రివ్యూ

గాండ్రించింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** మన్యంపులి
**
తారాగణం:
మోహన్‌లాల్, కమలినీ ముఖర్జీ, జగపతి బాబు, నమిత, లాల్ కిషోర్,
మకరంద్ దేశ్‌పాండే
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: షాజి కుమార్
నిర్మాత: సుందూరపువ్వు కృష్ణారెడ్డి
కథ, దర్శకత్వం: వ్యాసఖ్
**
మళయాలం మోహన్‌లాల్ డెఫినెట్‌గా గొప్ప ఆర్టిస్ట్. పైగా, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. తన స్టయిల్ నటనతో ఈ ఏడాది ‘మనమంతా’ ‘జనతాగ్యారేజ్’తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దీంతో కేరళలో రికార్డులు సృష్టించిన మోహనల్‌లాల్ ‘పులిమురుగన్’ సినిమాను ‘మన్యంపులి’గా తెలుగులోకి అనువదించారు.
**
వృత్తిపరంగా పులికుమార్ (మోహన్‌లాల్) ఓ లారీ డ్రైవర్. అయితే పల్లెలపైబడి ప్రజల ప్రాణాలు తీస్తున్న పులులను వేటాడుతుంటాడు. పులుల్ని వేటాడినందుకు అటు పోలీసు, ఇటు అటవీ అధికారుల నుంచి కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజల కోసం పులులను వేటాడుతూ భర్త కేసుల్లో ఇరుక్కోవడం భార్య (కమిలినీ ముఖర్జీ)కి సుతరామూ ఇష్టం ఉండదు.
ఈ క్రమంలో పులికుమార్ తమ్ముడి స్నేహితులు -పులికుమార్ వద్ద ఓ ప్రతిపాదన పెడతారు. అడవినుంచి తమ ఫార్మా కంపెనీకి గంజాయి అక్రమ రవాణాకు సహకరిస్తే, అదే కంపెనీలో తమ్ముడికి మంచి ఉద్యోగం ఇస్తామని ఆశచూపుతారు. తమ్ముడిమీద మమకారంతో గంజాయి తరలింపునకు ఒప్పుకుంటాడు పులికుమార్. అలా మొదటిసారి అడవిపల్లెను వదలి బయటకు వస్తాడు. జనావాసాల్లో పులికుమార్‌కు ఎదురైన పరిణామాలేంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నది మిగతా కథ.
ఇలాంటి రఫ్ క్యారెక్టర్లు మోహన్‌లాల్ సినీ అనుభవంలో ఎన్నో కనకు -పులికుమార్ పాత్రను సునాయాసంగా చేసేశాడు. వయసు మీదపడినా, ఆకృతిలో భారీ మార్పులొచ్చినా -యాక్షన్ సన్నివేశాలను రక్తికట్టించడానికి మోహన్‌లాల్ పడిన కష్టం సన్నివేశాల్లో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా పులలతో తలపడాల్సి వచ్చిన సన్నివేశాల్లో -మోహన్‌లాల్ పలికించిన ఎక్స్‌ప్రెషన్స్ చిత్రానికి అదనపు బలాన్నిచ్చాయి. తెలుగు ప్రేక్షకులకు క్యారెక్టర్ యాక్టర్‌గానే పరిచయమైన మోహన్‌లాల్, ఈ చిత్రంతో స్టార్ హీరోగానూ మెప్పించే ప్రయత్నం చేసినట్టే.
విలన్‌గా జగపతిబాబు గురించి చెప్పాల్సిన పని లేదు. సెకెండ్ ఇన్నింగ్స్ అంతా విలన్ కెరీర్‌నే కంటిన్యూ చేస్తున్న జగపతిబాబు, వైల్డ్ ఎక్స్‌ప్రెషన్స్ పలికించడలో తన రేంజ్ చూపించాడు. సినిమా ఆకర్షణ కోసం నమిత పాత్రను పెట్టుకున్నా -ఆమెవల్ల సినిమాకు అదనపు బలమేమీ కనిపించలేదు.
మన్యంపులి చిత్రానికి సినిమాటోగ్రాఫర్ షాజికుమార్ ప్రాణం పోశాడు. వైవిధ్యమైన బ్లాక్స్‌లో అడవిని చూపించిన విధానం బావుంది. పచ్చదనం, జలపాతాల అందాలు తన కెమెరా కన్నుతో చూపించి కొత్త అనుభూతి కలిగించాడు. పులులతో హీరో పోరాట సన్నివేశాల్లో సిజి వర్క్‌ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సినిమాకు రిచ్ లుక్ తీసుకురావడంలో సినిమాటోగ్రాఫర్ పనితనం కనిపించింది. అటు అడవి, ఇటు జనావాసాలు.. ఇలా రెండు షేడ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో గోపీ సుందర్ ఓకే అనిపించుకున్నట్టే.
మన్యంపులి తరహా కథలు -మొత్తంగా ఇండస్ట్రీకే కొత్తేంకాదు. అందుకే కథకంటే -పోరాట సన్నివేశాలు, అడవి అందాలు చూపించటంపైనే ఎక్కువ దృష్టి పెట్టడం దర్శకుడి తెలివైన టెక్నిక్. తెలుగు మాస్ సినిమాలకు దగ్గరగానే చిత్రాన్ని డిజైన్ చేసినా -వన్యమృగం, మానవ మృగాలతో జరిపే పోరాట సన్నివేశాలను కొత్తగా చూపడం వెరైటీ.
సినిమా ఆరంభంలో పావుగంటపాటు మొహన్‌లాల్ బాల్యాన్ని, గతాన్ని చూపిస్తూ కథను నడిపించిన విధానంలో దర్శకుడి పనితనం కనిపించింది. హీరో స్క్రీన్‌మీదకు రాకున్నా -ఎక్కడా బోర్‌కు చాన్స్‌లేకుండా కంటెంట్‌ను నేరేట్ చేయగలగడం ఒక ప్లస్‌పాయింట్. ఓ పిల్లాడు పులుల వేటగాడిగా ఎందుకు మారాల్సి వచ్చింది? గ్రామస్తులను రక్షించడానికి హీరో ఎందుకు ప్రాణాలకు తెగిస్తున్నాడు? అసలు పులికుమార్, అతని భార్య గతమేమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలను ఎస్టాబ్లిష్ చేసిన తీరు బావుంది.
ఇంటర్వెల్ ముందు వరకూ వన్యమృగాలతో, ఇంటర్వెల్ తరువాత మానవ మృగాలతో హీరో తలపడిన తీరు -డిఫరెంట్ టెంపోతో నడిపిస్తూ స్టోరీని కైమాక్స్‌కు తీసుకొచ్చిన విధానం బావుంది. పాత కధ చూస్తున్నామన్న భావన మనసుపొరల్లోకి చొరబడకుండా, పోరాట సన్నివేశాలు, మొహన్‌లాల్ నటనానుభవంతో సినిమాను చూపించటం ఆసక్తికరమే. వీటికితోడు అద్భుతమైన విజువల్స్, గగుర్పాటు కలిగించే గ్రాఫిక్ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాను నిలబెట్టేశాయి.
మోహన్‌లాల్‌తో డిజైన్ చేసిన కామెడీ ఎపిసోడ్స్ అంతగా పండలేదు. పైగా టైగర్‌లా కనిపించిన మోహన్‌లాల్‌తో భార్య కమిలినీ క్లాసిక్ రొమాన్స్ అంతగా పండలేదు. హాట్ బ్యూటీ నమిత సినిమాకు ఏమాత్రం ప్లస్ కాలేకపోయింది. సినిమా నిడివిపరంగా ఒకింత సహనానికి పరీక్ష పెట్టేదే. ఏదైమైనా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ‘మన్యంపులి’ పెద్దగా గాండ్రించినట్టే.

-ప్రవవి