రంగారెడ్డి

నేత్ర వైద్య పరీక్షలకు ప్రణాళికలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కంటి వైద్య పరీక్షల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్‌లను ఆదేశించారు. మంగళవారం సచివాలయం నుండి శాంతికుమారి, వైద్య, ఆరోగ్య శాఖ కమీషనర్ వాకాటి కరుణతో కలిసి కంటి వెలుగు కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం ప్రతి గ్రామంలో ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు, రక్తపరీక్షలు మరియు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైనవారికి ఉచిత కళ్ల జోళ్లను, కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించుటకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌లకు సూచించారు.
అవసరమైన వారికి మందులు సరఫరా చేస్తామని తెలిపారు. ముందుగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఒక్కో ప్రదేశంలో పరీక్షా శిబిరాలు ఏర్పాటుచేసి నిర్వహణ పనితీరు తెలుసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో చాలామంది ప్రజలు కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని, ప్రజలందరు కంటి వైద్య శిబిరాల ద్వారా పరీక్షలు చేయించుకొనుటకు అవగాహన కల్పించాలన్నారు. శిబిరాల ద్వారా కంటి పరీక్షలు మూడు నెలల్లో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జిల్లాలో జనాభాను దృష్టిలో పెట్టుకుని ఎంతమంది వైద్యులు, సిబ్బంది అవసరం, కావాల్సిన పరికరాలు, ప్యారా మెడికల్ ఆప్తమిక్ అధికారులు అవసరం ఉంటారో ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. శిబిరాలలో పనిచేయుటకు ఆశా వర్కర్లు, అంగన్‌వాడి కార్యకర్తలు, స్ట్ఫా నర్సులు, హౌస్ సర్జన్‌చేసే డాక్టర్‌లు, మలేరియా సిబ్బంది, టీబీ తదితర సిబ్బందికి శిక్షణ ఇస్తామని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నందున అర్బన్ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ కమీషనర్ సహకారంతో శిబిరాలు నిర్వహిస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ హరీష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బాలాజీ పవార్, జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ అధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి, సిబ్బంది పాల్గొన్నారు.

సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు
ఉప్పల్, మార్చి 20: పట్టణంలోని శ్రీరామ కాలనీలో వెలసిన సీతారామచంద్ర స్వామి ఆలయంలో స్వామివారి కల్యాణం, వార్షిక రథోత్సవ వేడుకలు, జాతర సందర్భంగా వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు సత్వరమే కల్పించాలని స్థానిక కార్పొరేటర్ మేకల అనలా రెడ్డి అధికారులను ఆదేశించా రు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ఉప్పల్ సర్కిల్ ఇఇ రాజయ్య, డీఇ, ఎఇలతో కలిసి కాలనీని సందర్శించారు. కనీవినీ ఎరుగని రీతిలో కన్నుల పండువగా జరిగే కల్యాణానికి భక్తులు వేలాదిగా తరలి వస్తారని పేర్కొన్నారు. ఆలయం నుంచి అంగడి బజార్‌లోని ఆంజనేయ స్వామి ఆలయం వరకు రథయా త్ర ఉంటున్న నేపథ్యంలో వీధిలైట్లు, డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌పై మూతలు, గుంతలకు మరమ్మతులు, తాగునీటి సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి 31 వరకు జరిగే వేడుకల్లో పాల్గొంటున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.
ఉప్పల్: సీతారాముల కల్యాణ, వార్షిక, రథోత్సవ వేడుకలకు పట్టణంలోని శ్రీ రామచం ద్ర స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తామవుతోంది. ఈనెల 26 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న వేడుకల్లో భాగంగా 29వ తేదీన శ్రీవారి విమాన రథోత్సవం, జాతర ఉంటుందని ఆలయ నిర్వాహకులు మోత్కూరి రామ్మోహన్ శర్మ తెలిపారు.
ఆరు రోజులపాటు జరిగే వేడుకల్లో పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులతో పాటు అధికార, రాజకీయ ప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు. నిత్యం ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.