రివ్యూ

ఆధునిక ప్రేమ కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** బేఫికర్
**
తారాగణం: రణవీర్‌సింగ్, వాణీకపూర్
సంగీతం: విశాల్-శంకర్
సినిమాటోగ్రఫీ: అనిల్ మెహతా
నిర్మాణం: యాష్‌రాజ్ ఫిల్మ్స్
కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం:
ఆదిత్య చోప్రా
**
లేలేత లవ్‌స్టోరీలు -చిరుమనసుల హృదయ స్పందనలు -తీయటి ప్రేమానుభూతులను అద్భుతంగా ఆవిష్కరించటం అంటే ఏమిటో ఆదిత్య చోప్రాని అడిగితే -చెప్తాడు. ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’కి మించిన మరో దృశ్యకావ్యం ఇప్పటికీ లేదని ఘంటాపథంగా చెప్పొచ్చు ఆదిత్య మాటల్లోనే. దశాబ్దాల పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించి- మనోఫలకంపై చెరగని ముద్ర వేసిందీ చిత్రం. ‘ప్రేమ’ అంటే ఇంత సున్నితంగా.. మరింత మధురంగా.. తీయగా ఉంటుందా అని కుర్రకారు తలవని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. ఇనే్నళ్లయినా ఆ సినిమా తాలూకు ‘స్పర్శ’ అలవోకగా వీణలు మీటుతూనే ఉంది. ప్రేమని సరికొత్తగా ఆవిష్కరించిన ఆ సినిమా నుంచీ -ఎనిమిదేళ్ల క్రితం ‘రబ్ నే బనాది జోడీ’ చిత్రంతో మళ్లీ ప్రేమని స్పృశించాడు ఆదిత్య. మారుతూన్న కాలంతోపాటు మారుతోన్న ప్రేమని అందించటంలో రచయితగా తానేమిటో చూపించాడు. దర్శకుడిగా సెల్యులాయిడ్‌ని ప్రేమతో అలరించాడు. తాజాగా ఈ చిత్రం వాటికి భిన్నంగా ఆవిష్కృతమైంది.
***
ధరమ్ (రణ్‌వీర్ సింగ్)కి పారిస్‌లో షైరా (వాణీకపూర్)తో స్నేహం కుదురుతుంది. వారిద్దరూ దగ్గరై ‘లివింగ్ విత్ రిలేషన్‌షిప్’లో సాగుతూంటారు. షైరా ఆధునిక యువతి. స్వేచ్ఛని కోరుకునే మనస్తత్వం. స్వతంత్రంగా జీవించటం.. తన మనోభావాలను స్పష్టంగా తెలియజేయటం ఆమె ప్రవృత్తి. ఉద్యోగరీత్యా పారిస్ వచ్చిన ధరమ్‌కి ఆమె స్వేచ్ఛాప్రవృత్తి అంటే రాన్రాను నచ్చకపోవటం.. తరచూ అభిప్రాయ భేదాలు రావటంతో ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకుంటారు. ‘బ్రేకప్’ చెప్పినంత మాత్రాన స్నేహంగా ఉండకూడదని ఎక్కడా లేదని.. స్నేహితుల్లా మిగిలిపోదామని భావిస్తారు. అసలు వారిద్దరి మధ్య ఉన్నది స్నేహమా? ప్రేమా? ఆకర్షణా? అన్న మీమాంస తలెత్తుతుంది. ఎటూ తేల్చుకోలేని స్థితిలో -ఏం నిర్ణయించుకున్నారన్నది క్లైమాక్స్.
నేటి యువత భావాలకు అద్దం పడుతుందీ చిత్రం. ‘సహజీవనం’ పట్ల మోజు.. ప్రేమ అనుకొనే ఆకర్షణ.. వారి భావాలేవీ మనసులోకి జొరబడక పైపైనే ఉండిపోవటం.. వీటన్నింటికీ ‘ప్రేమ’ అన్న ముసుగు వేసుకొని బతికేస్తున్నామనీ.. ఒక ఆడ, మగ మధ్య ఆకర్షణ, సెక్స్ తప్ప ఇంకేదీ లేదన్న వారి ఆలోచనా ధోరణి మారిందా? ‘లవ్’ ప్రాధాన్యతను వారిద్దరూ గ్రహించగలిగారా? అడ్జెస్టబుల్ మెంటాలిటీ ఉంటే తప్పేంటి? యువతీ యువకుల మధ్య ‘ఇగో’ ఎంతటి అల్లకల్లోలాన్ని సృష్టిస్తోంది? ఇలా బ్రేకప్ చెప్పుకుంటూ వెళ్తే -జీవితం ఏ తీరానికి చేరుతుంది... ఇత్యాది అంశాలన్నింటినీ కళ్లకి కట్టినట్లు చూపించారు. మారుతున్న సమాజాన్ని వేలెత్తి ప్రశ్నించారు. ‘దిల్ వాలే దుల్హనియా..’ నాటి తల్లిదండ్రుల ధోరణికీ.. ఈనాటి యువత తల్లిదండ్రుల ఆలోచనా సరళినీ.. చక్కగా తెలియజేశారు. ‘దిల్ వాలే..’లో హీరోయిన్ తల్లి సర్దుకుపోవటం గురించి చెప్తే.. ఈ కథలో తల్లి -వ్యక్తిత్వం ప్రధానం అంటుంది. స్వేచ్ఛగా తిరిగే కూతుర్ని మందలించదు. అవన్నీ ఆధునిక భావాలని అంటుంది. కానీ -ఏనాటికైనా ‘జీవితం’ అనే చట్రంలో ఉండిపోవాల్సిందేనని చెప్పలేకపోతుంది. ఇలా అనేకానేక కోణాల్లో ‘ప్రేమ’ని వ్యక్తీకరించారు. ఆధునిక యువత ఆలోచనల తీరు ఆయా జీవితాల్లో ఎలాంటి పరిణామాల్ని తెచ్చిపెడుతోందో? ‘బేఫికరే’ చూడాల్సిందే.
నటనాపరంగా- రణ్‌వీర్‌సింగ్, వాణీకపూర్ చక్కగా నటించారు. ఆదిత్య చోప్రా సినిమా అంటే ఎలా ఉంటుందో కచ్చితంగా అలాగే ఉందీ సినిమా. ఆయా శాఖలూ.. నటీనటులు పరిధి మేరకు నిర్వహించారు.

-బిఎనే్క