ఆటాపోటీ

డోప్ పరీక్షలకు ఓ సమయమంటూ లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో ఒలింపిక్స్ అధికారులపై స్విమ్మర్లు మండిపడ్డారు. తెల్లవారు జామునే వచ్చి డోపింగ్ పరీక్షలంటూ గది తలుపులు బాదుతూ హడావుడి చేయడమే వారి కోపానికి కారణం. డోప్ పరీక్షల కోసం అథ్లెట్ల మూత్ర నమూనాలను అధికారులు సేకరించాలి. అయితే, పోటీల్లో పాల్గొని లేదా విరామం లేకుండా ప్రాక్టీస్ చేయడంతో అలసిపోయి గాఢ నిద్ర పోతున్న తమను తెల్లవారు జామునే లేపేస్తున్నారవి స్విమ్మర్లు వాపోయారు. ఇదెక్కడి నిబంధన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదీ నిజమే!

యూనీ సైకిల్ రేస్
ఇటీవల కాలంలో బాగా ప్రచారం పొందింది యూనీ సైకిల్ రేస్. ఒకటే చక్రం.. సీటునే హ్యాండిల్‌గా వాడుకోవాలి.. ఈ చిత్రమైన యూని సైకిల్‌ను బ్యాలెన్స్ చేస్తూ, కింద పడకుండా నడిపించడమే కష్టం. అలాంటిది రేస్‌లో పాల్గొనాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి. చాలా దేశాల్లో యూనీ సైకిల్ రేస్‌లు జోరుగా సాగుతున్నాయి. ఏటా ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ను కూడా నిర్వహిస్తున్నారు. కొత్తగా కనిపిస్తున్నది కాబట్టి, ఔత్సాహికులు వందల సంఖ్యలో యూనీ సైకిల్ రేస్‌కు హాజరవుతున్నారు.

కొంప ముంచిన
బ్రూక్ అత్యుత్సాహం
వెల్టర్‌వెయిట్ చాంపియన్ కెల్ బ్రూక్ అత్యుత్సాహం కొంప ముంచింది. అతనిని ఆసుపత్రిపాలు చేసింది. తనకు తానే రెండు విభాగాల్లో ప్రమోషన్ ఇచ్చుకొని మిడిల్‌వెయిట్ కేటగిరిలో చాంపియన్ గెనాడీ గొలొవ్‌కిన్‌తో ఫైట్ చేసే సాహసానికి ఒడిగట్టాడు. అత్యంత ప్రమాదకరమైన బాక్సర్‌గా గొలొవ్‌కిన్‌కు పేరుంది. అతను విసిరే పంచ్‌ల నుంచి తప్పించుకోవడం సులభం కాదని చాలా మంది హెచ్చరించారు. అయినా బ్రూక్ వినలేదు. పట్టును వీడలేదు. అతను కోరినట్టే ఫైట్ జరిగింది. రెండో రౌండ్‌లోనే గొలొవ్‌కిన్ విసిరిన పంచ్‌లకు బ్రూక్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని కనుగుడ్డు దాదాపుగా ఊడిపోయే ప్రమాదం ఏర్పడింది. రిఫరీ వెంటనే జోక్యం చేసుకొని ఫైట్‌ను ఆపించాడు. బ్రూక్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని ఫైట్ నిర్వాహకులు ప్రకటించారు. బ్రూక్ అత్యుత్యాహమే అతనిని ఆసుపత్రిపాలు చేసిందని బాక్సింగ్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

-సత్య