నిజామాబాద్

ప్రజా చైతన్యానికే రోడ్డు భద్రత వారోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, జనవరి 22: ప్రమాదాల పట్ల ప్రజల్లో అవగాహన కలిగిస్తూ చైతన్యపర్చేందుకే రోడ్డు భద్రత వారోత్సవాలను నిర్వహిస్తున్నామని జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమీషనర్(జెటిసి) పాండురంగారావు అన్నారు. శుక్రవారం ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద 27వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని ఎంవిఐ అశ్వంత్‌కుమార్ ఆధ్వర్యంలో వాహనాల ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించిన జెటిసి క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు రవాణా శాఖ తమవంతుగా కృషి చేస్తోందని అన్నారు. దేశంలో సంవత్సరానికి 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, తద్వారా లక్షా 40 వేల మంది మరణిస్తున్నారని, మూడున్నర లక్షల మంది క్షతగాత్రులు అవుతున్నారని అన్నారు. ఈ ప్రమాదాల వల్ల 50 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని అన్నారు. మానవ తప్పిదం, అజాగ్రత్తల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏటా 14 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఏడు వేల మంది మరణిస్తున్నారని అన్నారు. వాహనాలు నడిపే వారు ప్రధానంగా నాలుగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
హెల్మెట్ ధరించకపోవడం వల్ల 40 శాతం మంది యువత మరణిస్తున్నారని చెప్పారు. సీట్ బెల్టు ధరించకపోవడం వల్ల ఎర్రం నాయుడు, ఎన్‌టి రామారావు సోదరుడు లాంటి ప్రముఖులు సైతం మరణించారని అన్నారు. జాతీయ రహదారిపై తప్పనిసరిగా సీట్ బెల్టు ధరించాలని అన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం నడపరాదని అన్నారు. డ్రంకెన్ డ్రైవ్ వల్ల కూడా మరణిస్తున్నారని ఆయన చెప్పారు. నాలుగు కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిపై కఠిన వైఖరి అవలంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నాలుగు నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గించిన వారమవుతామని అన్నారు. ర్యాలీలు నిర్వహించడం వల్ల ప్రజలు చైతన్యవంతులవుతారని అన్నారు. అంతకుముందు రోడ్డు ప్రమాద నివారణ పోస్టర్లు, కరపత్రాలు, సిడిలను ఆవిష్కరించారు. డిటిసి దుర్గాప్రమీల రోడ్డు ప్రమాదాల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమీషనర్ దుర్గాప్రమీల, ఆర్మూర్, బోధన్ ఎంవిఐలు అశ్వంత్‌కుమార్, కిషన్, ఎఎంవిఐ పవన్, కళాశాల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్, ప్రొఫెసర్లు రాంప్రసాద్, భగవతిరావు, బి.నరేందర్, డాక్టర్ ప్రకాష్, ఆటో యూనియన్ నేత సుమిత్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.