రివ్యూ

కిక్కివ్వని లక్కున్నోడు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* లక్కున్నోడు
*
తారాగణం: మంచు విష్ణు, హన్సిక, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్, పోసాని కృష్ణమురళి తదితరులు.
సినిమాటోగ్రఫీ: పిజి విందా
సంభాషణలు: డైమండ్ రత్నబాబు
సంగీతం: అచ్చు, ప్రవీణ్ లక్కరాజు
నిర్మాతలు: ఎంవివి సత్యనారాయణ
దర్శకత్వం: రాజ్‌కిరణ్
*
సరైన హిట్‌కోసం ఎంత గట్టి ప్రయత్నాలు చేస్తున్నా, మంచు విష్ణుకు పరాజయాలే పలకరిస్తున్నాయి. గత ఏడాది చేసిన రెండు సినిమాలు మంచి విజయాన్ని అందించి రిలాక్స్‌ని ఇచ్చాయి. ముఖ్యంగా ‘ఈడోరకం- ఆడోరకం’లాంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత హీరో మంచు విష్ణు తన లక్కీ జోడీ హన్సికతో కలిసి చేసిన చిత్రం ‘లక్కున్నోడు’. ‘గీతాంజలి’తో ఫామ్‌లోకి వచ్చిన రాజ్‌కిరణ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఎంవివి పతాకంపై రూపొందింది. ఈవారం ఎలాంటి గట్టి పోటీ లేకుండా విడుదలైన ఈ సినిమా -మంచు విష్ణు కెరీర్‌కు ఎంత ‘లక్కు’ తీసుకొచ్చిందో చూద్దాం.
***
పుట్టిన క్షణంలోనే లక్కున్నోడుగా పేరు తెచ్చుకుని అది ఆనందించే లోగా బ్యాడ్ లక్‌ని వెంటేసుకునే యువకుడు లక్కీ (మంచు విష్ణు). ఎప్పటికప్పుడు తన తండ్రి దగ్గర బ్యాడ్ అవుతూ ఎప్పటికైనా నాన్న చేత లక్కీ అని పేరు పెట్టి పిలిపించుకోవాలనే కోరికతో ఉంటాడు. అలా ఉన్న అతను ఒకరోజు పాజిటివ్ పద్మావతి (హన్సిక)ని చూసి ప్రేమలో పడతాడు. పద్మావతి కూడా అతన్ని ప్రేమిస్తుంది. అతని లైఫ్ అలా జాలీగా నడుస్తుండగా అనుకోకుండా అతని దగ్గరికి రూ.25 కోట్లు వచ్చి చేరతాయి. ఆ డబ్బు ఎవరిది? ఆ డబ్బుని లక్కీ ఏం చేశాడు? ఆ 25 కోట్లు లక్కీ లైఫ్‌ని ఎలాంటి మలుపు తిప్పింది? లక్కీ వాళ్ళ నాన్న ప్రేమను పొందగలిగిడా? లేదా? అన్న సినిమాపరమైన ప్రశ్నలకు సమాధానం మిగతా చిత్రం.
సినిమా మొదలుపెట్టడమైతే వైవిధ్యంగా, ఆసక్తికరంగానే స్టార్ట్ చేశాడు దర్శకుడు రాజ్‌కిరణ్. హీరో మంచు విష్ణు ట్రైచేసిన పాత్ర కాస్త కొత్తగానే అనిపించింది. ఇక హీరో ఫ్లాష్‌బ్యాక్‌లో తండ్రీ కొడుకుల మధ్య దూరం ఎలా పెరిగిందో చూపడానికి రన్ చేసిన సన్నివేశాలు, ప్రస్తుతంలో హీరో అకారణంగా తండ్రి ముందు మరింత లోకువయ్యే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇక హీరోయిన్ హన్సిక కనిపించిన ప్రతి ఫ్రేమ్‌లో అందంగా ఉంది. గ్లామర్ లుక్‌తో ఆకట్టుకుంది. అయితే వీరిద్దరి ప్రేమకథలో నాణ్యత కొరవడింది. హీరో కాబట్టి హీరోయిన్ ప్రేమించాలనేలా లవ్‌స్టోరీ ఉంటుంది తప్ప కొత్తగా ఆకట్టుకోలేదు. ఇక ఫస్ట్ఫాలో వచ్చే ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్‌ల కామెడీ అక్కడక్కడా నవ్వించింది. ఇక ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీక్వెన్స్ రెండూ బాగున్నాయి. మంచి టైమింగ్‌తో నడిచే రెండు సన్నివేశాలు కొత్తగా ఉండి కథను మలుపుతిప్పుతూ కనెక్టయ్యాయి. అలాగే సెకండాఫ్‌లో ఎంట్రీ ఇచ్చే పోసాని కృష్ణమురళీ కామెడీ అక్కడక్కడా వర్కవుట్ అయింది. సినిమాలో పెద్ద మైనస్ పాయింట్ అంటే సెకండాఫ్. ఒక్క పోసాని కృష్ణమురళి కామెడీ మినహా రెండో అర్థ్భాగం ఎక్కడా ఆకట్టుకోలేదు. ఆద్యంతం రొటీన్ స్క్రీన్‌ప్లేతో నడుస్తూ ప్రతి సీన్ ఊహాజనితంగా ఉంటూ బోర్ కొట్టించింది. విలన్ పాత్ర కూడా సినిమాకి మరో పెద్ద డ్రాబ్యాక్. ఆ పాత్ర విలనిజం పండించడంలో ఎక్కడా బలం చూపించలేదు. అలాగే కథ సీరియస్‌గా నడవాల్సినచోట సైతం బలహీనపడిపోయి చాలాచోట్ల తేలిపోయింది. ఫస్ట్ఫాలో హీరో హీరోయిన్ల మధ్య నడిచే లవ్‌ట్రాక్‌లో ఎక్కడా రొమాంటిక్ యాంగిల్ కనిపించదు. చాలా సాదాసీదాగా సాగుతూ విసిగించింది. ఇక కథ మధ్యలో వచ్చే పాటలు కూడా ఆకట్టుకోలేకపోయాయి. కథలో మంచి కుటుంబపరమైన ఎమోషన్‌ను క్రియేట్ చేసి దాన్ని క్లైమాక్స్‌లో కనెక్టయ్యేలా దర్శక, రచయితలు విఫలమయ్యారు. సెకండాఫ్‌లో కథ పలువిధాలుగా నడుస్తూ ప్రేక్షకుడిని అయోమయానికి గురిచేసింది.
ఇక దర్శకుడు రాజ్‌కిరణ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి తగ్గట్టు కథను ఆరంభించినా, దాన్ని పూర్తిస్థాయిలో ప్రేక్షకుడికి కనెక్టయ్యేలా చెప్పడంలో విఫలమయ్యాడు. ఇక రచయిత డైమండ్ రత్నబాబు మాటలు, ఫస్ట్ఫ్ స్క్రీన్‌ప్లే బాగున్నా సినిమాకు సెకండాఫ్‌లో అందించిన స్క్రీన్‌ప్లే ఆకట్టుకోలేకపోయింది. పిజి విందా సినిమాటోగ్రఫీ ఓకే. అచ్చు, ప్రవీణ్ లక్కరాజుల సంగీతం సోసోగా ఉంది. ఎంవివి సత్యనారాయణ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ జానర్లో వచ్చిన ‘లక్కున్నోడు’ చిత్రంలో రొమాంటిక్ యాంగిల్ లేదు. కానీ కాస్త కామెడీతో నడిపించే ప్రయత్నం చేశారు. ఆసక్తికరమైన ఫస్ట్ఫా, ఇంటర్వెల్ బ్యాంగ్, కామెడీ ప్లస్ పాయింట్లు అయితే ఏమాత్రం బలం లేని విలన్ పాత్ర, బోర్ అనిపించే సెకండాఫ్ కథనం, పాటలు, ఫ్యామిలీ ఎమోషన్‌ను సరిగ్గా ఎలివేట్ చేయకుండా అసంతృప్తిగా ముగించడం మైనస్ పాయింట్లు. లక్కున్నోడు చిత్రంలో ‘లక్కే’ మైనస్ అయ్యింది.