పఠనీయం

ఆధునిక చరిత్రాంశు హేళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశోక నివాళి - మొదటిభాగం
రచయిత:సింగంపల్లి అశోక్‌కుమార్, పుటలు:120, వెల:రూ.100/-, ప్రతులకు:ఆలోచన, 305, ప్రగతి టవర్స్, వీరయ్యవీధి, విజయవాడ - 520004.
================================================================
సాధారణంగా రచయితలు అందరూ ఉత్తమ పురుషలు. అంటే ‘నేను’ ‘నావి’, ‘నావి చదవండి’ అంటూ పాఠకులను అపేక్షించేవాళ్ళు, అనే్వషించేవాళ్ళూను. కానీ రచయితలలో ‘ప్రచయితలు’ కూడా కొందరుంటారు. ‘ప్రచయిత’ అంటే పూలు కోసేవాడు. ఈ పదం ‘ప్రచయము’ అనే పదం నుండి చమత్కరంగా కూర్చిన పదం మాత్రమే. ఈ ప్రచయితలు అనే రచయితలు ఇతర రచయితల సాహిత్య జీవిత వివరాల ‘కుసుమాల’ను ఏరి, ఒక నిస్వార్థ సేవాభావంతో సుమపేశల రచనలు కూరుస్తారు. కనుక ఈ రకపు రచయితలు ‘ప్రథమ పురుషలు’. అంటే ఇలాంటివారి గురించే మనం ప్రప్రథమంగా చెప్పుకోవాలి అని అర్థం.
ఒకనాటి మల్లినాథుడు, నిన్నటి కందుకూరి, చాగంటి శేషయ్య, వేటూరి ప్రభాకరశాస్ర్తీ, ఆరుద్ర, దివాకర్ల వేంకటావధాని మొదలైన సాహిత్య చరిత్రకారులందరూ ఇలాంటి ప్రప్రథమ స్మరణీయ ప్రచయితలే (‘ప్రథమ పురుష’లే)
ఇలా కవులు - రచయితల వివరాలను ఈనాడు పుస్తక రూపంలోకి తీసుకువచ్చి చాలామంది సాహితీ సమాజ సేవ చేస్తున్నారు.
అలాంటి సేవాగ్రంథాలలో ‘అసి’ అనే పొట్టి పేరుతో శ్రీ సింగంపల్లి అశోక్‌కుమార్ రూపొందించినది ఒకటి ‘అశోక నివాళి- మొదటి భాగం’.
ఇందులో సంస్కరణ పితామహుడు కందుకూరి వీరేశలింగంగారి నుంచి సాంఘికాభ్యుదయ అరుణోదయ ద్రష్ట కానూరి వెంకటేశ్వరరావు వరకు సాహితీ లోకంలో పేరుగాంచిన యాభై మంది రచయితల జీవిత వివరాలు, సాహిత్య కృషి, ఉద్యమాల ఊపుల గురించి క్లుప్తంగానే అయినా స్ఫూర్తిదాయకంగా అందించాడు అవసరమైన సంగతులన్నీ రచయిత. ఏ వ్యాసమూ రెండు పుటల నిడివిని మించదు. అందుచేత పాఠకుడికి స్థూలంగా ఆయా రచయితల గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది.
ప్రతి రచయితయొక్క ఛాయాచిత్రాన్ని కూడా పొందుపరచటంవల్ల వారి వారి ముఖ లక్షణాల ఆలోకనం ద్వారా పాఠకుడికి ఆయా రచయితల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, మానవతా తాత్త్విక దృక్కులు, గుండెనిబ్బరం, ప్రసన్న వదనత ఇత్యాదులు కూడా తెలిసివచ్చి ఒక పఠన రచనా స్ఫూర్తికలుగుతుంది.
ప్రతి వ్యాస ప్రారంభంలోను ఆ వ్యాసంలోని రచయితకు సింగంపల్లి అశోక్‌కుమార్ ‘కీర్తితిలకం’లాగా ఒక ఉప శీర్షిక పెట్టి ఆ రచయిత విశిష్టత గురించి పరిచయాత్మకంగా ఒక కవిత రాయటం బాగుంది.
ఉదా- శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ గురించి రాస్తూ ‘ప్రబుద్ధాంధ్రుడు’ అంటూ ఒక గోల్డ్ మెడల్ వేసి, ‘శ్రీపాద వచన రచనల పలుకుబళ్ళు / జానుతెనుగు నుడికారాల పరవళ్ళు/ స్వీయ ‘అనుభవాల జ్ఞాపకాలూ’ను /జన జీవితపు చదరంగం గళ్ళు’ అని రాశారు శ్రీ అశోక్‌కుమార్. ‘చదరంగం గళ్ళు’ అనటంలోని ధ్వని గాంభీర్యం ఒక ఉదాత్త కవితా సౌందర్యం.
రాయప్రోలు సుబ్బారావుగారి గురించి వ్రాస్తూ ‘్భవకవితకు ఆదివ్రాలు /తృణకంకణ లలిత రవాలు /్భరతికి మించి లేదన్న /దేశభక్తుడు రాయప్రోలు’ అన్నారు. తృణ కంకణ ధ్వని ఎంత లలిత మృదు సుకుమారంగా ఉంటుందో రాయప్రోలు కవితలలో భావ సౌకుమార్యం పాఠకుడు అంత నిశితంగా అనుశీలన చేస్తేగాని అనుభూతి అందించదు అనేది అశోక్‌కుమార్ చెప్పిన కవిత్వపు పలుకులలోని కమ్మదనం. ‘ఆదివ్రాలు’ అంటే భావకవిత్వానికి రాయప్రోలు రచన ఏదైనా ‘ఆది’ అంటే -ఇలా ఉండాలి అనే ఒక ‘నమూనా’ (ప్యారగన్) వంటిది అనే అర్థం కూడా స్ఫురిస్తుంది.
ఇందులో ముప్పాతిక మువీసం కవుల రచనలను రచయిత తన మార్క్సిజపు భావ కవిత్వాలకు దగ్గరి చుట్టాలే అన్నట్టు చెప్పుకుపోయాడు.
కానీ ‘పాదసూచికలు’ అనే శీర్షిక కింద చెళ్ళపిళ్ళ వెంకటశాస్ర్తీ, విశ్వనాథ, అడవి బాపిరాజు, బలిజేపల్లి మొదలైన సంప్రదాయ భావజాల కవుల గురించి కూడా క్లుప్తంలో క్లుప్తంగానైనా పిసరంత ప్రశంసిస్తూనే రాశారు సింగపల్లి. ముదావహం. ఈ ‘అశోక నివాళి’ ఆధునిక సారస్వత చరిత్రాంశు హేళి (సూర్యుడు).

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 9849779290