ఆటాపోటీ

‘బీచ్’కే ఓటు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఉసేన్ బోల్ట్ పోటీపడుతున్నాడంటే చూడడానికి అభిమానులు ఎగబడతారు. స్టేడియంలో సీట్లు నిండిపోతాయి. కానీ, రియో ఒలింపిక్స్‌లో దీనికి భిన్నమైన దృశ్యం కనిపించింది. పురుషుల 100 మీటర్ల స్ప్రింట్‌లో బోల్ట్ పరుగును చూసేందుకు చాలా మంది రాలేదు. ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో నిర్వాహకులు తెల్లబోయారు. కారణం ఏమిటని విచారిస్తే, అక్కడి సమీపంలో బీచ్ వాలీబాల్ పోటీలు జరిగాయని, అందుకే బోల్ట్ స్ప్రింట్‌కు ఎక్కువ మంది హాజరుకాలేదని తేలింది. అమ్మాయిలు కురచ దుస్తులు వేసుకొని, బీచ్‌ల్లో వాలీబాల్ ఆడేస్తుంటే, కొన్ని క్షణాల్లోనే పూర్తయ్యే బోల్ట్ పరుగు కోసం ఎందుకు వెళ్లాలనుకున్నారో ఏమోగానీ, అంతా కట్టకట్టుకొని బీచ్ వాలీబాల్‌కు వెళ్లారు. సాంబా దేశంలో కళాపోషణ ఎక్కువే!

సిగ్గు చేటు..
* ఒలింపిక్స్ ఆతిథ్య దేశం సహజంగానే ఆధిపత్యాన్ని కనబరుస్తుంది. భారీ సంఖ్యలో పతకాలు కొల్లగొడుతుంది. కానీ, బ్రెజిల్ మాత్రం ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చి, తక్కువ పతకాలతో సరిపుచ్చుకుంది. అమెరికా 46 స్వర్ణం, 37 రజతం, 38 కాంస్యాలతో మొత్తం 121 పతకాలు సాధించి అగ్రస్థానాన్ని ఆక్రమించగా, బ్రిటన్ 27 స్వర్ణం, 23 రజతం, 17 కాంస్యాలతో మొత్తం 67 పతకాలను అందుకొని రెండో స్థానంలో నిలిచింది. చైనా 70 పతకాలు కైవసం చేసుకుందిగానీ, స్వర్ణాలు 26 కావడంతో బ్రిటన్ కంటే తక్కువగా, మూడో స్థానంలో నిలిచింది. చైనా ఖాతాలో 18 రజతాలు, 26 కాంస్యాలు ఉన్నాయి. అయితే, ఆతిథ్య దేశం బ్రెజిల్ 7 స్వర్ణం, 6 రజతం, మరో 6 కాంస్యాలతో మొత్తం 19 పతకాలకు పరిమితమై, 13వ స్థానంతో సంతృప్తి చెందింది. మొత్తం పతకాల్లో ఇది కేవలం 1.3 శాతం మాత్రమే. 1968లో ఒలింపిక్స్‌కు మెక్సికో ఆతిథ్యమిచ్చినప్పుడు సగటున 1.7 పతకాలను గెల్చుకుంది. ఒక ఆతిథ్య దేశం అతి తక్కువ పతకాలకు పరిమితమైన రికార్డు మెక్సికో పేరిట ఉంటే, రియో ఒలింపిక్స్‌లో బ్రెజిల్ మరింత దారుణంగా విఫలమై, కొత్త రికార్డును నెలకొల్పింది.

కుడి ఎడమైతే..
* కుడి ఎడమైతే పొరపాటు లేదన్నాడు సముద్రాల సీనియర్. ఆ మాట అక్షర సత్యమని రుజువు చేశాడు అమెరికా ట్రిపుల్ జంపర్ క్రిస్టియన్ టేలర్. 2012 లండన్ ఒలింపిక్స్‌లో అతను స్వర్ణ పతకం సాధించినప్పటికీ, లాండింగ్ సమయంలో ఎడమ మోకాలికి గాయం కావడంతో ఆసుపత్రి పాలయ్యాడు. అతను అదే కాలును నేలకు ఆనించడం జంప్ చేయడం అసాధ్యమని వైద్యులు ప్రకటించారు. అయితే, తనకు వచ్చిపడిన కష్టానికి టేలర్ కుంగిపోలేదు. ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన విధానానికి భిన్నంగా, కుడి కాలును నేలకు మోపి జంప్ చేయడాన్ని అధ్యయనం చేశాడు. రియో ఒలింపిక్స్‌లో ట్రిపుల్ జంప్ స్వర్ణాన్ని అందుకున్నాడు. పట్టుదలకు మారుపేరుగా నిలిచాడు.

- సత్య