ధర్మసందేహాలు

పదునెనిమిది ప్రాముఖ్యత ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* భారతం 18 పర్వాలు, భగవద్గీత 18 అధ్యాయాలు, భారత యుద్ధంలో సైన్యం 18 అక్షౌహిణీలు ఆ యుద్ధం 18 రోజులు అలా ఇన్ని రకాలుగా పునరావృత్తమవుతున్న 18 సంఖ్యకు గల ప్రాముఖ్యం ఏమిటి?
గిరిజామనోహర్ , సూర్యాపేట
సంఖ్యాశాస్త్రానికీ, అక్షర శాస్త్రానికీ సంబంధాన్ని నిర్వచించే ప్రాచీన ప్రక్రియలు కొన్ని ఉన్నాయి. వాటిలో కటపయాది సంఖ్యావిధానం అనేది ఒకటి. దానిప్రకారం య అంటే 1. జ అంటే బి.8 ‘‘అంకానాం వామతోగతిః’’ అని మరో సూత్రం. దీనిప్రకారం అంకెలను వెనక్కు వేసుకుంటూ వెళ్లాలి. ఈ పద్ధతి ప్రకారం 18 అంటే జయ అనే పదం ఏర్పడుతుంది. అందరికీ జయప్రదంగా ఉండాలనే సంకల్పంతో వ్యాస భగవానుడు ఇతర మహర్షులు 18 సంఖ్యకు అంత ప్రాధాన్యాన్ని ఇచ్చారు. దానిని బట్టి అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉప పురాణాలు, అష్టాదశ శక్తి పీఠాలు , అష్టాదశ మహావిద్యలు, అష్టాద శ స్మృతులు వంటివి ఎన్నో రూపొందాయి.
* హనుమంతుడు బ్రహ్మచారి కదా..ఆలయాల్లో సువర్చలా కల్యాణం చేస్తున్నారు. ఇది సరియైనదా? - వి. బాలకేశవులు , గిద్దలూరు
పరాశర సంహిత అనే మహాగ్రంథం హనుమదుపాసనా విశేషాలన్నీ బోధించింది. దాని ప్రకారం సూర్యపుత్రిక అయిన సువర్చలతో హనుమంతునికి వివాహం జరిగింది. ఐతే ఆ దంపతులు ఆ క్షణం నుంచే బ్రహ్మచర్య దీక్ష వహించారు. అందువల్ల ఆంజనేయస్వామి బ్రహ్మచర్యానికి భంగం లేదు. గృహస్థత్వానికి భంగం లేదు. కనుక సువర్చలా కల్యాణాలు శాస్త్ర సమ్మతములే.
*అధికమాసాలు వయస్సు పరిగణనలోకి తీసుకోవచ్చునా ?
- కె.వి. ప్రసాదరావు, కందుకూరు
అధికమాసాలు కలుపుకుంటేనే ఆ సంవత్సరం పూర్తవుతుంది. అందువల్ల ఆ మాసాలను విడిగా లెక్కవేసే వీలు లేదు.
* మంగళవారం ఏ పనీ ప్రారంభించకూడదని అంటారు. నిజమేనా?
- యస్. సురేంద్ర గాజువాక
ఈ నిషేధం సౌమ్యసత్కర్మలకు మాత్రమే వర్తిస్తుంది. అగ్ని, విష, ఆయుధ సంబంధితమైన ఉగ్రకర్మలకు వర్తించదు. అలాగే కందులు , వేరుశనగ వంటి ధాన్యాల సాగుకు కూడా ఈ వారం ప్రశస్తమే.
* స్నానం చేయకుండాభోజనం చేయవచ్చా ? చేస్తే ఏ జన్మ వస్తుంది?
- పాండురంగారావు, కాకినాడ
ఎంతమాత్రం తగదు. దైవమానుష కర్మలన్నింటికీ అధికారాన్నిచ్చేది స్నానమే. ఈనియమాన్ని అతిక్రమించినవారికి పాపలోక ప్రాప్తి తగదు.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org

- కుప్పా వేంకట కృష్ణమూర్తి