రచ్చ బండ

వామపక్షాలకు కాంగ్రెస్ గాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల వరంగల్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్‌కు ప్రధాన దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సొంత జిల్లా, సొంత నియోజకవర్గమైన మెదక్ లోక్‌సభకు ఉప ఎన్నిక జరగ్గా, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసి ఓడిపోయినా కనీసం డిపాజిట్ దక్కించుకుంది. డిపాజిట్ దక్కిందని చెప్పుకోవడానికైనా మిగిలింది. కానీ వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో డిపాజిట్ గల్లంతయ్యింది. ఈ చేదు అనుభవాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం దృష్టిలో పెట్టుకుని తిరిగి వామపక్షాలకు చేరవయ్యేందుకు ప్ర యత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణలో స్థానిక సంస్ధల కోటా నుంచి శాసనమండలికి (కౌన్సిల్) ఈ నెలలో జరగనున్న 12 స్థానాల్లో ఒకటి, రెండు స్థానాలను వామపక్షాలకు కేటాయించడం ద్వారా ఒకప్పటి ‘మాజీ’ మిత్రపక్షాలైన వామపక్షాలను చేరదీయవచ్చన్న ఆలోచనకు టి.కాం గ్రెస్ నాయకత్వం వచ్చింది.
కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశంతో ఢిల్లీకి వెళ్ళిన టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ఈ విషయాన్ని ముఖ్య నేతల ముందు పెట్టారు. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్ ఈ విషయంలో రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించారు. ఈ నెలలో స్థానిక సంస్ధల కోటా నుంచి కౌన్సిల్‌కు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఖమ్మం నియోజకవర్గం సిపిఐ అభ్యర్థిగా పోటీ పువ్వాడ నాగేశ్వర రావు పోటీ చేయనున్నారు. ఆయనకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సుముఖంగా ఉంది. అదేవిధంగా సిపిఎంకు నల్లగొండ లేదా ఆ పార్టీ కోరే ఏ స్థానమైనా ఇవ్వాలన్న ఆలోచనతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం వచ్చినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ఎందుకింత వెంపర్లాడుతున్నదంటే, 2014 సార్వత్రిక ఎన్నికల్లో అనేక సీట్లు స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయింది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసుకోవాల్సి ఉంది. పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్కలో బల్లెంలా పొంచి ఉంది. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని చెప్పలేకపోయినా, తమ ఓటు బ్యాంకుకు ‘చిల్లు’ కొడుతుందన్న భయం కాంగ్రెస్ నేతలకు లేకపోలేదు. ప్రతి నియోజకవర్గంలో వైకాపా 5 వేల నుంచి 10 వేల ఓట్లను చీల్చినా, కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ అవుతుంది. వైకాపా చేకూర్చే నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే మాజీ మిత్రులైన వామపక్షాలను చేరదీయాల్సిందేనన్న అభిప్రాయానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వచ్చారు.
వామపక్షాలతో కాంగ్రెస్‌కు ఉన్న అనుబంధం ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో కాంగ్రెస్‌తో, అంతకు ముందు తెలుగు దేశం పార్టీతో మిత్రత్వం ఉన్నాయి. 1995 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరించిన వామపక్షాలు 1999 సంవత్సరం ఎన్నికల తర్వాత చంద్రబాబు విద్యుత్తు ఛార్జీలు పెంచడంతో విభేదించి నాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి చేరువై విద్యుత్తు ఉద్యమంలో పాల్గొన్నాయి. అంతేకాదు 2004 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేశాయి. ఆ తర్వాత 2009లో మళ్లీ టిడిపి వైపు మొగ్గు చూపి టిఆర్‌ఎస్‌తో సహా మహాకూటమిగా ఏర్పడ్డాయి. అయినా ఆ ఎన్నికల్లో వైఎస్ విజృంభణకు కూటమి కకావికలమైంది. **