పఠనీయం

శిప్రముని కవితా ప్రపంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందనశాఖి ( ద్వితీయ భాగము )
రచన: ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్,
వెల:రూ.100/-,
H.No. 2-2-647-132బి, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, హైదరాబాద్-500013,
---------------------------------------------------------------------------------------------------
సంస్కృత సాహిత్యంలో వాల్మీకి నోటి వెంట వచ్చిన శ్లోకం తొలి స్మృతి కవిత అనవచ్చు. రామాయణ అవతరణకు ఈ ‘మానిషాద’ శ్లోకమే నాంది. రఘు వంశములోని అజవిలాసం సుప్రసిద్ధమైనదే!
తెలుగులో విశ్వనాధ సత్యనారాయణగారు రచించిన వరలక్ష్మీ త్రిశతి, నాయని సుబ్బారావుగారి విషాద మోహనము వంటివి స్మృతి కవితలే. సతీస్మృతి సుతస్మృతి ఇందులో మనకు దర్శనమిస్తాయి. రావూరి భరద్వాజ కాంతమ్మగారి వియోగంలో స్మృతికావ్య పంచకం రచించారు.
ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ శతాధిక గ్రంథకర్త. ముఖ్యంగా తెలుగులో విశ్వనాథ - బాపిరాజు- నోరి- శివప్రసాద్ ఈ నలుగురూ చారిత్రక నవలా మంటపానికి నాలుగు మూలస్తంభాలు. చారిత్రక నవలా చక్రవర్తిగా బిరుదునందిన ప్రొఫెసర్‌గారు 2017లో సతీ వియోగంతో తీవ్ర మనస్తాపానికి గురి అయినారు. తత్ఫలితంగా అవతరించిన లఘు కవితలే చందనశాఖి పేరుతో లోగడ ప్రచురించారు. ఇపుడు చందనశాఖి ద్వితీయ భాగం ఆవిష్కరింపబడింది. ఇందులో వారు వృత్త నియమం పాటించలేదు. భావోద్వేగంలో వచ్చిన శబ్దాలు ఏ వృత్తంలో ఒదిగితే వాటినే పలికారు.
అందువలన కొన్ని లఘు కవితలు కొన్ని పద్యాలు మరికొన్ని గీతాలు కూడా ఇందులో ఉన్నాయి.
‘‘పగలంతా ముసురు / సాయంత్రానికి వెలిసింది / రాత్రి చుక్కలు’’ ఇదొక కవిత.
ఈ ఖండికకు స్మృతి అని పేరు పెట్టారు. ఇక్కడ వర్షం విషాదానికి సంకేతం. చుక్కలు శబ్దంలో శే్లష ఉంది. వర్షం వెలిస్తే చుక్కలు చుక్కలుగా దుఃఖం ఇంకా జారుతూనే ఉంది. చుక్కలు రాత్రి పూట రావటం అందరికీ తెలిసిందే!
సుప్రసిద్ధ శాస్తజ్ఞ్రుడు స్టీఫెన్ హాకింగ్స్ మార్చి 2018లో పోయినపుడు ఒక కవిత రాశారు. ‘ఐన్‌స్టీన్ పుత్రునివి - ప్రశంసా పాత్రునివి- నీ శరీరం అమావాస్య. నీ కృషి శరత్‌పూర్ణిమ’ అని వర్ణించారు.
ఎందుకంటే స్టీఫెన్ హాకింగ్స్ శారీరకంగా అనారోగ్యానికి గురి అయినవాడు కదా! మరో కవితలో ‘‘అన్నం బెల్లం లేదు పాయసం అంటే ఎలా? సర్వజ్ఞత్వమూ శాశ్వతత్వమూ లేదు- అహం బ్రహ్మాస్మి అంటే ఎలా?’’ అని తాత్వికంగా ప్రశ్నించారు.
తాను ఎలిజీ వ్రాశాడు. కానీ ఇంతమంది తన సంతానం పోతుంటే దేవుడు ఎందుకు ఎలిజీ వ్రాయలేదు? అని ప్రశ్నించారు కవి. ‘‘ఉన్నప్పుడు విలువ తెలియదు. ఇపుడు తెలిసినా ఏమీ మిగలదు’’- ఈ విధంగా ఇందులో కవితాంశాలతో బాటు ఎన్నో తాత్విక చర్చలు కూడా సంగ్రహంగా ఉన్నాయి. చేజారిపోయిన బాల్యానికి ఎలిజీ కరిగిపోయిన యవ్వనానికి ఎలిజీ అన్నారు.
‘‘ప్రాచీరోచి ప్రాచీనార్చి, ప్రతీచీవీచి పునాది లేని సౌధం’’ అని 88వ పుటలో భారతీయ పాశ్చాత్య తాత్విక వైవిధ్యాన్ని వైరుధ్యాన్ని రెండు మూడు పంక్తులలో వివరించారు.
‘‘ఎందుకురా చెవి కోసిన మేకలా అరుస్తున్నావు? ఏం తెలిసిందని? జనన మరణ చక్రక్రమం- వక్రభ్రమణం- ఏమీ తెలియలేదు-
మరి ఎందుకీ కంఠశోష? శుంఠఘోష? అని ప్రాసంగికులను సూటిగా ప్రశ్నించారు. ఈ గ్రంథానికి ముందు డా. నిడమర్తి నిర్మల రచించిన విపులమైన విశే్లషణాత్మకమైన పీఠిక ఉంది. అందులో ఆమె తెలుగు సాహిత్యం స్మృతి సాహిత్య చరిత్రను అనుశీలించారు.
‘‘తనువు చందనశాఖి /మనసు నందన వాటి
కలము పనిషద్గంగ - గళము హిమనగశృంగ’’ అని ఉమాదేవిగారిని కవి ఇందులో అభివర్ణించారు. ఆర్ద్రత - వ్యంగ్యము - సృష్టి రహస్యానే్వషణ- నిస్పృహ- ఇలా ఎనె్నన్నో పార్శ్వాలు మనకీ కృతిలో సుకృతిలో దర్శనమిస్తాయి. ఇదొక అంతరంగ కథనం. హృదయపులోతులనుండి ఆవిష్కరింపబడిన భావాలకు అక్షరాకృతి.

- త్రోవగుంట వెంకట సుబ్రహ్మణ్యం