ఆటాపోటీ

విజ్డెన్ క్రికెటర్ క్లెయిర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ క్లైయిర్ టేలర్ 2009లో విజ్డెన్ విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. 120 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఒక మహిళకు ఈ గౌరవం లభించడం అదే మొదటిసారి. కెరీర్‌లో 15 టెస్టులు ఆడిన ఆమె 1,030 పరుగులు సాధించింది. 126 వనే్డల్లో 4,101 పరుగులు చేసింది. క్రికెట్ ప్రపంచంలో ఆమెను మహిళా బ్రాడ్‌మన్‌గా పిలుస్తారు.
టీనేజ్ సంచలనం
పాకిస్తాన్‌కు చెందిన సజ్జిదా షా కేవలం 12 సంవత్సరాల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రంగ ప్రవేశం చేసిన ఆమె, క్రికెట్ చరిత్రలోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. అంతేగాక, వనే్డల్లో అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణ కూడా ఆమెదే కావడం విశేషం. జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె కేవలం నాలుగు పరుగులిచ్చి ఏడు వికెట్లు కూల్చింది. అయితే, ఒక ఇన్నింగ్స్‌లో ఎక్కువ వికెట్లు కూల్చిన రికార్డును అందుకోలేకపోయింది.
బెలిండా డబుల్!
మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో మొదటి డబుల్ సెంచరీ చేసిన ఘనత ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్‌కు దక్కుతుంది. అంతేగాక మహిళల వనే్డల్లో అత్యధిక స్కోరు కూడా ఆమె ఖాతాలో ఉంది. 1997లో ముంబయిలో డెన్మార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె 229 (నాటౌట్) పరుగులు సాధించింది. 1995 నుంచి 2005 వరకు కెరీర్‌ను కొనసాగించిన బెలిండాకు ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం లభించింది. ప్రపంచ మేటి మహిళా క్రికెటర్లలో బెలిండా తన పేరును లిఖించుకుంది.

-సత్య