రంగారెడ్డి

సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ‘కంటి వెలుగు’ శిబిరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 25: జీహెచ్‌ఎంసీ పరిధిలో గతంలో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగానే జిల్లా పరిధిలో కంటి వెలుగు శిబిరాలను నిర్వహించేలా షెడ్యూల్‌ను తయారు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ యోగితా రాణా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ‘కంటి వెలుగు’ జిల్లా సమన్వయకర్త డీ.నాగార్జున, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ భాస్కరచారి, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి వెంకట్‌లతో కలిసి వచ్చే నెల 15వ తేదీ నుంచి నిర్వహించనున్న కార్యక్రమం ఏర్పాట్లపై చర్చించారు. ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు, అద్దాలను అందజేసే ఈ ప్రతిష్టాత్మకమైన కంటి వెలుగు కార్యక్రమం అమలులో హైదరాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు, ప్రతి వ్యక్తి ఈ శిబిరాలకు హాజరయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఈ నెల 31న జిల్లా స్థాయిలో, ఆగస్టు 1న మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం
మేడ్చల్, జూలై 25: రైతు శ్రేయస్సే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల అభ్యున్నతిని కాంక్షిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని బుధవారం కండ్లకోయ గ్రామ పరిధిలోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా వంటి చారిత్రాత్మకమైన పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌ది టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని వివరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసిన సమయంలో నేమూరి సుగుణ భర్త విష్ణుగౌడ్‌కు ఎంతో సహాకారం అందిచారని, మహిళలకు 33శాతం రిజర్వేషన్ ప్రాతిపదిక ఆధారంగా మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సుగుణ పేరును ఖరారు చేసినట్లు తెలిపారు.
ప్రమాణ స్వీకారోత్సవం
మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మార్కెటింగ్‌శాఖ జిల్లా అధికారి ఛాయాదేవి తొలుత చైర్మన్ నేమూరి సుగుణచే ప్రమాణస్వీకారం చేయించిన అనంతరం వైస్ చైర్మన్‌గా గుర్రం లక్ష్మారెడ్డి ఆ తర్వాత సభ్యులందరిచే ప్రమాణస్వీకారం చేయించారు. మేడ్చల్, శామీర్‌పేట్, మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు నూతన పాలవర్గాన్ని శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలను అందించి అభినందనలు తెలియజేశారు. సభ్యులుగా పీ.గోవింద్ రెడ్డి, పీ.రమేశ్, కే.బుచ్చయ్య చారి, ఒగ్గు శంకర్, కే.కృష్ణారెడ్డి, నాగభూషణం, రమేశ్ గుప్త ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సమన్వయకర్త నందారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీపీలు చంద్రశేఖర్ యాదవ్, రామారం సుజాత, శ్రీనివాస్ గౌడ్, జడ్పీటీసీలు శైలజ హరినాథ్, పీఏసీఎస్ చైర్మన్ పెంటారెడ్డి, అంతిరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి జహాంగీర్, శామీర్‌పేట్ మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు విష్ణుగౌడ్, సర్పంచ్ బేరీఈశ్వర్, నారాయణ గౌడ్, స్థానిక నాయకులు శేఖర్ గౌడ్, నర్సింహా రెడ్డి, మోహన్ రెడ్డి, శైలేందర్, ఉప్పరి రాజు, శ్రావణ్, స్వామి, సంతోష్ గౌడ్, ఏఎంసీ కార్యదర్శి రవీందర్ రెడ్డి, ఏడీఏ శోభారాణి పాల్గొన్నారు.