రంగారెడ్డి

కాంగ్రెస్ పథకాలు కాపీకొట్టిన కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, అక్టోబర్ 21: కేసీఆర్‌ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేసీ ఆర్‌పై ధ్వజమెత్తారు. ఆదివారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లికి చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి సబితా ఇంద్రారెడ్డి, పార్టీ యువ నాయకుడు కార్తీక్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంలో యువత, ప్రజల, ఉద్యమకారుల, కాంగ్రెస్ పాత్ర ఎంతో ఉందన్నారు. అయితే కేసీఆర్ మాత్రం దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారన్నారు. ప్రజలను నమ్మించేందుకు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రజలను నమ్మించేందుకు లేనిపోని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్‌పై బురద జల్లేందుకు యత్నిస్తున్నారన్నారు. ఇలాంటి ఆరోపణలకు ప్రజలు ఎవరూ స్పందించడం లేదన్నారు. నాలుగు సంవత్సరాలుగా కేసీఆర్ పాలనలో చేసిన అవినీతి అంతా ఇంతా కాదని ఆరోపించారు. పార్టీలో చేరిన ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసి కాంగ్రెస్ ఆవశ్యకతను ప్రజలకు వివరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్‌లో కష్టపడి పని చేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పని చేస్తే తగిన గుర్తింపు తథ్యమన్నారు. బంగారు తెలంగాణ అని కేసీఆర్ ఎంత చెపుతున్నా తన కుటుంబానికి పెంచి పోషించేందుకే తన పదవులు వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి నాయకులను ప్రజలు ఉపేక్షించకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డి.రమేష్ ముదిరాజ్, నరేష్ యాదవ్, ఈ ఎన్ అశోక్, సదాలక్ష్మి, రమేష్ చారి, బాబురావు యాదవ్, సందమోని సురేష్, కొలన్ సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్ విజయం తథ్యం: కేపీ
జీడిమెట్ల, అక్టోబర్ 21: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ విజయం తథ్యం అని.. గతంలో ఎన్నడు లేనివిధంగా అభివృద్ధి పనులు చేపట్డడంతో పాటు నీటి సమస్యను కూడా దాదాపు అధిగమించడంతో ప్రజలు టీఆర్‌ఎస్‌ను భారీ మోజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ అభ్యర్థి కేపీ వివేకానంద పేర్కొన్నారు. ఆదివారం వివేకానంద తన జన్మదిన వేడుకలను చింతల్ ప్రాంతంలో అభిమానులు, కార్యకర్తలు నాయకుల సమక్షంలో అట్టహాసంగా జరుపుకున్నారు. వివేకానంద మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు వందకు పైగా స్థానాల్లో విజయఢంకా మోగించి అధికారంలో రావడం ఖాయమని రెండవసారి తెలంగాణ సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయడం తథ్యమని జోస్యం చెప్పారు. పార్టీ శ్రేణులు టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు వివేకానందను పూలమాలలు, పుష్పగుచ్ఛాలు, శాలువాలు కప్పి కేక్‌లు కోయించి ఘనంగా సంబరాలు జరుపుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అపద్ధర్మ మంత్రి, కేటీఆర్ మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి వివేకానందకు పుష్పగుచ్ఛాలను అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వివేకానంద నివాసం టీఆర్‌ఎస్ శ్రేణులతో పండుగ వాతావరణం నెలకొంది. సుభాష్‌నగర్ డివిజన్ పరిధిలోని ఇంట్రెస్టడీ వెల్ఫేర్ సోసైటీ సాయి సహకార్ హోమ్‌లో వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకుని నేతలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు రాములు, నరేంద్ర, కొమురయ్య, వేణు, వజీర్ పాల్గొన్నారు.