ఆటాపోటీ

చిరస్మరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జెంటీనాలో సాకర్‌కు ఎంతో ఆదరణ. చిన్నతనం నుంచే ఫుట్‌బాల్‌తో ఆటలాడడం, జాతీయ జట్టుకు ఎంపిక కావాలని నిరంతరం శ్రమించడం అక్కడ ప్రతి ఒక్కరికీ అలవాటు. జాతీయ జట్టుకు మ్యాచ్‌లు ఆడడం చాలా గొప్ప. ఇక ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగితే, అంతకంటే కావాల్సింది ఏముంటుంది. అందుకే, కేవలం ఒక్క నిమిషమైతేనేం... అర్జెంటీనా తరఫున ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఆడిన మార్సెలో ట్రోబియానీ తన జన్మ ధన్యమైందని పులకించిపోయాడు. ప్రపంచకప్ సాకర్ చరిత్రలోనే అతనిదే అత్యల్ప కెరీర్. కానీ, ఒకసారి మైదానంలోకి దిగానన్న సంతృప్తి అతనికి మిగిలింది. 1986 సాకర్ వరల్డ్ కప్‌లో సబ్‌స్టిట్యూట్‌గా ట్రోబియానీ తొలిసారి మైదానంలోకి అడుగుపెట్టాడు. కానీ, ఒక నిమిషంలోనే రీప్లేస్‌మెంట్ జరిగింది. అంతకు ముందుగానీ, ఆతర్వాతగానీ అతను వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడలేదు. మొత్తం మీద ఒకే ఒక నిమిషం ప్రపంచకప్ మ్యాచ్ ఆడిన ఏకైక ఫుట్‌బాలర్‌గా ట్రోబియానీ రికార్డు సృష్టించాడు.

- సత్య