రంగారెడ్డి

స్వామి పరిపూర్ణానంద బీజేపీలో చేరడం శుభపరిణామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, అక్టోబర్ 19: స్వామి పరిపూర్ణానంద భారతీయ జనతా పార్టీలో చేరడం శుభపరినామమని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు నందనం దివాకర్ అన్నారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ విజయ దశమి పర్వదినాన స్వామి పరిపూర్ణానంద బీజేపీలో చేరడం తెలుగురాష్ట్రాల్లో విజయానికి చిహ్నమని చెప్పారు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆకట్టుకున్న ‘వ్యూహలక్ష్మీ’ నృత్య ప్రదర్శన
కాచిగూడ, అక్టోబర్ 19: అతి ప్రాచీనమైన షాహాజి యక్ష గానాలకు దివంగత నాట్యాచార్యులు డాక్టర్ ఉమా రామారావు విశేష ప్రాచుర్యం కల్పించారని ప్రముఖ సినీ దర్శకుడు డా.కే.విశ్వనాథ్ అన్నారు. తంజావూర్ యక్షగానాలు నేటి యువ తరానికి తెలిజేయాడానికి జీవితాంతం తపించారని ఆమె అశయాలను శిష్య బృందం కొనసాగించాలని కో రారు. శనివారం రవీంద్ర భారతిలో ఉమా రామారావు స్థాపించిన లాస్య ప్రియ నృత్య సంస్థ 33వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కే.విశ్వనాథ్ ఉమా రామారావు రచించిన షాహాజీ యక్షగాన గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఉమా రామారావు తెలుగు విశ్వవిద్యాలయంలోని నృత్య శాఖాధిపతిగా అనేక సేవల ను అందించారని కీర్తించారు. కూచిపూడి నాట్యంలో ఎన్నో ప్రయోగ నృత్య రూపకాలు సృష్టించి దేశ విదేశాల్లో ఖ్యాతిని సంపాధించారని పేర్కొన్నారు. ఉమా రామారావు సృష్టించిన వ్యూహ లక్ష్మీ ఆవిర్భావం నృ త్య రూపకాన్ని డా.జ్వాలా శ్రీకళ ఆధ్వర్యంలో ప్రదర్శించిన భక్తి భావా న్ని పెంపొందించింది. సీనియర్ పాత్రికేయుడు శ్రీహరి, తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.