రివ్యూ

దిగివచ్చెను.. భగవంతుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది *** ఓం నమో వేంకటేశాయ
***
తారాగణం: నాగార్జున, సౌరభ్ జైన్, అనుష్క, జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్, రావు రమేష్, రఘుబాబు, బ్రహ్మానందం, విమలారామన్, సంపత్ తదితరులు
సంగీతం: కీరవాణి
కెమెరా: ఎస్ గోపాల్‌రెడ్డి
నిర్మాత: ఎ మహేష్‌రెడ్డి
దర్శకత్వం: కె రాఘవేంద్రరావు
***
భగవంతుడి లీలలు సామాన్యులకు అర్థంకావు. అలాగని పరమ భక్తులకూ ఆయన అంతుచిక్కడు. కాకపోతే -్భక్తితత్పరతతో భక్తుడే భగవంతుడికన్నా గొప్పగా వెలుగొందుతాడు. రామాంజనేయ యుద్ధంలో భక్తితో భగవంతుడిని ఓడించాడు ఆంజనేయుడు. భగవంతుడికన్నా భక్తే గొప్పదని చాటి చెప్పడం కూడా భగవంతుని లీలే. అందుకే -కనిపించని దేవునికన్నా కళ్లెదుట కనిపించే భక్తి గొప్పదన్న నిర్వచనంతో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. భక్తకోటిని మెప్పించాయి. అలాంటిదే ‘ఓం నమో వేంకటేశాయ’ కూడా. తనకన్నా భక్తుడే గొప్పని చెప్పడానికి భగవంతుడు ఎందుకు ప్రయత్నిస్తాడు? అన్నది తెలుసుకోవాలంటే ‘హధీరామ్ బాబా’ కథ చూడాలి.
దేవుణ్ణి కళ్లారా చూసే విద్య నేర్చుకోవాలని ఎక్కడినుంచే వచ్చిన రామ (నాగార్జున) పద్మానందస్వామి (సాయికుమార్) శిష్యరికంలో చదువుకుంటాడు. దేవుడిని చూసే చదువు నేర్పమని అడిగిన శిష్యుడికి తపస్సు చేయమని బోధిస్తాడు గురువు. తపస్సులోవున్న రామకు బాలుడిగా దర్శనమిస్తాడు భగవంతుడు. అది గుర్తించలేక బాలుడిని వెళ్లిపొమ్మంటాడు రామ. తరువాత గృహస్థుగా మారే సమయంలోనూ భగవదానుభవం ఎదురై మళ్లీ అనే్వషణ ప్రారంభిస్తాడు. తపస్సులో వున్నప్పుడు కనిపించిన బాలుడే దేవదేవుడని గురువు చెప్పగా, మళ్లీ ఆ దేవదేవునికై వెతుకులాట ప్రారంభిస్తాడు. అందులో భాగంగా తిరుమల చేరుకుంటాడు. అక్కడ ధర్మకర్త గోవిందరాజులు (రావు రమేష్) భక్తుల పాలిట రాక్షసుడిగా ప్రవర్తిస్తుంటాడు. తిరుమలలో పూజలు చేసుకునే కృష్ణమ్మ (అనుష్క), గుడినుంచి గెంటివేయబడిన రామకు భగవంతుని చేరే ఉపాయం చెబుతుంది. అలా భగవదానే్వషణ చేస్తూనే, తిరుమలలో ధర్మకర్త అరాచకాలకు ఎదురునిలుస్తాడు రామ. ఆ ప్రాంతాన్ని పాలించే రాజు, తిరుమల విషయాలు విచారించి చివరకు రామకే ఆలయ సంరక్షణ బాధ్యత అప్పగిస్తాడు.
మరోవైపు భక్తుడికి- భగవంతుడికి మధ్య జరిగే అంతర్యుద్ధం, అది కూడా భక్తితత్పరతతో సాగేదే! తిరుమలలో తన దేవాలయంలో నిత్య పూజోత్సవాలు జరిపిస్తున్న రామపై వేంకటేశ్వరస్వామి (సౌరభ్ జైన్)కి అవ్యాజ్యమైన కరుణ కలుగుతుంది. అప్పటినుండి తన సేద తీరడం కోసం రామతో పాచికలాడడానికి వెంకన్న దిగివస్తాడు. రామతో పాచికలాటలో ఒకసారి శేషవస్త్రం సహా నగలన్నీ పొగొట్టుకుంటాడు వేంకటేశ్వరుడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న గోవిందరాజులు, రామ ఇంట్లో స్వామి నగలు చూపించి దొంగగా చిత్రీకరిస్తాడు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి -రాక్షసుడు తినేంత ఆహారాన్ని తెల్లారేసరికి తినాలన్న
పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. రామకు సాయం చేయడానికి వచ్చిన స్వామి, గజరాజు రూపంలో ఆహారాన్నంతా ఖాళీ చేస్తాడు. అప్పటినుండి హథీరామ్ బాబాగా పేరుపొందుతాడు రామ.
ఏ కోరిక తీరాలన్నా రామకు చెబితే తనకు చెబుతాడని భగవంతుడే చెప్పడం హాథీరామ్‌కు నచ్చదు. భక్తుడికంటే భగవంతుడిని తక్కువగా చూస్తే ఆలయంలో ఉండలేనని చెప్పి, తిరుమల నుండి వెళ్లిపోవడానికి కంకణం కట్టుకుంటాడు. అలాంటి పరిస్థితిలో భగవంతుడు ఏం చేశాడు? హథీరామ్‌బాబా తిరుమల విడిచి వెళ్లాడా? అనేదే ముగింపు.
హథీరామ్ భక్తికథను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సరళంగా చెప్పడంలో దర్శకుడు రాఘవేంద్రరావు అనుభవం కనిపించింది. సంగీతభరితమైన సినిమా కనుక బాణీలు, నేపథ్య సంగీతంతో కీరవాణి భక్తికథలో ఆర్తిని నింపాడు. గోపాల్‌రెడ్డి కెమెరా పనితనం ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది. దేవదేవుడి లోకాల్లో మనం విహరిస్తున్నట్టే అనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్‌లో దేవునికి ఇష్టమైన అలంకరణలను సెల్యులాయిడ్‌పరంగా బాగా మలిచారు. తిరుమలను అప్పటి కాలానికి తగిన విధంగా మలచిన విధానం ఆకట్టుకుంటుంది. ‘అఖిలాండకోటి బ్రహ్మాండనాయక ఆనంద నిలయ వర పరిపాలక’ పాటను గాయకుడు ఆలపించిన విధానం సినిమాకు హైలెట్. ‘పరీక్ష పెట్టే పరమాత్మునికే ఎంతటి విషమ పరీక్ష, శిష్టుల రక్షణ చేయు స్వామికే శిక్షగా మారిన భక్తుని దీక్ష’ అన్న పాట క్లైమాక్స్‌కు తగినట్టుగా సాగింది. కీరవాణి ఆలపించిన ‘బ్రహ్మాండ భాండముల బల్ సొబగుల బంతులాడు భగవంతుడు, పరమానంద మహాప్రవాహమ్ముల పరవశించు పరంధాముడు’ పాట సన్నివేశానికి తగినట్టుగా సాగింది.
సీనియర్ హీరోగా ప్రయోగాలకు ఎప్పటికప్పుడు పదును పెడుతున్న నాగార్జున -హాథీరామ్‌గా మెప్పించాడు. ఇంతకుముందు చేసిన భక్తి సినిమాలతో స్ట్రాటజిక్ ఎక్స్‌ప్రెషన్స్‌కి ఆడియన్స్‌ని అలవాటు చేసిన నాగ్ -ఈ చిత్రంలోనూ ఆర్ద్రత, కరుణ, ఆవేశం, రౌద్రం, వీరంలాంటివన్నీ రంగరించాడు. సౌరభ్‌జైన్ వేంకటేశ్వరుడి పాత్రకు నిండుదనాన్ని తెచ్చాడు. కృష్ణమ్మ కథ చిన్నదైనా అనుష్క ఇమిడిపోయింది. జగపతిబాబు, సాయికుమార్, రావురమేష్, ప్రగ్యా జైస్వాల్ కనిపించింది కొద్దిసేపే పాత్రలకు న్యాయం చేశారు. జెకె భారవి కథ, కథనాలు ప్రేక్షకుణ్ణి ఒప్పించేలా సాగాయి. కె రాఘవేంద్రరావు మార్క్‌లాంటి పువ్వులు, పండ్ల సీన్లు అక్కడక్కడా కనిపించినా, అవన్నీ దేవదేవుడికి సమర్పించిన నైవేద్యంలానే అనిపిస్తాయి. భక్త్భివం రంగరించి -్భక్తకోటిని మెప్పించింది.

-శేఖర్