పఠనీయం

భేదం.. స్నేహానికి మచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం 12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
===========================================
ఒక ప్రధానమంత్రి కొడుకు, బారిష్టరు అయిన వ్యక్తి ఇంటింటికీ వెళ్లి మరుగుదొడ్లు పరిశీలించడమంటే అప్పటి కాలానికి అదెంతో గొప్ప సాహసం. అవసరమైన సమయాల్లో నైతికమైన ప్రదర్శన ప్రదర్శించడంలో గాంధీ ఎప్పుడూ విఫలం కాలేదు. ఆయన అనేక పాశ్చత్య పోకడలను విమర్శించేవాడు, కానీ పారిశుద్ధ్యాన్ని పాశ్చాత్యుల వద్ద నేర్చుకున్నానని అనేకసార్లు చెప్పేవాడు. అదేరకమైన పరిశుభ్రతను భారతదేశానికి పరిచయం చేయాలని ఆయన భావించేవాడు.
దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి రెండోసారి వచ్చిన ఆయన కోల్‌కతాలో జరుగుతున్న కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యాడు. దక్షిణాఫ్రికాలో భారతీయులు పడుతున్న అవమానాల గురించి వివరించడానికి ఆయన వచ్చాడు. కాంగ్రెస్ శిబిరంలో పారిశుద్ధ్య పరిస్థితి దారుణంగా ఉంది. కొంతమంది సభ్యులు వారి గదులముందున్న వరండాలనే మరుగుదొడ్లుగా వాడేస్తున్నారు. ఇతరులెవరూ దానికి అభ్యంతరం చెప్పటంలేదు. కానీ గాంధీ వెంటనే ప్రతిస్పందించాడు. వాలంటీర్లతో సంప్రదించగా ‘‘అది పారిశుద్ధ్య పనివాళ్ళపని, మాది కాదు’’ అని సమాధానం ఇచ్చారు. గాంధీ ఒక చీపురు అడిగి తీసుకొని అక్కడున్న కాలుష్యాన్నంతా శుభ్రం చేయడం ప్రారంభించారు. అప్పుడు ఆయన సూటు ధరించి ఉన్నాడు. వాలంటీర్లు ఆయన పనికి ఆశ్చర్యపోయారు కానీ ఎవ్వరూ సహాయం చెయ్యడానికి రాలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత గాంధీ భారత జాతీయ కాంగ్రెస్‌కు మార్గదర్శకుడిగా మారినపుడు వాలంటీర్లు ‘పారిశుద్ధ్య దళం’గా ఏర్పడి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు.
ఒక సందర్భంలో ఐతే కేవలం బ్రాహ్మణులే ‘పారిశుద్ధ్య దళం’లో పనిచేశారు. హరిపుర కాంగ్రెస్ మహాసభలలో పారిశుద్ధ్య పనిచేయడానికి వేయిమంది ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. సమాజంలో ప్రత్యేకంగా కొద్దిమందిని పారిశుద్ధ్య పనివారుగా, అంటరానివారుగా ముద్రవేయడం గాంధీకి నచ్చేది కాదు. ఆయన భారతదేశం నుంచి అంటరానితనాన్ని పారద్రోలాలనుకునేవాడు. దక్షిణాఫ్రికాలో భారతీయుల మురికి అలవాట్లు చూసి అక్కడి తెల్లవారు వారిని అసహ్యించుకొనేవారు. గాంధీ వారి నివాసాలకు వెళ్లి ఇళ్లను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోమని విజ్ఞప్తి చేశాడు. ఈ అంశంపై ఆయన బహిరంగంగ సమావేశాల్లో మాట్లాడాడు, పత్రికల్లో వ్యాసాలు రాశాడు. దర్బన్‌లో గాంధీ ఉండే ఇల్లు పాశ్చత్య పద్ధతిలో నిర్మించబడింది. స్నానాల గదిలో నీళ్ళు బయటికి పోయే మ్గాం ఉండేది కాదు. మల విసర్జనకు కమోడ్లు, కుండలు వాడేవారు. తనతోపాటు నివసించే గుమాస్తాల మరుగును కూడా కొన్నిసార్లు గాంధీనే శుభ్రం చేసేవాడు. కస్తూర్బాతోనూ ఆ పని చేయించేవాడు. చిన్నవారైన తన పిల్లలకు కూడా ఆ పని నేర్పాడు. ఒకసారి తక్కువ కులానికి చెందిన గుమస్తా వాడిన మరుగుదొడ్డిని శుభ్రం చేయడానికి కస్తూర్బా తటపటాయించింది.
అది చూసి గాంధీ ఆమెపై కోపగించుకున్నాడు. కులభేదాలు పాటించేట్లయితే ఇంట్లోంచి వెళ్లిపోవాలని సూచించాడు. ఒక సందర్భంలో సబర్మతీ ఆశ్రమంలోకి అంటరాని కులానికి చెందిన దంపతులను అనుమతించినందుకు సన్నిహితులే ఆయనను సాంఘికంగా బహిష్కరించారు కూడా.
ఒక దక్షిణాఫ్రికా జైలులో మరుగుదొడ్లు, స్నానాలదొడ్లు కడిగేందుకు గాంధీ ముందుకొచ్చాడు. తర్వాత జైలునుంచి అధికారులు ఆయనకు శుభ్రం చేసే పనినే అప్పగించేవారు.
1915లో 20 ఏళ్లు దక్షిణాఫ్రికాలో నివసించాక 46 సంవత్సరాల వయసులో గాంధీ భారతదేశానికి కుటుంబంతో సహా తిరిగొచ్చాడు. అదే ఏడాది హరిద్వార్ లో కుంభమేళాకు వెళ్లినపుడు అతడు, అతడి ‘్ఫనిక్స్ బాయ్స్’ అక్కడ పారిశుద్ధ్య పనిచేశారు. అదే ఏడాది గాంధీ పూనాలోని ‘సర్వెంట్స్ ఆఫ్ ఇండియా బాయ్స్ సొసైటి’ క్వార్టర్లను సందర్శించాడు. ఒక రోజు ఉదయం గాంధీ అక్కడ మరుగుదొడ్లను శుభ్రం చేయడాన్ని ఆ కాలనీవాసులు చూశారు.