రివ్యూ

ఒకే.. ఒక్కడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు ఫ్యాన్
--

తారాగణం: షారుఖ్‌ఖాన్, వాలుస్చా
డె సౌసా, సయానీ గుప్తా తదితరులు
సంగీతం: ఆండ్రియా గుర్రె - విశాల్ శేఖర్
నిర్మాణం : యష్‌రాజ్
దర్శకత్వం: మనీష్ శర్మ
--

కొన్నాళ్లుగా ‘షారుఖ్’ సినిమాలన్నీ ‘బ్రేక్’ అవుతూ వస్తూన్నాయి. కథల ఎంపికలో - తనదైన వొరవడిని సృష్టించుకొంటున్నప్పటికీ.. వయసు రీత్యా అభిమానులను అతని సినిమాలు అలరించటం లేదా? లేక.. తన ఛార్మింగ్ నటనతో మెప్పించలేక పోతున్నాడా? అన్నది వేధించే ప్రశ్న. పక్కా కథతో.. స్క్రీన్‌ప్లేతో.. అలరించే పాటల్తో.. ఫైట్స్‌తో - పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ప్లాన్ చేసే షారుఖ్‌లోని అద్భుత నటనను చూడాలని అందరూ ఆశించే జవాబు. కారణం ఏదైనప్పటికీ.. ఇండస్ట్రీలో వెనుకబాటు తనానికి గురవుతున్నాడని అందరూ అనుకొంటున్న సమయంలో - ద్విపాత్రాభినయంతో ‘్ఫ్యన్’ను ఎలా ఆకట్టుకొన్నాడో చూద్దాం.
1987లో ‘మిసరీ’ అన్న నవలకిది స్ఫూర్తి. స్టీఫెన్ కింగ్ రాసిన ఆ నవల అత్యధిక అమ్మకాలను సాధించింది. ఈ కథ కొద్దిగా హర్రర్ గానూ.. థ్రిల్లర్‌గానూ.. ఎంటర్‌టైన్‌మెంట్‌గానూ ఉంటుంది. ఐతే- ఆ కథలో కొద్దిగా మార్పులు చేర్పులు చేయటంతో.. షారుఖ్ ‘్ఫ్యన్’గా రూపాంతరం చెందింది.
కథ - సూపర్‌స్టార్ ఆర్యన్ ఖన్నా (షారుఖ్ ఖాన్). ముంబైలో అతణ్ణి అభిమానించని వారు ఉండరు. స్టార్‌గా ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ... అభిమానుల్ని మాత్రం మర్చిపోడు.
పాతికేళ్ల గౌరవ్ (షారుఖ్) వెస్ట్ దిల్లీలోని ఇందర్ విహార్‌లో సైబర్‌కేఫ్ నడుపుతూంటాడు. స్థానికంగా అందరూ అతణ్ణి ‘ఆర్యన్’ అని పిలుస్తూంటారు. అచ్చు ఆర్యన్‌లా తనని తాను డిజైన్ చేసుకోవటంవల్ల.. ఆర్యన్‌లా తానూ మారిపోయానని తరచూ అనుకొంటూంటాడు. లోకల్‌గా స్టేజ్ షోలు ఇచ్చే అతగాడి నటనా కౌశలాన్ని తిలకించి తరించిన జనం ఓ ట్రోఫీని బహూకరిస్తారు. దాన్ని ఎలాగైనా.. స్టార్ ఆర్యన్‌కి చూపించాలన్న ఉబలాటం కొద్దీ ముంబైకి బయల్దేరతాడు గౌరవ్. ఎలా వెళ్తావని తల్లి అడిగితే? - షారుఖ్ ‘బాట’ చూపిస్తాడు. ట్రైన్‌లో ‘వెస్ట్రన్’ కమ్‌బోర్డ్‌లో కూచుని వెళ్తాడు. టిక్కెట్ లేదని టీసీ పట్టుకోవడం... కిటికీలో వేలాడుతూ రావటం.. ఆ తర్వాత ఆర్యన్ అంటే ఎంత అభిమానమో చెప్పటంతో.. ఎట్టకేలకు ముంబై చేరతాడు. ఆర్యన్‌ని కలిసి అభిమానాన్ని చాటుకొందామనుకొంటున్న సందర్భంలో - ఆర్యన్ మీద అభిమానం కొద్దీ... అతడి సినిమాల్లో నటించే ఓ వ్యక్తితో గొడవ పెట్టుకొంటాడు గౌరవ్. ఈ సంగతి తెలిసిన ఆర్యన్ -గౌరవ్ మీద కోప్పడతాడు. దీంతో ఒక్కసారిగా ఆర్యన్ పట్ల ద్వేషాన్ని పెంచుకొంటాడు. తన అభిమానాన్ని ‘్ఫల్’ అవటం లేదని తెగ గింజుకుంటాడు. అప్పట్నుంచీ ఆర్యన్ జీవితంలో విలన్‌గా మారిపోతాడు గౌరవ్.
ఆ తర్వాత ఏం జరిగిందన్నది క్లైమాక్స్.
ఎంతో సాదాసీదాగా కనిపించిన ఈ కథని ‘షారుఖ్’ తన నటనతో ఏ విధంగా మలచాడన్నది స్క్రీన్‌పై చూడాల్సిందే. ద్విపాత్రాభినయంలో అద్భుత నటనను ప్రదర్శించి.. ‘్ఫ్యన్’ను ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. ఆర్యన్‌గా సూపర్‌స్టార్ నటనని చూపి.. అదే స్థాయిలో ‘గౌరవ్’గా విలనిజంతో ఆకట్టుకొన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే - వన్‌మేన్ ఆర్మీగా కథని తన భుజస్కంధాలపై మోసాడు. హీరో కంటే కూడా విలన్‌గా తన సత్తా ఏమిటో మరోసారి చూపాడు. అభిమానులను అలరించే రీతిలో అతని నటన సాగింది.
ఫస్ట్‌హాఫ్‌లో చూపిన శ్రద్ధ సెకండ్ హాఫ్‌కి వచ్చేప్పటికి దర్శకుడు పట్టించుకోలేదేమో అనిపిస్తుంది. ఆర్యన్ చిన్ననాటి సంఘటనలు మొదలుకొని.. సూపర్ స్టార్‌గా ఎదిగిన క్రమాన్ని చూపిస్తూ - ఆ రీల్‌ని ‘గౌరవ్’ రూంకి ఎటాచ్ చేయటం బాగుంది. ట్రైన్‌లో టికెట్ లేకుండా ప్రయాణించటం.. సినీ జీవితాన్ని ఆరంభించక ముందు ఆర్యన్ ఉన్న ‘హోటల్’లోనే గౌరవ్ ఉండటం.. ఇవన్నీ కొద్దిగా సినిమాలోకి వెళ్లటాన్ని మూడ్‌ని కల్పించినప్పటికీ.. రాన్రాను కథలో ‘రివెంజ్’ తప్ప మరేదీ మిగలక పోవటం నిరాశ కలిగిస్తుంది. ఐతే లాజిక్‌కి దొరకని కొన్ని ప్రశ్నలూ వెంటాడుతాయి. సాదాసీదాగా బతికే కుర్రాడు ‘స్టార్’ని కలవటం వరకూ ఫర్వాలేదుగానీ.. అతగాణ్ణి ‘్ఢ’ కొనడం.. ఆర్యన్ కోసం విదేశాలకు వెళ్లటం.. మింగుడు పడని వ్యవహారం. ఎందుకంటే- ముంబై వెళ్లటానికే డబ్బుల కోసం వెతుక్కొనే ‘గౌరవ్’కి ఇది ఎలా సాధ్యపడిందో అర్థంకాలేదు. ఇంకొన్ని చోట్ల కూడా ‘లాజిక్’ మిస్సయింది. ఇదొక రొటీన్ సినిమాగా కొట్టిపారేసినా.. షారుఖ్ నటన ముందు అవన్నీ దిగదుడుపే. గౌరవ్ రోల్ కోసం ‘ప్రొస్థటిక్’ మేకప్ వేసుకొన్న షారుఖ్ నిజంగా ఆ పాత్రలో వొదిగిపోయాడు.
నటనాపరంగా - ఆయా పాత్రధారులంతా ఫర్వాలేదనిపిస్తారు. కానీ - ఈ సినిమాకి షారుఖ్ ఒక్కడే ప్లస్ పాయింట్. స్క్రీన్‌ప్లే బాగుంది. సంగీతం ఓకే.

-ప్రనీల్