భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టి.ఎస్.అజయ్ అండ్ విజయ్ బ్రదర్స్,
నాగమల్లాపురం (ఆంధ్ర)
ప్రశ్న:‘పురుచ్చితలైవి’గా మకుటం లేని మహారాణిగా తమిళనాట అమ్మగా ప్రసిద్ధి పొందిన స్వర్గీయ జయలలితగారి మరణం, అనారోగ్యం గురించి ఏవేవో వదంతులు పత్రికల్లో వస్తున్నాయి. జ్యోతిషం ద్వారా మీరేమైనా చెప్పగలరా?
సమాధానం: ప్రతి లోక వార్తనూ జ్యోతిషానికి అన్వయించటం సరియైన పద్ధతి కాదు. ‘జాతస్త్య మరణం ధృవం’ గీతావాక్యం. పుట్టిన ప్రతిదీ మరణించక తప్పదు. ‘డెస్టినీ ఈజ్ గ్రేటర్ దెన్ ఎనీథింగ్, గోల్డెన్ లాడ్స్ అండ్ గర్ల్ ఆల్ మస్ట్ ఐస్ చినీ స్వీపర్స్ కమ్ టు డస్ట్ (Destiny is greater than anything, golden lauds and girls all must as chimny sweepers comes to dust) అన్నధి ఆంగ్ల మహాకవి షేక్‌స్పియర్ వాక్యం- జగము అంటేనే ‘జ’ అంటే పుట్టేది- ‘గమ్’ అంటే పోయేది అని అర్థం. ‘‘నిత్యం సన్నిహితోమృత్యుః కర్తవ్యో ధర్మసంగ్రహః’’- మానవుని విద్యుక్త్ధర్మం - ధర్మనిర్వహణం- ఏమైనా జయలలితగారు చరిత్ర సృష్టించిన మహిళామతల్లి.
ఎ.జయలక్ష్మి, నాగోల్, హైదరాబాద్
ప్ర:మనుమని అనారోగ్యం- జన్యు సంబంధ వ్యాధి- నడవలేని స్థితి- పరిష్కారం చెప్పండి.
సమా:పదకొండు రోజులు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో నిష్ఠగా మనుమని కోసం అక్కడే ఉండి పూజలు జరిపించి తీర్థ ప్రసాదం పెట్టండి. అత్యంత దీర్ఘకాలిక వ్యాధులకు కూడా స్వప్నంలో స్వామి ఆపరేషన్ చేసి కుదిర్చిన సంఘటనలున్నాయి. ప్రతిరోజూ నువ్వులనూనె ఒంటికి బాగా రాసి రెండు గంటల తరువాత నలుగుతో స్నానం చేయించండి. రాత్రివేళ ఆవుపాల వెన్నలో గోరోజనం కలిపి కాళ్ళకూ, చేతులకూ నడుముకు బాగా రుద్దండి. కొద్ది రోజుల్లో గుణం కనిపిస్తుంది.
బి.సుధాకర్, పెబ్బేర్ (తెలంగాణ)
ప్ర:‘రామకోటి’ ఏడు లక్షలకుపైగా రాశాను. పూర్తిచేయగలనా?
సమా:దైవకార్యం విషయంలో సంకల్పం దృఢంగా ఉండాలి. వికల్పాలను మనసులోకి రానీయకూడదు. తప్పక రాయగలరు. శ్రీరామ్ రక్ష’- శ్రద్ధగా కొనసాగించండి.
ప్రవీణ్‌కుమార్, డెహ్రాడూన్, ఉత్తరాంచల్
ప్ర:మిలటరీలోనే ఉద్యోగం దొరికే అవకాశం ఉన్నదా?
సమా:తప్పకుండా మిలటరీలోనే ఉద్యోగం లభిస్తుంది.
రమావతు బాలాజి, జయపూర్, రాజస్తాన్
ప్ర: (హిందీ టు తెలుగు అభ్యంతరం లేదు)- ఒకసారి నాకు 2009లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవకాశం వచ్చి చేజారిపోయింది. నాకు రాజకీయ భవిష్యత్తు ఉందా?
సమా:తప్పకుండా ఉంది. రాజయోగానికి కారకులు రవి-గురుల సంయోగం. కుజ గురువుల సంయోగం- రాహువు యొక్క అనుకూల స్థితి- చంద్రబలమూ ఉండాలి. మీ జాతకంలో కుజ-గురువుల సంయోగం కనబడుతోంది. దాని కారణంగా ఘర్షణతో కూడిన రాజయోగం ఉంటుంది. రవి-గురుల యుతి వుంటే సాఫీగా సాగిపోతోంది. రవి బలానికి ఆదిత్య హృదయం సద్బ్రాహ్మణుని చేత నలభై రోజులు పారాయణ చేయించండి. సిరా- పూరీలు నివేదన చేయండి. శుభం కలుగుతుంది.
బి.ఎస్.రెడ్డి, ప్రగతినగర్, హైదరాబాద్
ప్ర:వ్యవసాయం లాభిస్తుందా? ఆర్థికాభివృద్ధి ఉంటుందా?
సమా:వ్యవసాయం లాభిస్తుంది. పూలు- పండ్ల తోటలు మీకు ఆర్థికాభివృద్ధిని కలిగిస్తాయి.
చీల వెంకటేశ్వర్, ఆసిఫాబాద్ (తెలంగాణ)
ప్ర:సొంత ఇల్లు కట్టుకోగలనా? ఖర్చులు అధికంగా ఉంటున్నాయి.
సమా:స్వంత ఇల్లు కట్టుకోగలరు. 2017లో ఖర్చులు అధికం అనేది అందరికీ సర్వసాధారణమే. దుబారా ఖర్చు కాకుండా చూసుకోండి.
వి.అశోక్, భరత్‌నగర్, హైదరాబాద్
ప్ర:వివాహ ప్రశ్న
సమా:2017లో పూర్తి అవకాశాలు కనిపిస్తున్నాయి.
వోడ్నాల ప్రసాద్, జాలపల్లి (తెలంగాణ)
ప్ర:పసిపిల్లవానికి పేరు ఎన్నిక- భవిష్యత్తు-
సమా:ఉత్తర మొదటి పాదం ఔతుంది. ‘టేకయ్య’ జన్మనామం. అంటే ‘టే’ మొదటి నక్షత్ర పాదాక్షరం. అయితే అదే వ్యవహార నామంగా ఉండటం మంచిది కాదు. ‘ష’ కాని ‘రూ’ కాని అక్షరాలు మొదటగా ఉండేలా చూడండి.
ముప్పిడి మహేష్‌కుమార్, పెద్దపల్లి (తెలంగాణ)
ప్ర:జీవితంలో స్థిరత్వం- ఏ రంగం?
సమా:వ్యాపారంలో స్థిరపడటానికి ప్రయత్నించండి. బియ్యం- కిరాణా వంటివి మీకు యోగిస్తాయి.
వగ్గుల లక్ష్మయ్య, వనస్థలిపురం, హైదరాబాద్
ప్ర:సుదీర్ఘ లేఖ- విచిత్రమైన ప్రేతాత్మల అనుభవాలు- వృత్తి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్.
సమా:ప్రస్తుతం అద్దె ఇల్లు మార్చండి. అప్పటికీ ఆ అనుభవాలు జరుగుతూ వుంటే పడుకునే తలగల క్రింద నెమలి పింఛం రేకులు సుబ్రహ్మణ్యస్వామి ఫొటో పెట్టి పడుకోండి.
ఎమ్.వసుమతి, నరసరావుపేట (గుంటూరు)
ప్ర:వివాహ సంబంధం కుదిరినట్టే కుదిరి తప్పిపోతున్నాయి. పరిహారం చెప్పండి?
సమా:జాతకంలో చంద్రదోషం ఉంది. స్ర్తిల మూలకంగా విఘ్నాలు కలుగుతున్నాయి. ప్రతి సోమవారం జాజి మల్లె పూలహారం- ఐదు కమలా ఫలాలతో పార్వతీ దేవిని పూజించండి. ప్రతి మంగళవారం ఎఱ్ఱ గనే్నరు పూలు ఎఱ్ఱమందారంతో మాలగా అమ్మవారికి వేసి జిలేబి నివేదన చేయండి. శుభం జరుగుతుంది. ఈ రెండు రోజులు ప్రొద్దున ఉపవాసం పాటించి రాత్రికి భోజనం చేయాలి.
ఎ.శ్రావణి, బెంగుళూరు, కర్నాటక
ప్ర:్భర్యాభర్తలమధ్య గొడవలు-
సమా:సహన శాంతాలే శ్రీరామరక్ష- మగవాణ్ణి మహిళామణి శాంతపర్చడం చాలా సులభం. ‘యువతులెపుడు మగవారిని చిరునవ్వుతో గెలవాలని తెలుసుకొనవె యువతీ’ అనే తెలుగు సినీ గీతం గుర్తుకుతెచ్చుకోండి.
షణ్ముఖ ప్రియ, కీర పండరీపురం (కృష్ణా)
ప్ర:మాది మహాకవి క్షేత్రయ్యగారి వంశం- ఇంట్లో లలితా సహస్రనామాలు- ఖడ్గమాలా- వేంకటేశ్వర భజనలు- ఆదిత్య హృదయం- అతిథి మర్యాదలు అన్నీ చేస్తాము. అయినా ఇంట్లో అశాంతి- అనారోగ్యం- లివర్ సంబంధంగా దోషం ఉందంటున్నారు డాక్టర్లు- ఆరోగ్యానికి మనశ్శాంతికి పరిష్కారం చెప్పండి.
సమా:మహాశయా! మీది క్షేత్రయ్యగారి వంశం కావటం చాలా సంతోషం- అయితే ఒక విషయం గుర్తుంచుకోండి- గృహస్తు అయినవాడు విపరీతమైన పూజలు- పారాయణాలూ చేయకూడదని మహాభారతంలో వ్యాసభగవానులే ఉపదేశించారు. విపరీతమైన పూజలు చేసేచోట- విపరీతమైన దానాలు చేసేచోట దరిద్ర దేవత తాండవిస్తుంది. ఈ వయస్సులో (87 సం.) మీరూ మీ ఆవిడ మీకు తెలియకుండానే అలసిపోతున్నారు. సాధ్యమైనంతవరకు విశ్రాంతి తీసుకోండి. లివర్ సమస్యకు గృహ వైద్యంగా ఐదు తులాల శెనగలను నీళ్ళలో ఉడకబెట్టి రుచి కోసం కొంచెం ఉప్పు చేర్చి ప్రతిరోజూ ప్రాతఃకాలము నమిలి తినాలి. ఈ చిట్కాను ఉపయోగిస్తున్నప్పుడు కారము పూర్తిగా వదలివేయాలి. ఇట్లా పదిహేను రోజుల తరువాత ప్రతి నిత్యమూ ప్రాతఃకాలంలో ఐదు తులాల శనగలను నేతిలో వేయించుకొని (ఆవు నెయ్యి శ్రేష్ఠం) ఉప్పు పొడి చల్లుకొని తినాలి. నలభై రోజుల్లో సంపూర్ణముగా లివర్ దోషాలు తొలగిపోతాయి.
కె.హెచ్.మల్లికార్జునరావు, గుంటూరు (ఆంధ్ర)
ప్ర:కలప వ్యాపారం- ఋణాలున్నాయి- వ్యాపారం సరిగా లేదు. భవిష్యత్తేమిటి?
సమా:మీ సమస్యలో అంతర్లీనంగా స్థిరాస్తి వ్యవహారాలు కాని, స్ర్తి మూలకమైన విషయంలో కాని కనిపిస్తున్నాయి. వాటి పరిష్కారంపైన మీ ఋణవిముక్తి ఆధారపడి ఉంది.
ఎన్.హరిణి, గుడివాడ, ఆంధ్ర
ప్ర:అక్కగారు చెప్పిన సంఖ్య- వివాహం గురించి
సమా:మీ అక్కగారి పేరు కూడా వ్రాస్తే బాగుండేది. సంఖ్యాప్రకారంగా వచ్చే సంవత్సరంలో పూర్తి అవకాశం వుంది.
ఇనాంపూడి వైకుంఠవాసులు, విశాఖపట్నం, ఆంధ్ర
ప్ర:వివాహం- ఉద్యోగంలో అభివృద్ధి-
సమా: వ్యక్తిగతంగా కుటుంబంలోని అభిప్రాయభేదాలు వివాహానికి అభ్యంతరవౌతున్నాయి. ఉద్యోగంలో పోటీ కారణంగా ఆలస్యం.
సి.బుచ్చయ్య చౌదరి, ఏలూరు, ఆంధ్ర
ప్ర:గాయత్రీ దేవి పేరున ఈశాన్య- ఆగ్నేయాలలో ఏది మంచిది.
సమా:ఒకటి ప్రవేశం- ఒకటి స్థిర స్థితి నివాసం ఉండేలాగా చూసుకోండి.
ప్రకాశ్- హిందూపూర్, ఆంధ్ర
ప్ర:యోగించే అక్షరాలు-
సమా:క - హ - న - ప -ర - ప్రథమంగా ఉండాలి.
సిరిగుప్ప కిరణ్‌కుమార్ సెట్టి, అనంతపురం, ఆంధ్ర
ప్ర:వివాహం?
సమా:2017లో శుభాలు జరుగుతాయి. ఈశ్వరారాధన చేయండి.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................

సంతకం :

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ