రంగారెడ్డి

విద్యార్థిని ఆత్మహత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, మే 16: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసుకున్న సంఘటన క్యాంపస్‌లో మరో మారు సంచలనంగా మారింది. విద్యార్ధిని తన ఆత్మహత్యకు ఎవరు బాధ్యులు కాదని తను అనుకున్న స్థాయిలో చదవలేక పోతున్నానని పోలీసులకు వివరించడంతో పోలీసులు, యూనివర్సిటీ అధికారులు ఉపిరి పీల్చుకున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన నీతూదాస్ (26) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్లాంట్ అండ్ సైన్స్‌లో పీహెచ్‌డీ మొదటి సంవత్సరం చదువుతుంది. యూనివర్సిటీ ఎల్‌హెచ్ 8 హాస్టల్‌లోని 86 రూములో ఉంటున్న నీతూదాస్ రాత్రి ఒంటి గంట సమయంలో ఒంటికి నిప్పుటించుకుని ఆత్మహత్య యత్నం చేసింది. నిప్పుటించుకున్న నీతూ గట్టిగా అరవడంతో తోటి విద్యార్థినులు మంటలు అర్పి అధికారులకు సమాచారం అందించి యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. యూనివర్సిటీ వైద్యులు నీతూని పరిక్షించి అనంతరం కొండాపూర్‌లోని కిమ్స్‌కు అక్కడ నుంచి ఉస్మానియాకు తరలించారు.

భారీగా గంజాయి స్వాధీనం
రాజేంద్రనగర్, మే 16: గుట్టుచప్పుడు కాకుండా ప్యాకేట్లలో గంజాయిని విక్రయిస్తున్న ఓ ముఠాను టాస్క్ఫోర్స్, రాజేంద్రనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడిచేసి రూ.7 లక్షల విలువైన గంజాయి, నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. పురానాపూల్ ప్రాంతానికి చెందిన గోవింద్, ఉత్తమ్, బాలాపూర్‌కు చెందిన మహ్మద్, మధుబన్‌కాలనీకి చెందిన చక్రపాణి, ఆసిఫ్‌నగర్‌కు చెందిన విఠల్‌చారి, శివ ఈజీ మనీకోసం గంజాయిని విక్రయించడం వృత్తిగా ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి గంజాయిని తీసుకువచ్చి ఇంట్లో నిల్వచేసి చిన్న చిన్న ప్యాకెట్‌లలో ప్యాకింగ్ చేసి నగరం, పరిసర ప్రాంతాలలో విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు విశ్వసనీయ సమాచారం అందుకున్నారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు రాజేంద్రనగర్ సర్కిల్ లక్ష్మీగూడలోని ఓ ఇంటిపై దాడులు చేసి నలుగురు ముఠా సభ్యులను రూ.7 లక్షలు విలువైన గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.