పఠనీయం

చపలత్వం వీడితే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు) ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
======================================================
అతనికి వీడ్కోలు చెప్పేశాను. ఆ తర్వాత ఇంకో వంటవాడిని పెట్టుకోలేదు’’. అలా అని అతనికి వీడ్కోలు చెప్పినపుడు గాంధీ వయస్సు సుమారు 35 సంవత్సరాలు.
18 సంవత్సరాల వయసులో ఇంగ్లాండ్‌లో ఉండగా ఆయన మొదటిసారిగా వంట చేసుకొనే ప్రయత్నం చేశాడు. ఆయన పూర్తి శాకాహారి. ఇంగ్లండులో శాకాహారం కొత్తగా గుర్తింపబడుతున్న అలవాటు. సాధారణంగా ఆయనకు బ్రెడ్, వెన్న, జామ్, ఉడికించిన కూరగాయలు (తాలింపు లేకుండా) వడ్డించేవారు. ఉప్పూకారాలతో నిండిన అమ్మ చేతి వంట తినడానికి అలవాటుపడి వున్న గాంధీకి ఇవన్నీ చప్పగా, రుచీ పచీ లేకుండా ఉన్నట్లు అనిపించేవి.
కొన్ని నెలలపాటు రెస్టారెంట్లలో శాకాహార భోజనం తిన్న తర్వాత ఆయన పొదుపుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఒక గది అద్దెకు తీసుకుని, ఒక పొయ్యి పెట్టి తన అల్పాహారం, భోజనం వండుకోవటం ప్రారంభించాడు. వంట సిద్ధం చేయడానికి ఆయనకు 20 నిముషాల కంటే ఎక్కువ సమయం పట్టేది కాదు. రోజూ 12 అణాల కంటే ఎక్కువ ఖర్చు అయ్యేది కాదు. సాల్ట్ రాసిన ‘శాకాహారం కోసం అభ్యర్థన’ చదివి, లండన్ శాకాహార సంఘంతో పరిచయం కలిగిన తర్వాత గాంధీ తన ఆహారంలో చాలా మార్పులు చేసుకున్నాడు.
బారిష్టరుగా నమోదు చేసుకొని భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ముంబయిలో చిన్న గది అద్దెకు తీసుకుని, ఒక బ్రాహ్మణ వంటవాడిని గాంధీ కుదుర్చుకున్నాడు. అయినా సగం వంట తనే చేసుకొనేవాడు. ఆ వంటవాడికి ఇంగ్లీషు శాకాహార వంటలు కూడా గాంధీ నేర్పాడు. అన్ని విషయాలలో ముఖ్యంగా వంటగది సక్రమంగా, పరిశుభ్రంగా ఉండాలనే విషయంలో గాంధీ చాలా పట్టుదలగా ఉండేవాడు. ప్రతిరోజూ తప్పకుండా స్నానం చేయడం, బట్టలు ఉతుక్కోవడం వంటవాడికి నేర్పాడు.
దక్షిణాఫ్రికాలోగానీ, భారతదేశంలోగానీ గాంధీగారి ఆశ్రమాలలో జీతానికి పెట్టుకున్న వంటవాళ్ళు ఉండేవారు కాదు. భోజనంలోకి రకరకాల కూరలు, వంటకాలు వండడం పూర్తిగా డబ్బు దండగ, పని దండగ అని గాంధీ ఉద్దేశం. ఆశ్రమంలో ఉండే వివిధ రకాల వ్యక్తులకు వేర్వేరు రుచులన్నిటినీ ఇచ్చి తృప్తిపరిచే ఉద్దేశం ఆయనకే మాత్రం లేదు. అందరికీ ఒకేరకమైన సాధారణ వంటకాలను ఆయన సూచించేవాడు. భోజనాలను సామూహిక వంటశాలలో వండేవారు.
ఎంతో సంక్లిష్టం, కఠినం అయిన వంటకళను ఆయన సరళీకరించాడు. జావతో కూడిన అన్నం (బ్రెడ్, పచ్చిపులుసు, సలాడ్), ఉప్పూ కారాలు లేకుండా ఉడికించిన కూరగాయలు, పళ్ళు, పాలు లేదా పెరుగు- ఇవి ఆశ్రమ భోజనంలో వంటకాలు, తీపి పదార్థాలు, పాల పదార్థాలకు బదులు తాజా బెల్లం, తేనె వాడేవారు. జస్ట్ (ప్రకృతి జర్మన్ వైద్యుడు) రాసిన ‘రిటర్న్ టు నేచర్’ చదివిన తర్వాత ఆరోగ్యంగా ఉండేందుకు తినాలిగానీ నాలుకను తృప్తిపరచేందుకు తినకూడదని గాంధీ నమ్మాడు. అప్పటినుంచి ఆహారంతో ప్రయోగాలు చెయ్యడం గాంధీ ప్రారంభించాడు. అది ఆయన జీవితకాల వ్యాపకం అయ్యింది. కొన్ని ప్రయోగాలకి వంటతో పనిలేదు. కొన్ని మాత్రం ఆయన్ని సమస్యలలోకి నెట్టాయి. ఐదేళ్ళపాటు కేవలం పళ్ళు మాత్రం తింటూ గాంధీ గడిపారు. ఒకసారి నాలుగు నెలలపాటు మొలకెత్తిన విత్తనాలు, అపక్వాహారం మాత్రమే తింటూ గడిపి విరోచనాల పాలయ్యాడు.
ఫీనిక్స్ సెటిల్మెంట్‌లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగాను, ఆశ్రమానికి ప్రధాన వంటవాడుగానూ గాంధీ వ్యవహరించాడు. ఐరోపావారికి దక్షిణాఫ్రికావారు ఇచ్చిన విందులో గాంధీ వంటలోనూ, వడ్డనలోనూ పాలు పంచుకున్నాడు.
ఫీనిక్స్ సెటిల్‌మెంట్ నుండి మొదటి ఆశ్రమవాసుల బృందం బయటికి వెళుతున్న సందర్భంలో ఆయన వారికి బ్రహ్మాండమైన విందు ఏర్పాటుచేశాడు. పెద్ద చపాతీల గుట్ట, టమాటో పచ్చడి, కూర, ఖర్జూరాలతో చేసిన తీపి వంటకం సిద్ధం చేశాడు. చేతులతో తీరిక లేకుండా పనిచేస్తూనే ఆయన నోటితో వారికి సత్యాగ్రహం పాటించాల్సిన విధానం గురించి, జైల్లో పద్ధతుల గురించి బాగా వివరించాడు.