Others

భస్మాసుర హస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేలుకి కొండెంలోను, పాముకి నోటిలోని కోరలలోనూ విషం చిమ్మేలా వాటి అవయవ నిర్మాణం ఉంటుంది. ఆ విషాన్ని ఎప్పుడు ఎక్కడ వాడాలో మాత్రమే వాటికి తెలిసిన విద్య. కేవలం తనకి ప్రమాదంజరగబోతోందనే అనుమానం వస్తే చాలు కాటువేయడానికి రంగం సిద్ధం చేసుకుంటాయి. మానవునికున్న మేధోశక్తి అపురూపం, అపారం. దానిని సద్వినియోగం చేసుకున్నపుడే అతనికి మంచి విలువ వస్తుంది. ఎదుటివారిపై ద్వేషాలు పెంచుకోడానికీ, కసి లేదా పగ తీర్చుకోడానికీ వాడుకుంటూ పోతే అది అరిష్టమే. పగ తీరనప్పుడో, కసి ఉద్భవించినప్పుడో.. తీరే అవకాశం వెంటనే లేనప్పుడు ‘కోపం’గా రూపు మార్చుకుంటాయి. ఆ కోపం అదే మనిషిని నిలువెల్లా దహించివేస్తుంది. భస్మాసుర హస్తంలా తననే దహించివేయగలదు. జంతువులాగా ఉందామా లేక మనిషిలాగా ఉందామా అన్నది నిర్ణయంచుకోవాల్సింది మాత్రం మనమే.

- కె.వి.సుబ్రహ్మణ్యం