Others

ప్రకృతి సమతుల్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి పండుగకు ముందురోజు భోగి, దక్షిణాయనానికి ధనుర్మాసానికి చివరిరోజు. భోగి పండుగనాడే గోదా శ్రీరంగనాధుల వివాహం జరిగింది. ఆ జగజ్జనని జగన్నాయకుని చేరి భోగములందిన దినం. అన్ని వైష్ణవా లయాల్లో ముప్పై రోజుల నుంచి అమ్మ ఆండాల్ తల్లి రచించి నాడు పాడిన పాశురాలన్నీ అనుసంధానించుకుంటూ వచ్చి చివరకు భోగి పండుగ నాడు ఆండాల్ తల్లిని తమ పుత్రికగా భావించుకొని సకల లోకాలను పాలించే శ్రీమన్నారాయ ణుడిని తమ ఇలవేల్పును తమ ఇంటి అల్లునిగా భావించి తమ తమ పుత్రికను ఆండాల్ తల్లిని పాండురంగని రూపంలోని మహావిష్ణువుకిచ్చి అంగరంగవైభోగంగా వివాహమహోత్సవాన్ని జరుపుతారు. పొద్దుపొద్దునే్న భోగి మంటలు వేయడం మనకు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఆ తరువాత అభ్యంగన స్నానాలు చేస్తారు భగవదర్చన చేస్తారు. కొన్ని చోట్ల బొమ్మల కొలువులను పేరుస్తారు. రకరకాల బొమ్మలతో సంస్కృతీ సంప్రదాయాలను తరతరాలకు అందించే అపురూప కార్యక్రమం ఇది.. పండుగనెల రోజులూ గొబ్బెమ్మలను పెట్టి గొబ్బిపాటలుపాడిన కన్యలంతా కనుమతరువాత ఆ గౌరమ్మలను నదీతీరాలల్లో వాలాడిస్తారు. ఇలా చేయడం కూడా సంప్రదాయమే.
మరునాడు సంక్రాంతినాడు ఉత్తరాయణ పుణ్య కాలారంభము .్ధన్యం- ఫలాలు- విసనకఱ్ఱ- వస్త్రం- సువర్ణం కాయగూరలు- దుంపలు- తిలలు- చెఱకు- గోవు మొదలైనవి దానం చేయాలని శాస్త్ర వచనం. సంక్రాంతినాడు శివుని ప్రతిమకు నేతిలో అభిషేకం చేసి, నువ్వు పువ్వులతోనూ, మారేడు దళములతోను పూజించాలి. ధూపదీప నైవేద్యములు సమర్పించి, ప్రార్థన చేసి, ప్రదక్షిణ చేసిన విశేషఫలం కల్గుతుంది. సంక్రాంతి పండుగనాడు పొంగళ్లు వండి ఇంటిపైన పొలాల్లోను చల్లుతారు. ఇలా చేయడం వల్ల గ్రహపీడలు వదిలి పాడిపంటలు వృద్ధి అవుతాయని నమ్మకం. ‘‘హరిలోహరి రంగా శ్రీరంగా’’ అంటూ హరిదాసులు తుంబరలను మీటుతూ ఏతెంచుతారు. ‘‘శంభోశంకరా .. పరమేశ్వరా’’ అంటూ జంగందేవర పెద్ద శంఖం ఊదుతూ వస్తారు. గృహస్థులంతా వారికి తమ ఇంటిలో ఉన్న కొత్తవడ్లను వస్త్రాలను కట్టబెట్టి వారి ఆశీర్వాదాలను అందుకుంటుంటారు. మగపిల్లలందరూఆకాశంలో సూర్యుని అందు కోవాలని గాలి పటాలను ఎగురవేస్తుంటారు. పశు పక్ష్యా దులు కూడా నిత్యసంతోషులు కావాలని ఇంటి పెద్దలం దరూ తమతమ ఇంటి ముందర వడ్లకంకులను కట్టి పక్షులకు విందులు చేస్తారు. సంక్రాంతి మూడోరోజు ముక్కనుమ అని తాము వేసిన నాట్లు పండి బంగారును పండించటానికి తోడ్పడిన వృషభరాజులను అలకరించి వాటికి పొంగళ్ళను పెట్టి పొలంలో పొంగళ్లు చల్లి అటు భూదేవి, గోమాతలను ఇటు వృషభాలు దున్నపోతులను పూజిస్తారు. విప్రవినోదులు, పగటివేషకారులు, యక్షగానకళాకారులు వచ్చి తమతమ సంస్కృతీసంప్రదాయాలను మరవరాదని వారి వారి కళలను ఆవిష్కరిస్తుంటారు. కలసిఉంటే కలదు సుఖం అన్న నినాదానికి మారుపేరైన భారతదేశంలోని వసుధైక కుటుంబ చిహ్నంగా కర్మ చారులంతా కలసి మెలసి తిరుగుతారు. ధనిక పేద అన్న వత్యాసాన్ని దూరం చేసే సంక్రాంతి సంబురాలని పల్లె పట్నం అన్న తేడాలేకుండా తెలుగునాటనే కాదు భారతదేశమంతా కూడా అత్యంతఉత్సాహంతో జరుపుకుంటారు.

- నాగలక్ష్మి