రంగారెడ్డి

రియల్ ఎస్టేట్‌లకు ధీటుగా..హెచ్‌ఎండీఏ మోడల్ లేఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మార్చి 22: భూ సమీకృత విధానం ద్వారా రైతుల నుంచి భూములను సేకరించి ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలకు ధీటుగా లే ఔట్‌లను చేపట్టి నగర చుట్టుపక్కల ప్రాంతాలను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
ఉప్పల్ భగాయత్ రైతుల తరహాలో ప్రతాప్‌సింగారం రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు 200 ఎకరాలకు పైగా భూములను హెచ్‌ఎండీఏకు ఇవ్వడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన కానె్సంట్ లెటర్లను గురువారం హెచ్‌ఎండీఏ కమిషనర్ టీ. చిరంజీవులుకు రైతులు అందజేశారు. డాక్టర్ ఎం.గోపాల్‌రెడ్డితో పాటు 35 మంది రైతులు తమ భూములను భూసమీకృత పద్ధతిన అభివృద్ధి చేయడానికి అంగీకారం తెలిపారు. ఉప్పల్ భగాయత్ లేఔట్ తర్వాత పెద్ద ఎత్తున మరిన్ని లే ఔట్‌లను చేపట్టి రైతులతో పాటు హెచ్‌ఎండీఏకు కూడా లాభదాయకంగా ఉభయ కుశలోపరిగా ఉండేందుకు భూ సమీకృత పద్ధతి ద్వారా రైతుల నుంచి కనీసం యాభై ఎకరాల భూమిని సేకరించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్‌ఎండీఏ పెద్ద ఎత్తున రైతుల్లో ఇటీవల అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. అభివృద్ధి చేసిన ప్లాట్లలో 65శాతం రైతులకు మిగితా 35శాతం హెచ్‌ఎండీఏకు చెందుతున్నట్లు సమాచారం. అసైన్డ్ ల్యాండ్ యజమానులకు పట్టా యజమానులకంటే తక్కువ శాతం కేటాయించే అవకాశం ఉంది.

ఆలయాల అభివృద్ధికి కృషి
కొందుర్గు, మార్చి 22: సమాజంలో ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు. గురువారం కొందుర్గు మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీనర్సింహ స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా హజరయ్యారు.
ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని వివరించారు. కొందుర్గు మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ నర్సింహ స్వామి దేవాలయా నిర్మాణానికి దేవాదయ శాఖ నిధుల నుంచి రూ.45లక్షలు మంజూరైనట్లు తెలిపారు.
పెండ్యాల గుట్టపై వెలసిన శ్రీలక్ష్మీ నర్సింహాస్వామి దేవాలయానికి విద్యుత్తు, మెటల్ రోడ్డు మంజూరు చేసేందుకు కృషి చేస్తాన్నాని హామీ ఇచ్చారు. దేవాలయ నూతన కమిటి అధ్యక్షునిగా జగ్గమోళ్ల గోపాల్, సభ్యులుగా నర్సింహులు, సంజీవ్ కుమార్, యాదమ్మ, చిట్టెమ్మ, బుచ్చయ్య, శంకర్‌లను కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, జే.వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ పటేల్, నర్సింగ్ రావు, నాయకులు శ్రీ్ధర్ రెడ్డి, రాంచంద్రయ్య, గోపాల్, నర్సింహులు, సున్నాల శ్రీను, బాబురావు, బాల్‌రాజ్ పాల్గొన్నారు.