రివ్యూ

సమ్మోహనం ** ఫర్వాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
సుధీర్‌బాబు, అదితిరావు హైదరి, సీనియర్ నరేశ్, పవిత్రా లోకేష్,
తనికెళ్ల భరణి, నందు, కేదార్ శంకర్, కాదంబరి కిరణ్, హరితేజ,
రాహుల్ రామకృష్ణ, శశిశర్మ, హర్షిణి తదితరులు.

ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేశ్
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: పి.జి విందా
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
రచన, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ

*************************************************

స్టార్ ఇమేజ్ కాకుండా కథా బలాన్ని నమ్ముకొని సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ శైలేవేరు. అష్టాచమ్మా, జెంటిల్‌మెన్, అమీతుమీ వంటి సినిమాలతో ఆకట్టుకున్న ఆయన ఈసారి సమ్మోనపరిచే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తొలి చిత్రం ‘గ్రహణం’ నుండి నేటి వరకు ఆయన పంథాలో ఎలాంటి మార్పులేదు. ఓ మధ్య తరగతి కుర్రాడు, స్టార్ హీరోయిన్ మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుంది? అనే విషయాన్ని చూపిస్తూనే సినిమా వాళ్ల పరిస్థితులను కూడా అందంగా అందరూ హాయిగా వినోదంలో మునిగేలా ‘సమ్మోనం’లో తెరకెక్కించారు ఇంద్రగంటి.

తెలుగు చిత్రసీమలో ఇంద్రగంటి మోహనకృష్ణకు దర్శకుడిగా ఓ ప్రత్యేక ఇమేజ్ వుంది. తెరపై చూపాలనుకున్న విషయాన్ని ప్రేక్షకులకు నచ్చే విధంగా చూపిస్తూనే చెప్పాలనుకున్నది ఎక్కడా మిస్ అవ్వకుండా ప్రేక్షకుడి గుండెను తాకేలా చేప్పే దర్శకుల్లో ఆయన ముందుంటారు. స్టార్ ఇమేజ్ కాకుండా కథా బలాన్ని నమ్ముకొని సినిమాలు తెరకెక్కించే దర్శకుడాయన. అష్టాచమ్మా, జెంటిల్‌మెన్, అమీతుమీ వంటి సినిమాలతో ఆకట్టుకున్న ఇంద్రగంటి ఈసారి సమ్మోనపరిచే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తొలి చిత్రం ‘గ్రహణం’ నుండి నేటి వరకు ఆయన పంథాలో ఎలాంటి మార్పులేదు. ఓ మధ్య తరగతి కుర్రాడు, స్టార్ హీరోయిన్ మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుంది? అనే విషయాన్ని చూపిస్తూనే సినిమా వాళ్ల పరిస్థితులను కూడా అందంగా అందరూ హాయిగా వినోదంలో మునిగేలా ‘సమ్మోనం’లో తెరకెక్కించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ విధంగా సమ్మోహన పరిచిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
విజయ్‌కుమార్ అలియాస్ విజ్జు (సుధీర్‌బాబు) అందరు అబ్బాయిల్లా గర్ల్‌ఫ్రెండ్స్, సినిమాలు షికార్లు అంటూ తిరగటం ఇష్టంలేని కుర్రాడు. కాస్త భిన్నంగా ఆలోచించే అలవాటున్న విజ్జు బొమ్మలతో చిన్న పిల్లల కథల పుస్తకం గీస్తుంటాడు. ఎలాగైనా ‘అనగనగా పబ్లికేషన్స్’ ద్వారా తన బొమ్మల పుస్తకాన్ని విడుదల చేయించే ప్రయత్నాల్లో ఉంటాడు. సర్వేష్ (సీనియర్ నరేశ్), విజ్జు తండ్రి సినిమాల మీద ఇష్టంతో వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకొని సినిమా ప్రయత్నాలు చేస్తుంటాడు. తన ఇంట్లో షూటింగ్ చేసుకొనిస్తే వేషం ఇస్తానని చెప్పడంతో ఓ సినిమా షూటింగ్‌కు ఇల్లు ఫ్రీగా ఇచ్చేస్తాడు సర్వేష్. ఆ సినిమాలో హీరోయిన్ సమీరా రాథోడ్ (అదితిరావు హైదరీ). షూటింగ్ ప్రారంభమైన తర్వాత తెలుగు మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్న సమీరాకు విజ్జు కోచింగ్ ఇస్తాడు. ఈ ప్రాసెస్‌లో ఒకరి మీద ఒకరికి ఇష్టం కలుగుతుంది. షూటింగ్ తర్వాత కూడా సమీరాను మర్చిపోలేని విజ్జు ఆమెను కలిసేందుకు కులుమనాలీ వెళ్లి తన ప్రేమ విషయాన్ని చెబుతాడు. కానీ సమీరా తనకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పటంతో విజ్జు సమీరా మీద కోపం పెంచుకుంటాడు. అలా దూరమైన సమీరా, విజ్జులు తిరిగి ఎలా ఒక్కటయ్యారు? అసలు సమీరా, విజ్జు అంటే ఇష్టం లేదని ఎందుకు చెప్పింది? అన్నదే క్లైమాక్స్.
పేరుకు ఇది ప్రేమకథే అయినా సినిమా ఆద్యంతం ఎక్కడికక్కడ ఉపనదులు కలుపుకొని ప్రవహించే జీవనదిలా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో హీరోయిన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కాస్త కామన్‌గా ఉంటుంది. డైలాగులు బావున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు గొప్పదనం గురించి, సినిమా వాళ్లను చూసి మామూలు జనాలు చెప్పుకొనే మాటలను చాలా రాశారు. తెలుగు ప్రాముఖ్యత గురించి చెబుతూనే మరోవైపు హీరోతో పాటు హీరో తల్లి తదితర పాత్రలన్నీ ఇంగ్లీష్‌లో సంభాషణలు చెప్పడం కాసింత అసహజంగా అనిపిస్తుంది. కానీ సినిమాలో హీరో ఫ్యామిలీని అప్పర్ మిడిల్‌క్లాస్‌గా చూపించారు కాబట్టి ఫర్వాలేదనుకోవచ్చు. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరింది. పాటలు కూడా చాన్నాళ్ల తర్వాత బాగా అర్థవంతంగా అనిపించాయి. చిన్నపాటి కథను సినిమాగా మలిచి ఎక్కడా బోర్ కొట్టకుండా పాజిటివ్ వేలో చెప్పి ఆకట్టుకున్నాడు. నిర్మాణ విలువలు బావున్నాయి. ఆర్ట్, కెమెరా వర్క్ ఓకే. హీరో సుధీర్‌బాబు గత చిత్రాలతో పోలిస్తే మనిషి చాలా గ్లామర్‌గా కనిపించాడు. ఎక్స్‌ప్రెషన్స్ కూడా అదిరిపోయాయి. హీరోయిన్ అదితిరావు నోట తెలుగు మరింత మధురంగా వినిపించింది. ఆమె అందం, నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. నరేష్, పవిత్ర లోకేష్‌లు వాళ్ల పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమాపై తపన ఉన్న వ్యక్తి పాత్రలో నరేష్ చక్కని హాస్యాన్ని పండించారు. నవ్వించడంతో పాటు, అక్కడ హృదయాల్ని బరువెక్కించేలా సాగుతుంది ఆయన పాత్ర. నటీనటులంతా వారి పాత్రల పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు. తొలి సగభాగం సినిమా అంతా కూడా విజయ్ ఇంట్లో ఇరవై రోజులు షూటింగ్ సందడి.. సమీరతో ప్రేమలో పడే సన్నివేశాలతోనే సాగుతుంది. మలి భాగంలో కాస్త డ్రామాని జోడించారు. కథానాయిక సమీర జీవితం వెనక ఉన్న సంఘటనల్ని చూపించారు. అవన్నీ సహజంగా నటుల జీవితాల్ని కళ్లకు కడుతున్నట్టుగా అనిపిస్తాయి. మొత్తం మీద స్వచ్ఛమైన వినోదంతో సాగి ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఫర్వాలేదనిపిస్తుంది.

-రతన్