పఠనీయం

చిట్టి చిట్టి ‘దీపాలు’ - చిక్కని భావ ‘రుచి’ రూపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశ దీపాలు
సంకలనం రచయిత:హైందవి,
వెల:రూ.135/-
ప్రకాశకులు: ఫ్రతులకు:
భారతి ప్రచురణలు, ఇం.నెం.6-3/5, చైతన్యపురి, హైదరాబాద్-500 060, , సాహిత్య నికేతన్, 3-4-852, బర్కత్‌పురా, హైదరాబాద్, సాహిత్య నికేతన్, ఏలూరు రోడ్డు, విజయవాడ-520002, నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్, భారతమాత బుక్‌హౌస్, ఎన్‌టిఆర్ చౌక్, తిరుపతి.
===========================================================
ఇంటిలోని దీపం ఇంటికే వెలుగు
మింట నుండే దీపం ఎందరికో వెలుగు
ఒక లోగిలిలో ఒక మంచి పని జరిగినా, ఒక మంచి మాట ‘్ధ్వనించినా’ అది ఆ ఇంటిలోని వాళ్ళకే మేలు. అదే మరి బహిరంగంగా జరిగితే సమాజానికే మేలు. ఈ స్థూల దృష్టితో ఇటీవల ప్రచురణకు నోచుకున్న ఒక మంచి పుస్తకం ‘ఆకాశదీపాలు’. ఇది కొన్ని వృత్తాంతాల (ఎపిసోడ్స్), చారిత్రక కథనాల, అనుశ్రుతే కథల సంకలనం. ఇందులో గ్రీకుతత్త్వవేత్త డయోజనస్, గాలిబ్ కవి, స్వామి విజ్ఞానానంద, లలాబహదూర్ శాస్ర్తీ, థియోడర్ రూజ్వెల్డ్, గెలీలియో, ఐన్‌స్టీన్, భారుూ మణిసింగ్ మొదలైన మహనీయుల, మహాపురుషుల, మహా ‘మనీషా’వంతుల కొన్ని కొన్ని సూక్తులను, వారి జీవితాలలోని కొన్ని సంస్మరణీయ ఘట్టాలను, కొన్ని కొన్ని గంభీర సందేశాత్మక కథలను సూక్ష్మంలో మోక్షంగాను, క్లుప్తతలోనే సమగ్ర సందేశాత్మకంగాను అందించారు రచయిత.
ఇందులోని చాలా ముచ్చట్లలోగాని, వృత్తాంతాలలోగాని, నోటింగ్స్‌లోగాని ఏదో ఒక ఆకర్షణ- హాస్యమో, వ్యంగ్యమో, ‘్ధ్వనో’, కరుణో, అద్భుతమో, హెచ్చరికో నీతో ఉంటుంది.
84వ పుటలో ‘విమర్శ’ అనే శీర్షిక కింద రాసిన విషయం ఇందుకు ఒక ఉదాహరణ- ‘‘ఒకసారి గాలిబ్ రాసిన కవిత్వాన్ని విమర్శిస్తూ ఎవరో ఒక వ్యాసం రాశారు. అది చూసిన ఆయన అభిమాని ఒకరు ఆయన ఎవరో అలా విమర్శిస్తే మీరు వౌనంగా ఉంటారేమిటి అనడిగాడు. అందుకు గాలిబ్ ‘గాడిద మనల్ని తన్నిందని మనం దానిని తన్నం గదా!?’ అని తిరిగి ప్రశ్నించాడు నవ్వుతూనే. ఒక్కొక్కప్పుడు మనకు మన మనుగడ కంటే ఎదుటివాడిది బాగుంది అనిపిస్తుంటుంది. కానీ ప్రతి జీవి బ్రతుకులో ఏదో ఒక వెలితో, అసంతృప్తో ఉంటుంది. అది అర్థం చేసుకొని మన జీవనాన్ని మనం శ్రద్ధగా గౌరవాసక్తులతో సాగించుకుంటూ పోవాలి అనే సందేశాన్నిస్తూ 80వ పుటలో ఉన్న కథ చాలా బాగుంది. పెద్ద ఎలుక ఒకటి చెట్టుకింద బొరియలో నివసించేది. తన పదునైన పళ్ళతో చెట్టు వేర్లను, కాండాన్ని కొరికి తినేది. ఏదో ఒక రోజు ఈ చెట్టును కూలగొట్టేస్తాను అనుకునేది.
ఒకరోజు ఈ ఎలుకను ఒక పిల్లి వెంటబడి తరిమింది. పిల్లికి భయపడి పరుగెత్తే బదులు తానే పిల్లి ఎందుకు కాకూడదు అనుకుంది ఎలుక. వెంటనే ఎలుక పిల్లిగా మారింది. ఇంకోరోజు ఈ పిల్లికి ఒక కుక్క ఎదుటపడింది. ప్రాణభయంతో పరుగెత్తే బదులు తానే కుక్క ఎందుకు కాకూడదు అనుకుంది. కుక్కగా మారింది. అంతలో ఒక పులి దీని వెంటబడింది. అది గమనించిన కుక్క తాను పులిగా మారింది. అంతలో ఒక వేటగాడు వేటకు రావడం, పులిని చూసి వెంటబడటం జరిగింది. పులి వేటగాడుగా మారితే బాగుండు అనుకుంది. వేటగాడుగా మారిన పులి అలసిపోయి ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకోసాగాడు. బ్రతకడానికి ఎవరిమీదా ఆధారపడకుండా, తనకు తానుగా ఆహారం తయారుచేసుకొని హాయిగా ఉండే చెట్టు అయితే బాగుండునని భావించాడు. అంతే, చెట్టుగా మారిపోయాడు. అంతలోనే కటకట అనే శబ్దం వినిపించింది. చూస్తే ఒక ఎలుక తన వేర్లను కొరుకుతూ కనిపించింది. ఇలాగే కొరికించుకుంటూ పోతే ఏదో ఒక రోజు కూలిపోవాల్సి వస్తుంది అనుకుంది చెట్టు. ఎలుక జనే్మ గొప్పది అనుకుంది. అంతే మళ్లీ ఎలుకగా మారిపోయింది. ఇదీ ఆ కథ.
24వ పుటలో ‘ఆ తరువాత..’ అనే శీర్షిక కింద ఉన్న సాంభాషణిక వృత్తాంతంలోని గంభీర తాత్త్విక ప్రశ్న రూప సమాధానం చాలా బాగుంది.
ప్రాచీన గ్రీకు దేశంలో డయోజనస్ అనే తత్త్వజ్ఞాని ఉండేవాడు. ‘ఏథెన్సును గెలిచినావు. ఇక ముందు?’ అని అడిగాడు ఒకనాడు అలెగ్జాండర్‌ను. ‘పర్షియాను ఆక్రమిస్తాను’ అన్నాడు అలెగ్జాండర్. ‘ఆ తర్వాత?’ అడిగాడు డయోజనస్. ‘ఈజిప్టుమీద దండయాత్ర’ తడుముకోకుండా చెప్పాడు గ్రీకు చక్రవర్తి. ‘సరే.. అది కూడా జరిగినాక?’ అనడిగాడు డయోజనస్. ‘‘మొత్తం ప్రపంచానే్న వశం చేసుకోవటం’’ అన్నాడు అలెగ్జాండరు. ‘ఇక ఆపైన?’ అడిగాడు తత్త్వవేత్త. ‘‘నా మనస్సు తేలిక పరచుకొని ప్రశాంతంగా కాలం గడుపుతాను’’ అన్నాడు అలెగ్జాండర్. ‘‘అలాంటి పని ఈ క్షణంలోనే నీవు ఎందుకు చేయవు?’’ అన్నాడు డయోజనస్. అలెగ్జాండరు నిరుత్తరుడైనాడు.
ఐన్‌స్టీన్ భార్య ఎల్సా ఒక సందర్భంలో ఇచ్చిన సమాధానం హాస్య, గంభీరార్థ మనోజ్ఞం. ‘‘మీవారి సాపేక్ష సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నారా?’’ అని ఒకామె ఐన్‌స్టీన్ భార్యను అడిగింది. ‘‘అర్థం కాలేదు...’’ అంది ఎల్సా. ‘‘అయ్యో.. పాపం..’ అని అవతలావిడ సానుభూతి చూపించింది. అపుడు ఎల్సా, ‘‘అయితే ఆ సిద్ధాంతంకన్నా ఉత్తమమైనదానే్న అర్థం చేసుకున్నానులే’’ అన్నది. ‘ఏమిటి?’ అడిగింది ఆ పొరుగామె. ‘‘ఐన్‌స్టీన్‌ను’’ అన్నది ఎల్సా (110వ పేజీ). ఇలా ఈ పుస్తకంలో ప్రతి పుటలోనూ ఏదో ఒక విశేషం ఉంటుంది.
అయితే 69వ పుట చివరలో వేదాలను శృతులు అంటారు అని ఉంది. శృతులు కాదు శ్రుతులు అని రాయాలి. 21వ పుటలో ‘కడుపు స్మశానం కదా’ అని రాశారు, శ్మశానం అనాలి.
మొత్తంమీద ఈ గ్రంథంలో ఏవో ఒకటి రెండు ‘దీపికలు’ మాత్రం మిణుకుమిణుకుమనేవి అయినప్పటికీ కొన్ని వందలకుపైగా ఇట్టి పొట్టి శీర్షికలతో వున్న పెక్కు ఆకాశదీపాలలో ఎక్కువ శాతం దివ్వెలు చక్కని వెలుగుల ‘అక్కరపు’ జ్యోతులే.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 9849779290