అమృత వర్షిణి

మనసు దోచే మరో ప్రపంచం (ట్రావెలోకం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను, నా సహచరుడు, మా అబ్బాయి, మా కోడలు వారాంతపు సెలవులలో సియాటిక్ నగరం నుండి కెనడాలోని వాంకూవర్ విక్టోరియా సందర్శనకు ప్లాన్ చేసుకున్నాం. మా ఓడ ప్రయాణానికి ముందుగానే టిక్కెట్లు రిజర్వ్ చేసుకున్నాం. మేం అమెరికా వీసాతోపాటు, కెనడా వీసా కూడా భారత్‌లోనే తీసుకున్నాం. అనుకున్న రోజున మా అబ్బాయి కారులో సియాటిలోని పియర్ (ఓడలు ఆగి ఉండే ప్రాంతం)కు చేరుకుని కారును కూడా ఓడలోనికి ఎక్కించి, మేం లిఫ్ట్ ద్వారా ఓడ పైఅంతస్థుకు చేరాము. ఇక్కడ నుండి వాంకూవర్ ద్వీపాన్ని చేరేదాకా మొత్తం ప్రయాణాన్ని ఫొటోలలోనూ వీడియోలలో బంధించాం. అలా ఆ రోజంతా ప్రయాణించి రాత్రి వాంకూవర్‌లోని ఒక హోటల్‌లో బస చేశాం.
మరుసటిరోజు ఉదయానే్న బయలుదేరి కారులో ప్రయాణించి ‘కాపిలానో’ నదిపై ‘సర్‌పెషన్ బ్రిడ్జ్’ ఉన్న ప్రాంతానికి చేరాం. ఇది వాంకూవర్‌లోని వర్షపాతపు అటవీ ప్రాంతంలో అతి గొప్ప ఆకర్షణీయ పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతోంది. ఏటా 8 లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి వినోదాన్ని పొందుతారట. 1889 ప్రాంతాలలో చెట్ల తీగెలు, దేవదారు చెక్కలతో నిర్మించబడిన అతి మామూలు వంతెనను గ్రామస్థులు కాపిలానో నదిని దాటడానికి నిర్మించుకున్నారట. 1983లో ఈ పార్క్, వంతెన ఉన్న అటవీ ప్రాంతాన్ని నాన్సీ స్టిబ్బర్డ్ అనే అతను కొనుగోలు చేసి ఎకోథీమ్ పార్క్‌ను, 2004లో వేలాడే వంతెనను ట్రీ టాప్ అడ్వెంచర్‌గా తీర్చిదిద్దాడు.
ఇది కాపిలానో నదిపై 230 అడుగుల ఎత్తున నిర్మించబడింది. ఇది 446 అడుగుల పొడవునా ఉండి అతి ఎతె్తైన ఫర్ వృక్షాల అగ్రభాగాలను కలుపుతూ కిందికి వేలాడుతూ ఉంటుంది. ఈ ఊగులాడే ఊయల వంటి వంతెనను అటవీ వృక్షాలకు ఏ మాత్రం నష్టం కలుగకుండా అతి తక్కువ మార్పులతో ఇనుప తీగలు (కేబుల్ వైర్స్) దేవదారు చెక్కలను ఉపయోగించి నిర్మించారు. 7 వేలాడే వంతెనల సమూహంగా దీనిని తీర్చిదిద్దారు. దీనిపై నడుస్తుంటే ఊగుతూ ఉండి కొంతమందికి తల తిరగడం, వికారం, భయం కూడా కలుగుతాయి. అందుకే దీన్ని ‘ట్రీ టాప్ అడ్వెంచర్’గా పేర్కొంటారు. కొంత సాహసం చేయగలిగిన వారు, ధైర్యవంతులు మాత్రమే దీని మీద నడవగలరు. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు దీనిపై ప్రయాణించలేరు.
దీనిపై మేం సునాయాసంగా నడుస్తూ కింద ప్రవహించే కాపిలానో నదీ వొంపుల సోయగాలను, ఎవర్‌గ్రీన్ రెయిన్ ఫారెస్ట్ సౌందర్యాన్నీ, పచ్చని పరిసరాల సొగసుల్ని, వీటి వెనుకగా మంచు నిండిన పర్వతాగ్ర భాగాలను చూసి పరవశించాం.
చాలాచోట్ల ఈ అటవీ ప్రాంతపు కాలిబాటలలో ఈ ప్రాంతపు జియాలజీ, చరిత్ర గురించిన వివరాలతో కూడిన బోర్డులలోని సమాచారం పర్యాటకులకు ఆసక్తిని కలిగిస్తాయి. ఇక్కడ అలాస్కా, కెనడాకే ప్రత్యేకమైన బ్రౌన్ ఎరుపు రంగుతో వున్న ఎలుగుబంట్లను చూశాం.
అలాస్కాకే ప్రత్యేకమైన టోటెం పోల్స్‌ను ఇక్కడ ఉంచారు. పెద్దపెద్ద వృక్షాలపై చేపలు, గద్దలు, ఎలుగుబంట్లు బొమ్మలను చెక్కిన శిల్పాలుగల ఇవి 60-80 అడుగుల పొడవైనవి అనేకం ఉన్నాయి.
గ్రౌస్ పర్వతం
అంతేకాక వెనుకటి కాలంలో నివసించిన గ్రామస్థుల శిల్పాలు, వారు పయనించిన చిన్నచిన్న తెప్పలు, వారి వస్తధ్రారణ, వారి వృత్తులలో వారు నిమగ్నమై ఉన్న విధానాన్ని శిల్పాల రూపంలో శిల్పకారులు వాటిని మలచిన విధం అబ్బురపరుస్తుంది. ఈ శిల్పాలు ఉన్న అటవీ ప్రాంతాన్ని ‘గ్రౌస్ పర్వతమ’ని పిలుస్తారు.
క్లిఫ్ వాక్
ఇది అర్ధ వృత్తాకారంలో ఉండే అతి ఎతె్తైన వ్యూయింగ్ ప్లాట్‌ఫాం. కాపిలానో నదిపై 100 మీటర్ల ఎత్తున ఏర్పాటు చేశారు. ఇది జియో సాంకేతిక ప్రతిభా నైపుణ్యానికి నిదర్శనం. దీనిపైకి లిఫ్ట్ ద్వారా వెళ్లాం. పైభాగంలో గ్రానైట్ క్లిఫ్ 3-డి మోడల్ లేజర్స్‌తో అద్భుతంగా నిర్మించారు. ఇది 80 వేల పౌండ్ల బరువైన నిర్మాణం. దీనిపైన్న ప్లాట్‌ఫాం తిరుగుతూ ఉంటుంది. దీనిపై నుంచి మొత్తం అడవిని, కాపిలానో వేలాడే వంతెనను, మంచు నిండిన పర్వతాలను, క్రింద ప్రవహించే కాపిలానో నదిని చాలా చక్కగా కన్నులకింపుగా చూడవచ్చు. ఈ ప్లాట్‌ఫాంని నిర్మించటానికి 4 సంవత్సరాలు పట్టిందట.
కాపిలానో ట్రీటాప్ అడ్వెంచర్ వేలాడే వంతెనను అనేక టెలివిజన్ సీరియల్స్, దక్రో, స్టెయిర్ వే టు హెవెన్, సైకో, స్లైండర్స్ వంటి వాటిలో చిత్రీకరించారు.
ఆ రోజు మేం చూసిన, చేసిన సాహసోపేతమైన, ఉద్వేగభరితమైన ట్రీటాప్ అడ్వెంచర్ సస్పెన్షన్ బ్రిడ్జ్, పరిసరాల సౌందర్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ మా బసకు చేరాం.
మరుసటి రోజు ఉదయం త్వరగా తయారై కారులో బయలుదేరి విక్టోరియాను చేరుకున్నాం. దీనినే బ్రిటీష్ కొలంబియా అనే పేరుతో పిలుస్తారు.
విక్టోరియా
ఇది వాంకూవర్ ద్వీపం దక్షిణపు అగ్రభాగంలో ఉంది. విక్టోరియా 1948 వరకూ వాంకూవర్ ద్వీపం రాజధానిగా ఉంది. తరువాత వాంకూవర్, విక్టోరియా కెనడాలో భాగమయ్యాయి.
ఉత్తర పసిఫిక్ మహాసముద్రపు వెచ్చని వాతావరణం విక్టోరియాలో ఉన్నందున ఇక్కడ పచ్చని పార్కులు, పూదోటలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. అతి ఇరుకైన ‘జువన్ డి ఫూకా’ సంధి ప్రాంతం విక్టోరియాను ఉత్తర అమెరికా ఖండం నుంచి వేరు చేస్తుంది. విక్టోరియా బ్రిటీష్ కొలంబియా రాజధానిగా విలసిల్లుతోంది. ఆకాశహర్మ్యాలు లేని సుందరమైన ప్రాంతం ఇది. దీనికి ఇన్నర్ హార్బర్ ప్రాంతంలోని డౌన్‌టౌన్ ప్రాంతం కలిసి ఒక అందమైన అద్భుత ప్రాంతాన్ని ఆవిష్కృతం చేస్తాయి.
రాయల్ బ్రిటీష్ కొలంబియా మ్యూజియం
ఇది పార్లమెంట్ భవనానికి ఫెయిర్ వౌంట్ ఎంప్రెస్ హోటల్‌కి మధ్యన ఉంది. ఇది నేచురల్ కల్చరల్ హిస్టరీ మ్యూజియం ఆఫ్ కెనడాగా విరాజిల్లుతోంది. థండర్ బర్డ్ పార్క్, జె.ఎస్.హెల్ మెకెన్ ఇల్లు చూడొచ్చు. హెల్ మెకెన్ ఒక డాక్టర్, రాజకీయవేత్త. ఇతడు బ్రిటీష్ కాలనీ విక్టోరియాను కొత్తగా ఏర్పరచిన కానె్ఫడరేషన్ ఆఫ్ కెనడాలో భాగంగా చేర్చడానికి అవిరళ కృషి చేశాడు.
ఫెయిర్ వౌంట్ ఎంప్రెస్ హోటల్
దీనిని 1908లో నిర్మించారు. ఇది ఇన్నర్ హార్బర్ ఏరియాలో ఉండే విక్టోరియాలోని అతి గొప్ప లాండ్ మార్క్‌గా భావించబడే హోటల్. అతి పురాతనమైన, ఖరీదైన ఈ హోటల్ మొదటి ప్రపంచ యుద్ధాన్ని చూసింది. దీనిని ఆర్కిటెక్ట్ ఫ్రాన్సిస్ ఎం. రాటెన్‌బరీ రూపకల్పన చేశాడు. పర్యాటకులకు మధ్యాహ్నం, సాయంత్రం ఇక్కడ ఎంతో స్టైలిష్‌గా టీని అందిస్తారు.
పార్లమెంట్ భవనాలు
ఇన్నర్ హార్బర్ దక్షిణ భాగంలో ప్రస్ఫుటంగా కనపడే భవనం బ్రిటీష్ కొలంమియా ప్రొవెన్షియల్ గవర్నమెంట్, పార్లమెంట్ భవనాలు. వీటిని 1897లో ఫ్రాన్సిస్ ‘రాటెన్‌బరి’ నిర్మించారు. ఆర్కిటెక్ట్ యార్క్‌షైర్ దీనిని డిజైన్ చేశారు. ఇది అతి ఎతె్తైన రాతి భవనం, అతి ఎతె్తైన డోమ్‌ని కలిగి ఉండి, డోమ్ పైభాగంపై కెప్టెన్ జార్జ్ వాంకూవర్ శిలాప్రతిమను కలిగి ఉంది. వాంకూవర్ ఈ ద్వీపాన్ని కనుగొన్న మొదటి నౌకా కెప్టెన్. ఈ ఆవరణలోనే విక్టోరియా మహారాణి శిలాప్రతిమను చూడొచ్చు. ఈ విగ్రహం ఎదురుగానే ఇన్నర్ హార్బర్.
ఈ భవన సముదాయాలలోకి పర్యాటకులకు అనుమతి లేదు. చుట్టూ తిరిగి

ఫొటోలు తీసుకోవచ్చు.
విచిత్రం ఏమిటంటే స్ర్తిలు నడిపే గుర్రపు బగ్గీలలో రోజంతా లేదా సాయంత్రపు చల్లని ఆహ్లాదపూరిత వాతావరణంలో వారిచే రజాయిలు కప్పుకొని విక్టోరియా నగరం అంతా తిరిగి ఆ విశేషాలను వారి ద్వారా తెలుసుకోవడం ఓ అందమైన అనుభవం.
మేం మరోసారి అలాస్కా సందర్శనలో భాగంగా విక్టోరియాను సందర్శించి, గుర్రపు బగ్గీలో తిరిగి మరోసారి విక్టోరియా విశేషాలను తెలుసుకోవడం విశేషం.
చైనా టౌన్
పాత విక్టోరియా నగరాన్ని ఆనుకొని చైనా టౌన్ ఉంది. ఇది గవర్నమెంట్ వీధి, ఫిస్‌గార్డ్ వీధికి దగ్గరగా ఉంది. శతాబ్దానికి పూర్వం 8 వేల మంది చైనీయులు ఇక్కడ నివసించారు. 1971 నుంచి దీనిని ఒక చారిత్రాత్మక ప్రాంతంగా ప్రకటించారు.
బేకన్ హిల్ పార్క్
దీని ఎతె్తైన ప్రాంతం నుంచి అద్భుతమైన జుఆన్ డి ఫూకా సంధి, మంచుతో నిండిన పర్వతాలతో అపూర్వమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. దీని దక్షిణ పడమటి దిశగా ఉన్న శిలాఫలకం కెనడా రహదారిని సూచిస్తుంది.
క్రైగ్‌డారోచ్ కాజిల్
ఇది విక్టోరియన్ సాంకేతిక నైపుణ్యానికి ఒక ప్రతీక. ఈ గొప్ప భవనాన్ని స్కాటిష్ పారిశ్రామికవేత్త రాబర్ట్ డన్స్‌ముయిర్ తన భార్య కొరకు 1880లో నిర్మించాడు. ఇతడు తన బొగ్గు గనుల నుంచి వచ్చిన ధనాన్ని ఈ భవన నిర్మాణానికి వెచ్చించాడు. కాని దీని నిర్మాణం పూర్తి కాకముందే అతడు మరణించాడు. ఇది విక్టోరియాలో బాగా ధనవంతులు ఉన్న ప్రదేశంలో ఉంది. రాక్‌లాండ్ అవెన్యూ, గవర్నమెంట్ అధికారుల భవనాలు, వారి వసతిగృహాలు, విక్టోరియా మహారాణి ప్రతినిధుల నివాసాలు దీని దగ్గరగా ఉన్నాయి.
మారిటైమ్ మ్యూజియం ఆఫ్ బ్రిటీష్ కొలంబియా
దీని మధ్యభాగంలో ఉంచిన ‘టిలికమ్’ అనే పెద్ద నావలో కొంతమంది భారతీయ నావికులు ఈ శతాబ్ది ఆరంభంలో ఇంగ్లండ్‌కి వచ్చారట.
ఈ మ్యూజియం 1896లో బ్రిటీష్ కోర్టులో ఉండేదిట. రిచర్డ్ మాథ్యూ బిగ్ బి అనే జడ్జి 19వ శతాబ్దం చివరి భాగంలో హాంగిగ్ జడ్జిగా పేరుగాంచాడట.
బట్టర్‌ఫ్లై గార్డెన్
ఇది ఒక ఇండోర్ ట్రాపికల్ గార్డెన్. 12000 చ.అ. ఏర్పాటైంది. బుచర్ట్ గార్డెన్‌కు దగ్గరలోనే ఉంది. దీనిలో వెయ్యి రకాల రంగురంగుల అతి అరుదైన సీతాకోకచిలుకలు, మాత్‌లు ఉన్నాయి. కొన్ని రకాల పక్షులు, సరీసృపాలు, చేపలు కూడా చూడొచ్చు.
విక్టోరియా బగ్ జూ
దీనిలో అనేక రకాల అరుదైన ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన కీటకాల విభాగంలో ఉన్న బగ్స్ రంగురంగులలో మనలను అలరిస్తాయి.
బుచర్ట్ గార్డెన్స్
లేడీ బుచర్ట్ అనే ఆమె 55 ఎకరాల సున్నపు రాయి క్వారీ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అతి గొప్ప పుష్ప ఉద్యానవనంగా, బొటానికల్ గార్డెన్‌గా తీర్చిదిద్దింది.
ఈ పుష్ప ఉద్యాన వనంలో 700 జాతులకు చెందిన అనేక పుష్పజాతులు ప్రపంచం మొత్తం నుంచి సేకరించి ఇక్కడ పెంచుతున్నారు. అలా మేం మూడు రోజులు పర్యటించి తిరిగి ఓడ ప్రయాణం చేసి సియాటిల్ నగరాన్ని చేరుకున్నాం.

-కె.సీత - 9440587580