పఠనీయం

నమ్మితే నమ్మండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునాద వినోదిని
-డా.అక్కిరాజు సుందరరామకృష్ణ
విశ్రాంత ఆంధ్రోపన్యాసకుడు
ఇం.నెం.1-8-702/1/1
ఆంధ్రా బ్యాంక్ సందు
నల్లకుంట, హైదరాబాద్-44
9885020205

సునాద వినోదిని - ఇదొక కర్ణాటక సంగీత రాగం పేరు. ఈ పుస్తకానికి పేరు పెట్టడంలో ఔచిత్యమేమిటో పాఠకుడికి అర్థంగావడం లేదు. పోనీ ఇదేమైనా ఆ శాస్త్రానికి సంబంధించినదా అంటే కానేగాదు. ఈ కవి సంగీతజ్ఞుడు గనుక ఆతడికి యిది ఇష్టమైన రాగం అని అనుకోవాలి. అసలు విషయమేమిటంటే ఇదొక ‘ఖండకావ్యం’ అని అనవచ్చు. 61 శీర్షికలు ఇందులో కనపడుతున్నాయి. తన జీవితకాలంలో ఎదురైన వ్యక్తులను గురించి ముఖ్యంగా డా.అక్కిరాజు వారు పద్యరూపంగా రాసుకుంటూ వచ్చారు. తన ముందు మాటలో వారే చెప్పుకున్నారు.. ‘ఇవన్నీ ఆశువుగా అప్పటికప్పుడు వేదికల మీద నా నోటి నుండి దొర్లినవే! నమ్మితే నమ్మండి - లేకపోతే మీ ఇష్టం’ అని కూడా అన్నారు. అక్కిరాజు వారు కవి - నట - గాయక - వ్యాఖ్యాత - ప్రయోక్త హరికథకుడు గావడం మూలాన సహజంగానే దేశదిమ్మరి అని వీరిని అనడంలో తప్పేమీ లేదనుకుంటాను. తన సంగీత ప్రస్థానానికి ‘60 ఏళ్లు’ నిండాయని మొదటి వాక్యంలోనే అక్కిరాజు వారు వాక్రుచ్చారు. ముందుమాటలో అనేక ఆసక్తికరమైన విషయాలు వారి ఇతర గ్రంథాలలో లాగానే ఉన్నాయి. కొంచెం స్వోత్కర్ష కూడా చేసుకున్నారేమో అని చదువరులకు అభిప్రాయం కలగడంలో ఆశ్చర్యం కూడా ఏమీ లేదు. పువ్వాడ తిక్కన సోమయాజిగారి పీఠిక ఈ ‘సునాద వినోదిని’ కావ్యానికి మరింత వెలుగునిస్తున్నది. అలాగే కృతిభర్తలలో ఒకరైన శాంతాబయోటిక్ సంస్థ అధినేత డా.వరప్రసాదరెడ్డి గారి ముందు మాటలు రసరమణీయంగా ఉన్నాయి. ఈ గ్రంథం ప్రఖ్యాత ఆర్థోపెడిక్ వైద్యుడు డా.గురవారెడ్డి గారికీ, డా.వరప్రసాదరెడ్డి గారికీ అంకితం. అక్కిరాజు వారి వ్యక్తిత్వాన్ని, వారి బహుముఖీనతను వరప్రసాదరెడ్డి గారు చాలా అందంగా చెప్పారు. కుర్తాళ స్వామివారి దివ్యాశీస్సులు అక్కిరాజు వారి ప్రతి పుస్తకంలో కనబడుతుంది. అలాగే రచయిత అక్కిరాజు వారు తలిదండ్రులను గూర్చి వ్రాసుకున్న పద్యాలు ప్రతి ఒక్కరూ చదువదగ్గవి. సామాన్యంగా అక్కిరాజువారి పుస్తకాలలో చాలా తీవ్రమైన ధోరణితో అధిక్షేపాలూ, వ్యంగ్యాలూ, చమత్కారాలూ కనబడుతుంటాయి. ఒకటి రెండు శీర్షికలు వీటిలో కూడా అటువంటివి కనబడుతున్నాయి. ప్రముఖులకు సన్మాన సత్కారాలు జరుగుతున్నప్పుడు సామాన్యంగా అక్కిరాజు వారిని ముందుగా దైవప్రార్థనకు వేదిక మీదకు పిలుస్తుంటారు. తమ గంధర్వ గానంతో శ్రోతలను పరవశింపచేసే వీరు; ఈ పుస్తకంలో గుంటూరులో తుమ్మల పురస్కారం అందుకున్న డా.ముదిగొండ శివప్రసాద్‌గారి సభలో, అది గుంటూరులో జరిగింది కాబట్టి చమత్కారంగా గుంటూరు గురించి చెబుతూ నాటి గుంటూరుకూ నేటి గుంటూరుకూ ఎంతో వ్యత్యాసం ఉందని ఆశువుగా చెప్పిన పద్యం ప్రతి పాఠకుడికి నవ్వు తెప్పిస్తుంది. రాజకీయ నాయకులకు కోపం దెప్పిస్తుంది - గొప్పవదాన్యుడు, సంస్కారాభిలాషి. విద్యారంగానికి ఎనలేని సేవ చేస్తున్న కళ్లం హరనాథరెడ్డి గారిని గురించి చెప్పిన పద్యం చాలా హృద్యం. ఈ సభ అంతా గుంటూరు బృందావన గార్డెన్స్ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జరగడం వలన కలియుగ దైవమైన స్వామిని గురించి ఈ కవి చెప్పిన పద్యం కూడా వారే గొంతెత్తి పాడితే వినాలనిపిస్తున్నది. ఆ సభల ఉన్నవారినందరినీ, ఒక్కొక్క సీస పద్యపాదంలో అక్కిరాజు వారు చెప్పారు. గుంటూరును గురించి మాత్రం ఒక విసురు విసిరారు. కవిగారు కూడ అక్కడివాడే కావడం మూలాననేమో మరీ ధైర్యంగా - ఇప్పటి గుంటూరు..
పెట్టిన పేరు త్రాగుడుకు పెట్టిన పేరది ‘బ్రా’కెటాటకున్
పెట్టిన పేరు ‘పార్టి’నదె భీతియు, సిగ్గును లేకమార్చుటన్
పెట్టిన పేరు ‘మిర్చి’కిని, పెట్టిన పేరిల ‘నాంధ్రమాత’కున్
పెట్టిన పేరు ‘కల్తి’కిని, పెట్టిన పేరదె మేల్ పొగాకున్’ అంటారు
ఇలా చిత్రవిచిత్రమైన పద్యాలు కనపడతాయి. సినిమా రంగాన్ని గురించి, నేటి యువతను గురించి, ముఖ్యంగా సెల్‌ఫోనును గురించి, ఆంధ్ర కేసరిని గురించి, గుంటూరు హిట్లర్ ఆంధ్రకేసరి శిష్యుడైన నడింపల్లి నరసింహారావుగారు (బారిస్టర్) గురించిన పద్యాలు ఆయన నోట వినాలనిపిస్తుంది. (ఆయన స్వరం తెలిసిన వారికి) ‘కనె్నకోయిల పి.సుశీల’ అన్న శీర్షిక మధురాతిమధురం. అలాగే ‘ఆంధ్రభోజుడు అప్పాజోస్యుల’ అన్న శీర్షిక ప్రత్యక్షర సత్యమే ననిపిస్తుంది.

-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యం