రంగారెడ్డి

కాలుష్యం కాటేస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఆగస్టు 19: ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కాలుష్యకారక రసాయన పదార్ధాలను ట్యాంకర్‌లో తీసుకువచ్చి ఏదులాబాద్ చెరువులో కలుపుతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. చెరువులో కాలుష్యకారక రసాయనాలను కలపుతున్న విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రభుత్వ అధికారులు దిగివచ్చి సంబంధిత పరిశ్రమను మూసివేసే వరకు కదిలేది లేదని ధర్నాకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి బోర్డు మెంబర్ స్థానిక జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను రప్పించారు. సంబంధిత నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకుని, పరిశ్రమను మూసివేస్తామని ఆయన స్థానికులకు హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు. నగరంలోని జీడీమెట్ల పారిశ్రామికవాడకు చెందిన ఓ రసాయన పరిశ్రమ నుండి విషపూరిత కాలుష్య కారక రసాయన పదార్ధాలను ట్యాంకర్ (టీఏస్ 12 యూబీ 8483) ద్వారా తరలించి ఏదులాబాద్ లక్ష్మినారాయణ చెరువులోకి వచ్చే నారాయణరావు చానల్‌లో ఆదివారం తెల్లవారుజామున కలుపుతున్నట్లు చెప్పారు. చెరువుకు కాపలా ఉంటున్న గ్రామానికి చెందిన పూస బిక్షపతి, సింగారం సుక్కయ్య, పూస బాలయ్య గమనించి రసాయన పదార్ధాలను ఖాళీ చేస్తున్న ట్యాంకర్ వద్దకు వెళ్లి డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురిని పట్టుకుని గ్రామస్థులకు సమాచారం యిచ్చినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా జరిపి ట్యాంకర్ డ్రైవర్ కొర్ర శ్రీనివాస్(38)తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్‌స్పెక్టర్ పీ.రఘువీర్‌రెడ్డి తెలిపారు. ట్యాంకర్ జీడిమెట్ల నుండి రాయచూర్ వెళ్లుచున్నట్లు పర్మిట్ తీసుకుని ఏదులాబాద్ చెరువులో కలుపుతున్నట్లు మూసీ పరిరక్షణ సమితి కన్వీనర్, మాజీ సర్పంచ్ మూసీ శంకర్ చెప్పారు. రసాయన కంపెనీల నుండి విషపూరిత రసాయనాలను తీసుకువచ్చి కలపటం వల్ల నీరు కలుషితమై లక్షలాది రూపాయల విలువగల చేపలు చనిపోయినట్లు తెలిపారు. నీరు కలుషితమై డాక్టర్లకే అంతుపట్టని రోగాలు రావటంతోపాటు పంటల పండటం లేదని, పశువులు, గొర్రెలు, మేకలు చనిపోతున్నట్లు ఆరోపించారు. మూసీ పరిరక్షణ సమితి కన్వీనర్, మాజీ సర్పంచ్ మూసీ శంకర్, వైయస్‌ఆర్ ట్రస్టు చైర్మన్ యేనుగు సుదర్శన్‌రెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు.