రివ్యూ

ఇద్దరూ.. ఇంకోటైపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవదాస్ ** ఫర్వాలేదు
**
తారాగణం: నాగార్జున, నాని, రష్మిక మండన, ఆకాంక్ష సింగ్ తదితరులు
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సంగీతం: మణిశర్మ
నిర్మాత: అశ్వనీదత్
దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
**
వెటరన్ అన్న మాటకు దూరంగా నాగార్జున తన ఇమేజ్‌ను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఒక్కో సినిమాతో స్టార్ ఇమేజ్‌ను పెంచుకుంటూ నాని అడుగులేస్తున్నారు. రెండు జనరేషన్‌ల కాంబోగా మల్టీస్టారర్ ఇమేజ్‌తో వచ్చిన సినిమా -దేవదాసు. స్టార్ ఇమేజ్ హీరోలు ఇద్దరూ ఒక స్క్రీన్‌పై సందడి చేస్తే.. ఫ్యాన్స్‌కు ఓ రేంజ్ అందినట్టే. ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుటైతే.. అబ్బో సినిమా వేగాన్ని ఇక చెప్పక్కర్లేదు. ఈ దేవదాస్ అలాంటి సందడి చేస్తోంది. ఎన్నో భారీ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన వైజంయంతీ మూవీస్ బ్యానర్‌లో ఎన్ (నాగ్-నాని) క్రేజీ కాంబినేషన్‌తో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన దేవదాస్ కథ ఇది. ఆనాటి దేవదాసు ఓ క్లాసిక్. ఈ దేవా-దాస్‌లది మ్యాజిక్. ఎలా ఆకట్టుకున్నారో చూద్దాం.
**
దేవ ఓ అనాధ (నాగార్జున). తరువాత డాన్‌గా మారతాడు. అనుకున్నది చేసెయ్యడం అతని తత్వం. అది ప్రాణాలు తీయడమైనా.. ఇంకేదైనా? ఎంతోకాలంగా ఇండియాను శాసించే దేవా ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. దేవా కోసం పోలీసుల అనే్వషణ నిరంతరం సాగుతూనే ఉంటుంది. దేవాకి వ్యతిరేకంగా ఓ గ్యాంగ్ తయారవుతుంది. ఎలాగైనా దేవాని ఇండియా రప్పించడానికి పథకం పన్నుతారు. అందులో భాగంగానే దేవాని పెంచి పెద్ద చేసిన దాదా (శరత్‌కుమార్)ని చంపేస్తారు. దాంతో దాదాని చంపినవాళ్లని వెతుక్కుంటూ దేవా హైదరాబాద్ వస్తాడు. పోలీస్ కాల్పుల్లో దేవాకి గాయాలవుతాయి. చికిత్స కోసం డాక్టర్ దాస్ (నాని) ఆసుపత్రికి వస్తాడు. దాస్ మంచోడు, అమాయకుడు, నిజాయితీపరుడు. పేషెంట్‌ల ప్రాణరక్షణే ధ్యేయంగా పని చేసే వైద్యుడు. అలా దేవాని కాపాడతాడు. దాసు మంచి మనసుకు ఫిదా అయిన దేవా, స్నేహం చేస్తాడు. ఒరిజినల్‌గా మంచోడైన దేవా అంటే దాసుకు మంచి ఫీలింగ్ ఏర్పడటంతో ఇద్దదూ మంచి స్నేహితులు అవుతారు. విషయం తెలిసిన తరువాత దేవాలోని మంచిని వెలికితీసి, అతన్ని మంచోడిలా మార్చడానికి ప్రయత్నిస్తాడు దాస్. ఆ ప్రయత్నం ఎంతవరకూ సఫలీకృతమైంది? దేవాని దాసు మార్చాడా? లేదా దాసుని.. దేవా తనవైపునకు తిప్పుకున్నాడా? అన్నది కథ.
తెలుగులో డాన్ సినిమాలు లెక్కలేనన్ని. డాన్ కోసం పోలీసుల వేట, అతను దొరక్కుండా తప్పించుకోడవం.. ఇవన్నీ ఆడియన్స్‌కి రొటీన్ సన్నివేశాలే. వాటికి కాస్తంత హ్యూమర్ జోడించి.. పెద్దస్టార్‌తో కొత్తతరహా ట్రీట్‌మెంట్ ఇవ్వడమే చిత్రంలోని ప్రధానాంశం. ఇద్దరు హీరోల కథగా మార్చి ‘దేవదాస్’ టైటిల్ ఇమేజ్‌కు ‘దేవా-దాస్’తో కొత్తఫ్లేవర్ అద్దే ప్రయత్నమే కనిపించింది. అందుకు స్టార్ ఇమేజ్‌తోవున్న నాగ్ -నానీల కాంబినేషన్ తీసుకున్నారు. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేందుకు వీళ్లిద్దరూ ఉన్న పోస్టర్లు చాలు. అందుకే ‘కథ’పై పెద్దగా దృష్టి పెట్టలేదు. దేవ, దాసు ఇద్దరూ కలిసేవరకూ.. సినిమా అటూ ఇటూ ఊగిసలాటలా నడుస్తుంది. వాళ్లిద్దరూ కలిసిన తరువాతే -సుతిమెత్తని ఫన్ జనరేటైంది. నాగ్, నానిల కెమిస్ట్రీ, వాళ్లమధ్య నడిచే సన్నివేశాలు వినోదాన్ని అందిస్తాయి. రెండు తరాల హీరోల్ని పక్కపక్కన చూస్తూ.. వాళ్ల మధ్య కెమిస్ట్రీని ఎంజాయ్ చేయొచ్చు. ఇద్దరూ మందు కొట్టడం, లవ్ స్టోరీల గురించి చర్చించడం.. దేవ ఫోన్ చేస్తే.. ఆ ఫోన్‌లోనే దాసు ముద్దుల గురించి వివరించడం, చివర్లో ‘ప్రాణం తీసే నీకే అంత ఉంటే, ప్రాణం పోసే డాక్టర్ని నాకెంత ఉండాలి’ అంటూ ఇద్దరిమధ్య వచ్చే కాన్‌ఫ్లిక్ట్.. ఇవన్నీ రొటీన్ తెలుగు నేటివిటీలోనే డిజైన్ చేశారు. నాగార్జున, నాని ఇద్దరే సినిమాకు ప్రాణం. నాగ్ గ్లామర్‌గా కనిపించాడు. లుక్, స్టైల్‌పై శ్రద్ధపెట్టాడు. నిజానికి దేవాలాంటి పాత్రలు నాగ్‌కు టైలర్ మేడ్. ‘నా కాలేజీ రోజుల్లో’ అంటూ చెప్పే ఫ్లాష్‌బ్యాక్‌లో మాత్రం నాగ్ విగ్గు, వేషధారణ ఒకింత వెటకారం అనిపిస్తుంది. నాని కామెడీ టైమింగ్ సినిమాకి ప్లస్. మామూలు డైలాగ్‌నీ టైమింగ్‌తో మరోస్థాయికి తీసుకెళ్లాడు. రష్మిక, ఆకాంక్ష ఇద్దరివీ అతిథి పాత్రల్లాంటివే. గీత గోవిందం సక్సెస్ తరువాత ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్రలో రష్మిక కనిపించింది. మిగతా పాత్రల్లో నటీనటులు పరిధిమేరకు చేశారు.
సినిమాకు కెమెరా వర్క్ ప్లస్‌పాయింట్. మణిశర్మ పాటలు ఓకే. పైగా మేకింగ్‌లో రిచ్‌నెస్‌తో ఆకట్టుకున్నారు. సాధారణమైన కథని హీరోలు, కాస్టింగ్, కెమెరా, సంగీతం- అన్నీ కలిసి బోరింగ్‌కు దూరంగా నిలబెట్టాయి. డైలాగుల్లో అక్కడక్కడా పదును కనిపించింది. ‘మనిషిని బ్రతికించే డాక్టర్లున్నట్టు, మనిషిలోని మంచినీ బతికించే డాక్టర్లుంటే బాగుంటుంది’ అనేది ఒకటి. తనకిచ్చిన స్క్రిప్ట్‌కి న్యాయం చేయడానికి ప్రయత్నించాడు దర్శకుడు. వైజయంతి మూవీస్ స్థాయికి తగ్గట్టున్నాయి నిర్మాణ విలువలు. కామెడీతో కూడిన సందేశాత్మక చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనుకొని చేసిన ప్రయత్నం పూర్తిస్థాయిలో మాత్రం వర్కవుటవ్వలేదు. ముఖ్యంగా సినిమా ప్రారంభంలో మొదటి 20 నిమిషాలు బోర్ ఫీలవుతాం. నాగార్జున వచ్చాక స్టోరీలో రన్ పెరిగింది. సినిమాలో చాలా సన్నివేశాలు సాగదీతే. నాగ్, నాని పాత్రల్లోని కామెడీ ఆకట్టుకుంది. నాగ్-ఆకాంక్ష, నాని-రష్మికల ట్రాక్ పెద్దగా ఆకట్టుకోలేదు. థిన్ లైన్ స్టోరీ కావడంతో ట్విస్ట్‌ల్లో బలం కనిపించలేదు. స్టార్ హీరోలను వాడుకోవడంలో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కొలమానం తప్పింది. డాన్‌ని పట్టుకోడానికి పోలీసు ప్రయత్నాలు, అండర్ కవర్ ఆపరేషన్లు.. సల్లీ సీనే్ల. రోడ్లపై దర్జాగా తిరగడం, పోలీసుల ముందునుంచే వెళ్తుండటం.. కామెడీకే వదిలేశారు. కథ విషయంలో తలెత్తిన కన్‌ఫ్యూజ్ కూడా ‘దేవ-దాస్’ స్థాయి పెంచలేకపోయింది.

-త్రివేది