరస తన లోకానికి వెళ్లిపోయారు. యవన మహారాజు కాలయవనుడ్ని పెంచాడు. కాలయవనుడు యాదవుల్ని నానా బాధలు పెడుతుంటే కృష్ణుడు అతడ్ని చంపేశాడు.

- నీలిమ సబ్బిశెట్టి