ఆటాపోటీ

సమర్థుడు రోలాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోలాండ్ గారోస్ ఫ్రాన్స్‌లో సమర్థుడైన పైలట్‌గా పేరుప్రఖ్యాతులు ఆర్జించాడు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో పశ్చిమ సరిహద్దులో సేవలు అందించిన అతను మధ్యదరా సముద్రం మీదుగా విమానాన్ని నడిపిని తొలి ఫ్రెంచ్ పైలట్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఆ సమయంలోనే అతను ఫ్రాన్స్ నుంచి జర్మనీకి దగ్గరిదారిని కనిపెట్టాడు. విమానానికి ఉండే ప్రొపెలర్స్‌ను ఉపయోగించి, మెషిన్ గన్స్‌ను వాడే విధానానికి శ్రీకారం చుట్టాడు. శత్రు శిబిరంపై విరుచుకుపడడం, అంతే వేగంగా అక్కడి నుంచి తప్పించుకోవడం రోలాండ్ గారోస్ ప్రత్యేకతలు. 1918 ఆరంభంలో జర్మనీ సరిహద్దులో చిక్కుబడినప్పటికీ, తప్పించుకొని ఫ్రాన్స్ సరిహద్దుకు చేరుకున్నాడు. అదే ఏడాది అక్టోబర్ 5న జర్మనీ దళాలు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. రోలాండ్ గారోస్ మరణించిన ఉజెర్స్ ప్రాంతంలోనే ఇప్పటికీ అతని సమాధి ఉంది. టెన్నిస్ అంటే అమితంగా ఇష్టపడే రోలాండ్ గారోస్ దేశానికి అందించిన సేవలకు గుర్తుగా, టెన్నిస్ టోర్నీకి అతని పేరు పెట్టారు.

సూపర్ స్ట్ఫె

మహిళల టెన్నిస్ ‘ఆల్‌టైమ్ గ్రేట్’ క్రీడాకారిణుల జాబితాలో స్ట్ఫె గ్రాఫ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఒకే ఏడాది నాలుగు గ్రాండ్ శ్లామ్స్‌తోపాటు, ఒలింపిక్స్ పతకాన్ని కూడా గెల్చుకోవడాన్ని ‘గోల్డెన్ శ్లామ్’ అంటారు. టెన్నిస్ చరిత్రలోనే ఈ ఘతనను దక్కించుకున్న ఏకైక ప్లేయర్ స్ట్ఫె గ్రాఫ్. 1988లో ఆమె ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్, వింబుల్డన్‌తోపాటు ఒలింపిక్స్‌లోనూ ఆమె టైటిళ్లు సాధించింది. కాగా, ఒక క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను చాలా మందే సాధించారు. అయితే, రెండు పర్యాయాలు ఈ ఫీట్‌ను అందుకున్న తొలి ఆటగాడు రాడ్ లీవర్. 1962లో తిరిగి 1969లో అతను నాలు గు గ్రాండ్ శ్లామ్స్‌ను కైవసం చేసుకున్నాడు.

పూర్తిగా ‘కే’్ల కాదు
ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్టుపై జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఇది నూటికి నూరు శాతం క్లే కోర్టు ఈవెంట్ కాదనేదని చాలా కొంత మందికే తెలుసు. రోలాండ్ గారోస్ కోర్టు పైన మూడు అంగుళాల లైమ్‌స్టోన్ పూత ఉంటుంది. దానిపై ఎర్ర ఇటుక పొడిని చల్లుతారు. లైమ్‌స్టోన్ కింద ఆరు అంగుళాల అగ్నిపర్వతం నుంచి తవ్వితీసిన ఆరు అంగుళాల మందంతో కూడిన శిలను ఉంచారు. దాని కింద ఒక మీటర్ మందంతో ఇసుక ఉంటుంది.

సమ న్యాయం

పురుషులు, మహిళల విభాగాల్లో సమాన ప్రైజ్‌మనీ ఉన్న ఏకైక టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్. విజేతలకు 1.8 మిలియన్ యూరోల ప్రైజ్‌మనీ దక్కుతుంది. మెయిన్‌డ్రాకు అర్హత సంపాదించి, మొదటి రౌండ్ ఆడిన వారికి 27 వేల యూరోలు చెల్లిస్తారు. రెండో రౌండ్‌కు 50 వేలు, మూడో రౌండ్‌కు 85 వేలు, నాలు రౌండ్‌కు 1,45,000 యూరోల చొప్పున ప్రైజ్‌మనీ ఉంటుంది. ప్రీ క్వార్టర్స్‌లో 2,50,000, క్వార్టర్స్‌లో 4,50,000, సెమీ ఫైనల్‌లో 9,00,000, ఫైనల్ విజేతకు 18,00,000 యూరోల ప్రైజ్‌మనీని ఇస్తారు.