ఆటాపోటీ

వికెట్ వేటలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెస్టు క్రికెట్‌లో వికెట్ వేటలో పడి, ఎక్కువ బంతులు వేసిన బౌలర్ల జాబితాలో ఇంగ్లాండ్‌కు చెందిన లెన్ హాప్‌వుడ్‌ది అగ్రస్థానం. కెరీర్‌లో అతను 1934లో ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌లో రెండు టెస్టులు ఆడి, 462 బంతులు వేసి, ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 38 ఓవర్లు బౌల్ చేసిన అతను 46 పరుగులిచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లు వేసి 16 పరుగులిచ్చాడు. తన రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లు బౌల్ చేసి 93 పరుగుల సమర్పించుకున్నాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నిం గ్స్ ఆడకపోవడంతో అతనికి మళ్లీ బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా ‘లెజెండరీ బ్యాట్స్‌మన్’ సన్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ 473 బంతులు ఎదుర్కొని, 43 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 304 పరుగులు చేశాడు. కాగా, అదే హాప్‌వుడ్‌కు చివరి టెస్టు అయింది. ఇక ఒక వికెట్ కోసం ఎక్కువ బంతు లు వేసిన బౌలర్ల జాబితాలో ఉన్న జార్జి హెడ్లీ (వెస్టిండీస్) 14 వేర్వేరు సందర్భాల్లో 398 బంతులు వేసి ఒక్క వికెట్ కూడా సాధించలేదు. వనే్డ ఇంటర్నేషనల్స్ విషయానికి వస్తే, శ్రీలంక ఆల్‌రౌండర్ అతుల సమరశేఖర ఒక్క వికెట్ కూడా కూల్చకుండా 338 బంతులు వేశాడు.

టెస్టు జంటలు

భార్యాభర్తలు ఇద్దరూ క్రికెటర్లు కావడం అరుదు. ఇద్దరూ టెస్టు క్రికెట్ ఆడడం మరీ అరుదు. ఈ విధంగా పురుషులు, మహిళల విభాగాల్లో టెస్టు క్రికెట్ ఆడిన కొద్ది మంది జంటల్లో ముందుగా రోజర్ ప్రిడెక్స్, రూత్ వెస్ట్‌బ్రూక్‌ను పేర్కోవాలి. 1960 దశకంలో రోజర్ ఇంగ్లాండ్ తరఫున మూడు టెస్టులు ఆడాడు. మహిళల విభాగంలో రూత్ 11 టెస్టులు ఆడిం ది. శ్రీలంకకు వికెట్‌కీపర్‌గా 11 టెస్టులు ఆడిన గే డె అల్విస్ భార్య రసంజలి చందిమా సిల్వ కూడా టెస్టు క్రికెటరే. ఆమె ఒక టెస్టు మ్యాచ్ ఆడింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఇటీవలే ఆసీస్ మహిళా జట్టు వికెట్‌కీపర్ అలిసా హీలీని వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ ఇప్పుడు ఆసీస్ తరఫున తమతమ విభాగాల్లో మ్యాచ్‌లు ఆడుతున్నారు. న్యూజిలాండ్ మాజీ పేసర్ రిచర్డ్ హాడ్లీ మాజీ భార్య కరెన్ 1978 జనవరిలో ఒక వనే్డ ఆడింది. కానీ, ఆమె తన కెరీర్‌లో టెస్టు మ్యాచ్ ఆడలేదు.

డ్వెయిన్‌దే రికార్డు

గుజరాత్ లయన్స్ తరఫున ఐపిఎల్‌లో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వెయిన్ బ్రేవో టి-20 ఫార్మెట్‌లో 300 వికెట్ల మైలురాయిని చేరిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్‌ను అవుట్ చేయడం ద్వారా అతను ఈ ఫీట్ సాధించాడు. గాయం కారణంగా ఈసారి ఐపిఎల్‌కు దూరమైన శ్రీలంక పేసర్ లసిత్ మలింగ టి-20 ఫార్మెట్‌లో 299 వికెట్లు కూల్చాడు. యాసిర్ అరాఫత్ 277, అల్ఫొన్సో థామస్ 263, డిర్క్ ననె్నస్ 257, అజర్ మహమూద్ 251 టి-20 ఫార్మెట్‌లో ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో స్థానం సంపాదించారు.

- సత్య