పఠనీయం

స్పష్టాస్పష్ట అభివ్యక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోయ మరికొన్ని కథలు - రచన:బి.అజయ్‌ప్రసాద్, వెలెరూ.140/-,
ప్రతులకు:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ మరియు విశాలాంధ్ర బుక్‌హౌస్ వారి అన్ని బ్రాంచీలు
=================================================================
కల్పన, అభివ్యక్తి- ఈ రెంటినీ రెండు కళ్ళుగా చేసుకుని, భౌతిక చక్షువును దాటి మరింత లోతుగా మనిషిలోకి చూడగలుగుతాడు ‘లోయ మరి కొన్ని కధలు’ సంకలనకర్త బి.అజయ్‌ప్రసాదు.
ఏకకాలంలో- ‘‘ఆమె కళ్ళు గతాన్నీ, భవిష్యత్తునీ కలిపి, శూన్యంలోకి ‘చూడగలగటం’ ఆయన సృష్టించిన ‘లోయ’లోని చెన్నమ్మ పాత్రకే సాధ్యమవుతుంది. ఒకసారి గాలితో చీకటిని ఊపుతాడు; మరోసారి చీకటితో గాలిని ఊపేస్తాడు (మృగశిర కధ) గాలి; చీకటి- రెండూ అభౌతికాలే. అయినా ఈ రచయిత రెంటినీ తన స్వంతం చేసుకుని పాఠకుల గుండె నూపుతాడు. వచనంలో కవిత్వపు ధోరణులను ఒలికించగలిగే ఈ సంకలనంలో 15 కథలున్నాయి. ఇవన్నీ-2005 నుండి 2017-అంటే ఓ పుష్కర కాలంలో పలు ప్రజాదరణ పొందిన పత్రికల్లో ప్రచురించబడి, ఇపుడు సంకలన రూపంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్ వారు పాఠకులకందిస్తున్నారు. ఈ కథల్లో కనబడే పాత్రలు- ఏడుకొండలు చల్లపరెడ్డి (చివరి నీడ) జీవానంద్, మాధవరావు (్భయాస్) గురిగాడు, పేరులేని బైరాగి, మానిక్కెం (జాగరణ) జయమ్మ, చెన్నమ్మ, శీను (లోయ)- అందరూ నిత్య జీవితంలో తారసపడే వ్యక్తులే. నవ్వు, దుఃఖం, కలిమిలేమి, వెనె్నల, చీకటిని అనుభూతించే సామాన్య వ్యక్తులే- అయినా వీరందరూ అసామాన్యంగా ఆలోచిస్తారు. పేడను పురుగు చేస్తారు. పసుపు గడ్డిని పులి చేస్తారు. మొక్కను నక్క చేస్తారు (మృగశిర పే.101). అపుడే ‘వెనె్నల వెలుగును చూస్తారు.
అప్పుడే చెట్ల ఆకుల్లోకి చొచ్చుకు వస్తున్న వెనె్నలతో, చీకట్లను విరుచుకుతినేలా చేస్తారు (జాగరణ). సాలార్‌జంగ్ మ్యూజియంలో ‘వీల్డ్ రెబెకా’ అనే పాలరాతి శిల్పం ఉంటుంది. రెబెకా ముఖాన్ని పల్చటి మేలి ముసుగు కప్పి ఉంటుంది. సందర్శకులు ఏకకాలంలో రెబెకా ముఖాన్నీ, ముఖంమీద కప్పిన మేలి ముసుగునీ చూడగలుగుతారు.
అలాగే ఈ సంకలంనంలోని కధలన్నీ అర్థం అరుూ్య అవనట్లుంటాయి.ఆ పాడుబట్ట ఇంట్లో, ఆ రాత్రి మానిక్కెంతో బాటు వచ్చిన ఆవిడ పాదాల్ని చూసి ఆవిడ ‘కులీనత’ను ప్రకటించగలిగే బైరాగి, మరికొద్ది సేపటికే ఆవిడతో ‘నేనసువంటిదాన్ని కాదు సావి’ అని అనేలా చేస్తాడు రచయిత (జాగరణ).
కధలూ, కధల్లోని పాత్రలూ ఏ క్షణాన, ఏ మలుపు తిరుగుతాయో పాఠకులు ఊహించలేరు. ఇక్కడే బహుశా ఈ కధా రచయిత ప్రతిభ ద్యోతకమవుతుంది. ఒకటి రెండుసార్లు చదివితేగాని రచయిత భావాలను అర్థం చేసుకోలేము.

-కూర చిదంబరం 8639338675