అమృత వర్షిణి
కాంచనగంగ -- ప్రత్యేకవ్యాసాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రపంచంలోనే ఎతె్తైన శిఖరాల్లో మూడవది కాంచనగంగ. దీని ఎత్తు 8,586 మీటర్లు. నేపాల్, సిక్కింలు తూర్పు తీరంలో వుండే భారతీయ స్వయంపాలిత ప్రాంతం కాంచనగంగ. ఈ పర్వతం దిగువ నుండే ప్రజానీకం ఎల్లప్పుడూ బిక్కుబిక్కుమంటూ జీవిస్తారు. సిక్కిం ప్రజలు ఈ పర్వతాన్ని తమ దేవతగా పూజిస్తారు. ఐదు శిఖరాలతో ఉండటంవల్ల వారి తలలకు ఐదు పుర్రెలు ధరిస్తారు. భయంకర వాతావరణం, మంచు ముద్దలు, వరదలు, తుపానులతో నిండి వున్నప్పటికీ ఇక్కడ వుండే వృక్షాలు, జంతువులు ఈ ప్రాంతానికే ప్రత్యేకం. 74 కి.మీ. దూరంలో డార్జిలింగ్ తోటలు కన్పిస్తూ చక్కటి లోయలు, మైదానాలు, మంచు శిఖరాలు, దాని వెనుక ఎవరెస్ట్ శిఖరంతో అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.
కాంచనగంగ అందాలు చూడాలంటే, ప్రయాణీకులు నేపాల్ మీదుగానే వెళ్లాలి. అడవులు, నదులు, మంచు పెళ్లలు, ప్రాచీన నాగరికత చిహ్నంగా చిన్నచిన్న గుడిసెలు, రకరకాల పక్షులతో కూడిన హిమాలయ అరణ్య ప్రాంతం మీదుగా ప్రయాణించడమే కాక నేపాల్, సిక్కిం ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి.