రంగారెడ్డి

పశువైద్యం అందించడంలో జీవికే పని తీరు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట, జూలై 18: జీవాలకు పశు వైద్యం అందించి కాపాడాలని గత సంవత్సరం ప్రారంభించిన జీవీకే 1962 కాల్ సెంటర్ పనితీరు ఎంతో బాగుందని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసించారు. శామీర్‌పేట మండలంలోని దేవరయాంజాల్ పరిధిలో 108 ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీసెస్ కాల్ సెంటర్ ప్రారంభంలోనే ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌లో అత్యవసరం పశు వైద్య సేవల కోసం ‘వెట్‌కేర్ ’ 1962 కాల్ సెంటర్‌ను నెలకొల్పింది. కాల్ సెంటర్‌కు బుధవారం ముఖ్యఅతిథిగా రాష్ట్ర పశు వైద్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచ్చేశారు. మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ జీవీకే సంస్థ వెట్ కేర్ 1962 కాల్ సెంటర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసరంగా జీవాలకు పశు వైద్యం అందిస్తున్న తీరు ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమ కోసం, ఆపదలో ఉన్న పశువులకు, జీవాలకు వైద్య సహాయం అందించి కాపాడాలనే ఉద్దేశ్యంతో గత సంవత్సరం వెట్‌కేర్ 1962 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సమాజంలో జీవాలకు సేవ చేసే వారే ఎంతో గొప్పవారని తెలిపారు. పశు వైద్య సేవలను రైతులకు అనుగుణంగా దశలవారీగా ప్రభుత్వం విస్తరింప చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని చెప్పారు. 1962 కాల్ సెంటర్‌ను మొదట 10 సీట్ల ద్వారా ఏర్పాటు చేసిందని, అనంతరం ముఖ్యమంత్రి ఆదేశాలనుసారంగా రైతుల అవసరాలను గుర్తించి అదనంగా 20 సీట్లను విస్థరించడం జరిగిందని తెలిపారు. త్వరలో ఈ కాల్ సెంటర్‌లో మరో 30 సీట్లను పెంచి రాష్ట్రంలో ఉత్తమ పశు వైద్య సేవలందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ కాల్ సెంటర్‌లో పెరిగిన సీట్లతో రోజుకు 4500 నుంచి 5000 వరకు పశు వైద్యం కోసం కాల్స్‌ను స్వీకరించే వీలుందని చెప్పారు. పెరిగిన సీట్ల వల్ల రైతుల నుండి జీవికే కాల్ సెంటర్‌కు బిజీ లేకుండా స్పష్టంగా కాల్స్‌ను అందుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1962 కాల్ సెంటర్ ద్వారా 99 వెట్ కేర్ వాహనాలు ఉన్నాయని, రానున్న రోజుల్లో మరింత వాహనాలను పెంచి మరింత ఉన్నతమైన సేవలను అందించేందుకు ప్రభుత్వం యోచిస్తుందని తెలిపారు.
వెట్‌కేర్ పశు వైద్య వాహనంలో ఒక పశు వైద్యుడితో పాటు పారా అసిస్టెంట్, ఒక సహాయకుడు, డ్రైవర్ కలసి నలుగురితో పశులకు సేవలందిస్తారని వివరించారు. కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, పశు సంవర్థక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దిలీప్‌కుమార్ సుల్తానీయా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, అధనపు డైరెక్టర్లు డా. చంద్రశేఖర్, మేడ్చల్ జిల్లా పశు వైద్యాధికారి వీరా నంది, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీవో లచ్చిరెడ్డి, తహశీల్దార్ రాజేశ్వర్ రెడ్డి, 108 జీవీకే డైరెక్టర్ కృష్ణంరాజు పాల్గొన్నారు.