పఠనీయం

సంతృప్తి లేని కొలువు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు) ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
======================================================
సిగ్గుతో కోర్టునుంచి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత ఆయన ఆ కోర్టులో మరొక కేసు వాదించలేదు. ఆయన ఖర్చులు రోజురోజుకూ పెరుగుతూపోయాయి. ఆదాయం దాదాపు శూన్యంగా ఉంది. స్మారక వ్యాసాలు రాయడంలో ఆయన మంచి నేర్పు చూపించాడు. అయితే అది బారిష్టరు చేసే పని కాదు, దానివల్లవచ్చే ఆదాయమూ చెప్పుకోదగినది కాదు. ఆరు నెలలు ఇలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఆయన రాజ్‌కోట్‌లోని తన అన్నయ్య దగ్గరకు తిరిగి వెళ్లిపోయాడు. ఇంగ్లాండులో చదివి వచ్చిన బారిష్టరుగా గొప్ప విజయాలు సాధిస్తాడని తమ్ముడిమీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అన్నయ్య తీవ్ర నిరాశకు లోనయ్యాడు. గాంధీకి కూడా చాలా బాధ కలిగింది. రాజ్‌కోట్‌లో ఇంకో సమస్య తలెత్తింది.
ఆయనవద్దకు కేసులు తెచ్చిన వీళ్ళకు ఫీజులో కమీషన్ చెల్లించడం అక్కడొక నియమంగా వుంది. అలా కమీషన్ ఇవ్వడం అనైతికమని భావించిన గాంధీ దానికి నిరాకరించాడు. అయితే అన్నయ్య బతిమాలిన తర్వాత ఆ విషయంలో రాజీ పడ్డాడు. అప్పుడు గాంధీ నెలకు 300 రూపాయల వరకు సంపాదించేవాడు. తన చుట్టూ అసత్యాలతో నిండి వున్న వాతవారణమూ, ఆ ఉద్యోగమూ గాంధీకి సంతోషం లేకుండా చేశాయి.
అదృష్టవశాత్తూ దక్షిణాఫ్రికాలో వుండే ఒక మహమ్మదీయ వర్తకుడు ఆయన వద్దకు ఒక కేసు తెచ్చాడు. దాన్ని అంగీకరిస్తే ఆయనకు రానూపోనూ ఫస్ట్‌క్లాసు ప్రయాణ ఖర్చులతోపాటు 1575 రూపాయల ఫీజు లభిస్తుంది. ఆయన ఆ కేసును వాదించడానికి అంగీకరించి దూరంగా ఉన్న ఆ ఖండానికి ప్రయాణమయ్యాడు. దక్షిణాఫ్రికాలోవున్న జీవన పరిస్థితుల గురించి ఆయనకేమీ తెలియదు. జాంజిబార్ పట్టణంలో ఓడకు లంగరు వేయగానే అక్కడ కోర్టు ఎలా పనిచేస్తుందో చూడటానికి ఆయన వెళ్ళాడు. అక్కడ పద్దు పుస్తకాల నిర్వహణకు సంబంధించిన అనేక అంశాలు ఆయనకు అర్థం కాలేదు.
ఆయన దక్షిణాఫ్రికాలో వాదించడానికి బయలుదేరిన కేసు ప్రధానంగా పద్దులకు (అకౌంట్లకు) సంబంధించిందే. వెంటనే గాంధీ ఈ పద్దుల నిర్వహణకు సంబంధించిన గ్రంథాన్ని కొని, దాన్ని శ్రద్ధగా అధ్యయనం చేశాడు. దర్బన్ చేరిన మూడో రోజున గాంధీ కోర్టుకు వెళ్ళాడు. మేజిస్ట్రేట్ ఆయనను తలపాగా తీసివేయమని ఆజ్ఞాపించాడు. ఆయన ఆదేశాలను పాటించడానికి నిరాకరించిన గాంధీ కోర్టునుండి బయటకు వచ్చేశాడు. దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన క్షణంనుంచీ అక్కడ భారతీయులను తెల్లవారు ఎలా అవమానిస్తున్నారో, చిన్నచూపు చూస్తున్నారో గాంధీ గమనించాడు. గాంధీని కూడా వాళ్ళు ఆహ్వానం లేని అతిథిగానూ, ‘కూలీ బారిష్టర్’గానూ చూశారు. అయితే ఈ అవమానాలవల్ల ఆయన రాటుదేలాడు. తన కక్షిదారు దాదా అబ్దుల్లా నుంచి ఆయన న్యాయ వివాదంలోని అంశాలను తెలుసుకొని, కేసును లోతుగా అధ్యయనం చేశాడు.
ఎక్కువకాలంపాటు కేసును కోర్టులో కొనసాగిస్తే న్యాయవాదులను పోషిస్తూ వాది, ప్రతివాదులిద్దరూ ఆర్థికంగా బాగా నష్టపోతారని ఆయన భావించాడు. తన కక్షిదారుకు భారం కలిగిస్తూ డబ్బునూ, ప్రతిష్ఠనీ సంపాదించడానికి ఆయన ఇష్టపడలేదు. రెండు పక్షాలనూ ఏకం చేయడం న్యాయవాదిగా తన బాధ్యత అని ఆయన భావించాడు. అవతలి పక్షాన్ని కలుసుకొని కోర్టు బయట వివాదం పరిష్కరించుకొనేందుకు ప్రయత్నిద్దామని ఆయన పట్టుబట్టాడు. దీనికి దాదా అబ్దుల్లా సంకోచిస్తే ‘‘మనిద్దరి మధ్యా రహస్యాలుగా వున్న అంశాలేవీ ఇతరులకు తెలియనివ్వనని నేను హామీ ఇస్తున్నాను. రాజీ చేసుకుంటే మంచిదని మాత్రమే నేను ప్రతిపాదిస్తాను’’ అని గాంధీ ఆయనకు నచ్చచెప్పాడు. గాంధీ మధ్యవర్తిత్వం చేసినా ఆ కేసు ఒక సంవత్సరంపాటు కొనసాగింది. ఒక సంక్లిష్టమైన కేసు విషయంలో న్యాయవాదులు ఎలా పనిచేస్తారో అధ్యయనం చేసే మంచి అవకాశం గాంధీకి లభించింది. చివరికి కేసు ఇరువర్గాలకూ సంతృప్తికరంగా పరిష్కారమయ్యింది. కానీ న్యాయశాస్త్రంలోని అంశాలను ఇరువర్గాలకు అనుకూలంగా చూపిస్తూ కోర్టు ఖర్చులను కొండంత భారం చేసే వృత్తి గాంధీకి ఏవగింపు కలిగించింది. గాంధీ డర్బన్‌లో న్యాయవాద వృత్తి ప్రారంభించిన కొద్దిరోజులకే ఒక ఒప్పంద కార్మికుడు అతని కార్యాలయానికి వచ్చాడు.