రివ్యూ

ప్యాలెస్ దాటని ‘ఆత్మ’కథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* చిత్రం భళారే విచిత్రం (బాగోలేదు)

తారాగణం:
మనోజ్ నందన్, చాందిని, అనిల్ కళ్యాణ్ తదితరులు
సంగీతం:
రాథోడ్
నిర్మాత:
పి ఉమాకాంత్
దర్శకత్వం:
భానుప్రకాష్ బలుసు
గతంలో ఒకసారి ఈ ముచ్చట మాట్లాడుకున్నాం. సందర్భో‘చిత్రం’గా ఉంటుందని మళ్లీ ప్రస్తావిస్తున్నాం. రచయిత ఊహల్లో మెదిలిన ఒకానొక ‘్భవన’ అక్షర రూపం దాల్చింత్తర్వాత.. సినీ ప్రక్రియ ప్రకారం -‘స్టోరీ డిస్కషన్’ అన్న శాఖకి వెళ్తుంది. అక్కడ కథని చీల్చి చెండాడి.. ఏ సన్నివేశానికి ఆ సన్నివేశాన్ని విశే్లషించి.. అనేకానేక ఆలోచనల మలుపుల్తో (?) బయటపడి స్క్రిప్ట్‌గా రూపాంతరం చెందుతుంది. ‘స్టోరీ’ చర్చోపచర్చల్లోనే -దాని సత్తా ఏమిటో తెలిసిపోతుంది. అది పాతకథనా? లేక కొత్తగా చెప్పిందా? లేదా వెరైటీనా? అన్నది ఇట్టే అర్థమవుతుంది. సాధారణ సినీ పరిజ్ఞానం ఉన్న సగటు ప్రేక్షకుడే ఇన్ని తెలివితేటల్తో ఉన్నప్పుడు- విశే్లషణాత్మకంగా.. విడమర్చి మరీ చెబుతున్నప్పుడు.. సినీ పరిశ్రమలో ఉంటూ.. సినిమాని జీర్ణించుకొన్న రచయితలూ.. దర్శకులూ ఇంకెంతగా ఆలోచించాలి. సినిమా మొదలైంది మొదలు- సీటులో కూర్చోవటం బహుకష్టంగా మారింది. ఆ కష్టం ఏమిటో కథలో చూద్దాం. ఓ మధ్యతరగతి యువకుడు శివ (మనోజ్ నందన్). నటుడు కావాలన్న ఆశ అయితే ఉందిగానీ.. ఎంతకీ సఫలం కాదు. అవకాశాల కోసం ఇండస్ట్రీ చుట్టూ తిరగటంతోనే జీవితం వెళ్లమారిపోతోంది. ఈ నేపథ్యంలో శివ ఫ్రెండ్ మదన్ (అనిల్ కళ్యాణ్) తమ పూర్వీకుల భవంతిని అద్దెకివ్వటానికి నిర్ణయించుకొంటాడు. ఓ సినీ యూనిట్ ఆ భవంతిని రెంట్‌కి తీసుకొని సినిమా షూటింగ్ చేద్దామనుకొంటుంది. అనుకోని పరిస్థితుల్లో -శివకి హీరో అవకాశం దొరుకుతుంది. అదీ -తన ఫ్రెండ్ పూర్వీకుల భవంతిలోనే కావటంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. యూనిట్ మొత్తం పాలెస్‌లోకి దిగటం.. షూటింగ్ స్టార్ట్.. లైట్స్ ఆన్.. కెమెరా రోల్ కావటం ఆరంభమవుతుంది. ఆ సినిమా హీరోయిన్ హన్సిక (చాందిని) ఉన్నట్టుండి చిత్రాతిచిత్రంగా ప్రవర్తిస్తూంటుంది. యూనిట్‌లోని ఒక్కొక్కరిని ఒక్కో విధంగా వేధిస్తుంది. ఇంతకీ ఆమెకి పట్టిన ఆత్మ ఎవరు? ఆమె కథాకమామీషు ఏమిటి? షూటింగ్ సజావుగా సాగటానికి శివ ఏం చేశాడు? లాంటి క్లైమాక్స్‌తో కథ ‘్భళీ’ అన్నట్టు నడుస్తుంది.
కథాపరంగా -పాతకథని మళ్లీ తెరపై చూట్టం థ్రిల్ (?) కలిగించింది. మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది. కామెడీ కడుపుబ్బ నవ్వించింది. హీరోయిన్ యాక్షన్ చూస్తే.. ఏ ‘ఆత్మ’ కూడా అంతగా ఇన్‌వాల్వ్ కాదు. అంతగా ఆత్మలా జీవించింది... పచ్చి అబద్ధం అనుకునేరు. నిజం లాంటి నిఝం.
దర్శకుడి ఓపికకి వేనవేల దణ్ణాలు. ఒక్క ముక్కలో చెప్పే కథని -అటు ఇటు తిప్పి రెండు గంటలపాటు సాగదీశాడు. కథంటూ లేని సూత్రానికి కామెడీని మిక్స్ చేయటం పెద్ద సాహసం. థియేటర్‌లో నవ్వుల ఆత్మలు పూయించటానికి చాలా కష్టపడ్డారు. సినిమా బాగోకపోయినంత మాత్రాన ఇంత ఘోరంగా రాయాలా? అని క్వొశ్చన్ చేస్తే.. దానికి ఆన్సర్ లేదు. ఆత్మక్షోభ తప్ప.
నటనాపరంగా -మనోజ్‌నందన్, అనిల్ కల్యాణ్, చాందిని చక్కటి నటన ప్రదర్శించారు. ప్రీ క్లైమాక్స్ సినిమాకి ‘ఆత్మ’. కెమెరా పనితనం బాగుంది. లొకేషన్స్ ఓకే. భానుప్రకాష్ దర్శకత్వం ఫర్వాలేదు. కానీ -కథని ఏమాత్రం పట్టించుకోకుండా.. ఇలా నేల విడిచి రెండు గంటలపాటు సాము చేస్తే ఫలితం శూన్యం. ఇక ఏ శాఖ గురించీ మాట్లాడేందుకు అక్షరాల్లేవు.

-ప్రనీల్