ఆటాపోటీ

విల్లీస్ విధానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ బాబ్ విల్లీస్ ట్యాంపరింగ్‌లో కొత్త విధానాన్ని అనుసరించి అప్పట్లో సంచలనం సృష్టించాడు. 1977లో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ మొదటి రెండు టెస్టులను గెల్చుకుంది. చెన్నైలో మూడో టెస్టు జరుగుతున్నప్పుడు ఫాస్ట్ బౌలర్ బాబ్ విల్లీ పదేపదే నుదుటిని చేత్తో రుద్దుకుంటూ, దానిని బంతిపై రాస్తూ అనుమానాస్పదంగా కనిపించాడు. అప్పటి భారత కెప్టెన్ బిషన్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేసి, ఆరా తీస్తే, విల్లీస్ నుదిటిపై వేజ్‌లైన్‌ను రాసుకొని, దానిని బంతికి పూస్తున్న వైనం బయటపడింది. ట్యాంపరింగ్ ఈ విధంగా కూడా చేయవచ్చా అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు.
మట్టి మనిషి ఆథర్టన్
* ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ ఆథర్టన్ ట్యాంపరింగ్ కోసం తడి మట్టిని జేబుల్లో వేసుకొచ్చాడు. 1994లో దక్షిణాఫ్రికాతో లార్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆథర్టన్ జేబు నుంచి మట్టిని తీసి బంతికి రాయడం మ్యాచ్ చూస్తున్న వారికి స్పష్టంగా కనిపించింది. మొదట్లో అనుమానించకపోయనా, బంతి తన వద్దకు వచ్చిన ప్రతిసారీ అతను జేబులో చేతిని పెట్టుకొని, ఆతర్వాతే బంతిని మెరిపించే ప్రయత్నం చేయడం అనుమానాలకు తావిచ్చింది. జాగ్రత్తగా చూసిన తర్వాత అసలు విషయం బయటపడింది. తాను ఎలాంటి పొరపాటు చేయలేదని, ప్యాంటు మురికిపడితే తన తప్పేమిటని ఎదురుదాడికి దిగాడు.

సచిన్‌పైనా ఆరోపణలు!
* క్రికెట్ దేవుడిగా అభిమానుల నీరాజనాలు అందుకుంటున్న భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్‌పైనా ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయ. 2001లో సెయంట్ జార్జి పార్కులో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో అతను బంతిపై ఉన్న నున్నటి భాగాన్ని గోళ్లతో పెరికేశాడని అంపైర్ ఆరోపించగా, మ్యాచ్ రిఫరీ మైక్ డెన్నిస్ అతనిని ఒక మ్యాచ్ నుంచి సస్పెండ్ చేశాడు. ఆ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. బంతిపై అంటున్న గడ్డిపోచలను సచిన్ తొలగించాడని రీప్లేలో స్పష్టంగా కనిపించింది. భారత జట్టు మేనేజ్‌మెంట్ నిరసన వ్యక్తం చేయడంతో సచిన్‌పై సస్పెన్షన్‌ను ఎత్తి వేశారు.

అఫ్రిదీ తెంపరితనం!
* పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ బరి తెగించి ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. 2010 జనవరిలో ఆస్ట్రేలియాతో టి-20 మ్యాచ్ ఆడుతున్నప్పుడు బంతి కుట్లను పళ్లతో కొరికి పట్టుబడ్డాడు. అతని తెంపరితనం, వికృత చేష్ట మ్యాచ్‌ని ప్రత్యక్షంగానేగాక, టీవీలో చూస్తున్న వారికి కూడా కనిపించింది. అంపైర్లు వెంటనే ఆ బంతిని మార్చేశారు. కానీ, అఫ్రిదీపై ఎలాంటి చర్య తీసుకోలేదు. తాను బంతిని వాసన చూస్తున్నానని, దానినే ట్యాంపరింగ్‌గా అందరూ భ్రమపడ్డారని అఫ్రిదీ తనను తాను సమర్థించుకున్నాడు. కానీ, అది తప్పన్న వాదన ఇప్పటికీ ఉంది.

- సత్య