రంగారెడ్డి

విజేత నల్గొండ జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: కార్పొరేషన్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం (సీబీఈయు) ఆధ్వర్యంలో నిర్వహించిన కామ్రెడ్ జీ.గోవర్దనా ప్రభు స్మారక కప్ టీ-20 క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫిని నల్గొండ జట్టు కైవసం చేసుకుంది. హైదరామాద్, సికింద్రాబాద్, నల్గొండ, మహబుబ్‌నగర్-మెదక్, నిజామాబాద్, వరంగల్ జట్ల కోసం జరిగిన ఈ టోర్నమెంట్ నగరంలోని దోమల్‌గూడా వ్యాయమ కళాశాల మైదానంలో శనివారం నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌ను కార్పోరేషన్ బ్యాంక్ హైదరాబాద్ జోనల్ ఆఫీసు, సీసీపీసీ చీఫ్ మేనేజర్ అనురాగ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీర దారుడ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపోందిస్తాయన్నారు. టోర్నమెంట్‌లో మ్యాచ్‌లు జరిగిన అనంతరం టాప్‌లో నిలిచి రెండు జట్లు నల్గొండ, సికింద్రాబాద్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సికింద్రాబాద్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. అందుకు జవాబుగా బ్యాటింగ్ చేసిన నల్గొండ జట్టు మరో మూడు బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసి విజయలక్ష్యాన్ని అధిగమించి ట్రోఫీని సోంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభ కనపరిచిన శ్రీకాంత్‌కు మ్యాన్ ఆప్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. అనంతరం జరిగిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్పోరేషన్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఆలీండియా జాయింట్ సెక్రటరి రాజేందర్, సీబీఈయు హైదరాబాద్ జోనల్ కార్యదర్శి బీ.కేశవరావులు విచ్చేసి గెలుపొందిన జట్లకు ట్రోఫీలను అందజేశారు. ఈ టోర్నమెంట్‌లో ప్రతిభ కనపరిచిన వారిని జట్టుకు ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణనిచ్చి జాతీయ స్థాయిలో నిర్వహించనున్న బ్యాంక్ ఉద్యోగుల క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు గాను కృషి చేస్తామని రాజేందర్ తెలిపాడు.

అంతర్ పాఠశాలల వాలీబాల్ చాంప్ గౌతం
హైదరాబాద్, జూలై 14: ద్వితీయ వార్షిక వైఏంసీఏ అంతర్ పాఠశాలల బాలబాలికల డాక్టర్ నందన్ సింగ్ ట్రోఫీ వాలీబాల్ టోర్నమెంట్‌లో గౌతం మోడల్ స్కూల్, బాలాపుర్‌లోని పాఠశాల జట్టు విజేతలుగా నిలిచాయి. నారాయణగుడలోని వైఏంసీఏలో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బాలురలో గౌతం స్కూల్ 25-22, 25-17 స్కోరు తేడాతో ప్రత్యర్థి సెయింట్ జోసెఫ్ హైస్కూల్ హాబ్సీగూడపై, బాలికల్లో బాలాపుర్ జట్టు 25-18, 25-21 స్కోరు తేడాతో ప్రత్యర్థి కింగ్ కోటిలోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌పై గెలుపొందింది.